అన్వేషించండి
Advertisement
Manushi Chhillar: చరణ్ తో డేట్ కి వెళ్లాలనుంది - మిస్ వరల్డ్ కామెంట్స్ విన్నారా?
'సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎవరితోనైనా డేట్ వెళ్లాలనుకుంటే ఎవరితో వెళ్తారు..?' అని మానుషిని ప్రశ్నించగా.. ఆమె టక్కున రామ్ చరణ్ పేరు చెప్పింది.
2017లో మిస్ వరల్డ్ గా ఎన్నికైన మానుషి చిల్లర్.. ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో 'పృథ్వీరాజ్' అనే సినిమాను రూపొందించారు. ఇందులో హీరోయిన్ గా మానుషీ కనిపించనుంది. జూన్ 3న ఈ సినిమా విడుదల కానుంది. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మానుషి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంది.
ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చింది. 'సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎవరితోనైనా డేట్ వెళ్లాలనుకుంటే ఎవరితో వెళ్తారు..?' అని మానుషిని ప్రశ్నించగా.. ఆమె టక్కున రామ్ చరణ్ పేరు చెప్పింది. కానీ అది చాలా కష్టమని.. రామ్ చరణ్ కి ఆల్రెడీ పెళ్లైందని చెప్పుకొచ్చింది. అయితే తను డేట్ కి వెళ్లాలనుకుంటే ముందుగా సినిమాకి వెళ్లి ఆ తరువాత డిన్నర్ కి వెళ్తానని చెప్పుకొచ్చింది.
ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ.. అతడు గొప్ప నటుడని, అతడిని స్క్రీన్ పై చూడడానికి ఇష్టపడతానని.. ఆయనతో కలిసి వర్క్ చేయాలనుందని చెప్పుకొచ్చింది. మానుషి చిల్లర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రామ్ చరణ్ ఫ్యాన్స్ దీనికి సంబంధించిన వీడియో తెగ షేర్ చేస్తున్నారు. నిజంగానే మానుషికి చరణ్ తో కలిసి నటించే ఛాన్స్ వస్తుందేమో చూడాలి. అదే జరిగితే ఫ్రెష్ కాంబినేషన్ ను తెరపై చూడొచ్చు!
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
నిజామాబాద్
మొబైల్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion