Poorna Engagement: పెళ్లి చేసుకోబోతున్న పూర్ణ - ఆమెకు కాబోయే భర్త ఎవరంటే?
నటి పూర్ణ పెళ్లికి రెడీ అయ్యారు. ఆమె నిశ్చితార్థం జరిగింది. ఆమెకు కాబోయే భర్త ఎవరో తెలుసా?
కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, రియాలిటీ షోస్‌లో జడ్జ్‌గా సందడి చేస్తున్న పూర్ణ అలియాస్ షమ్నా ఖాసీం (Poorna Shamna Kasim) త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టనున్నారు. తనకు నిశ్చితార్థం (poorna engagement) జరిగినట్లు ఈ రోజు ఆమె వెల్లడించారు. కాబోయే భర్త షానిద్ అస్ఫాలీతో దిగిన ఫోటోను ఆమె పోస్ట్ చేశారు.
''కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో నా జీవితంలో తదుపరి అధ్యాయంలో అడుగు పెడుతున్నాను. నిశ్చితార్థం జరిగింది. ఇట్స్ అఫీషియల్'' అని పూర్ణ పేర్కొన్నారు.
పూర్ణకు కాబోయే భర్త షానిద్ అస్ఫాలీ (Poorna Fiance Shanid Asifali) వ్యాపారవేత్త. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు ఆయన సీఈవో, ఫౌండర్. జుమా అల్మెహరి అనే కంపెనీని సైతం స్థాపించారు. ఆఫీసు ప్రారంభించడానికి అవసరమైన సర్వీసులను అందించడంతో పాటు వీసా ప్రోసెసింగ్, ఫ్లైట్ టికెటింగ్ వంటి పలు సర్వీసులను షానిద్ అస్ఫాలీ కంపెనీ అందిస్తుందని తెలుస్తోంది.
Also Read: సింగర్ కేకే మృతిపై అనుమానాలు - అసహజ మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు
'అఖండ' సినిమాలో పూర్ణ కీలక పాత్రలో కనిపించారు. 'బ్యాక్ డోర్'తో కథానాయికగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. ఇటీవల 'కామెడీ స్టార్స్ ధమాకా', 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వంటి రియాలిటీ షోస్‌లో జడ్జ్‌గా సందడి చేశారు.
Also Read: శ్రీకృష్ణుని చరిత్ర, ద్వారకా నగరాన్ని టచ్ చేస్తున్న హీరో నిఖిల్ - 'కార్తికేయ 2' ఫస్ట్ లుక్
View this post on Instagram