KK Death: సింగర్ కేకే మృతిపై అనుమానాలు - అసహజ మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు
గాయకుడు కేకే మరణంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కోల్‌కతాలో గాయకుడు కేకే అలియాస్ కృష్ణకుమార్ కున్నత్ (Krishnakumar Kunnath - KK Death) కార్డియాక్ అరెస్ట్‌తో మరణించిన విషయం విధితమే. అయితే, ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం వ్యక్తం అవుతున్నాయి.
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో 'అసహజ మరణం'గా కేసు నమోదు అయ్యింది. ఏబీపీ న్యూస్‌కు అందించిన సమాచారం ప్రకారం... ఇన్వెస్టిగేషన్‌లో కేకే తల, పెదవులపై బ్లాక్ స్పాట్స్‌ను పోలీసులు గుర్తించారట. కేకే బస చేసిన హోటల్ స్టాఫ్, ఈవెంట్ ఆర్గనైజర్లను పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. మృతికి గల కారణాలను అన్వేషించే పనిలో ఉన్నారట.
ప్రస్తుతం కేకే పార్థీవ దేహం సిఎంఆర్ఐ ఆసుపత్రిలో ఉంది. తనకు బాలేదని కేకే చెప్పిన వెంటనే ఆయన్ను ఆ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ నుంచి ఎస్ఎస్‌కెఎమ్ ఆసుపత్రికి తీసుకు వెళ్లనున్నారు.
Also Read: కోటి రూపాయలు ఆఫర్ చేసినా పెళ్లిలో పాడలేదు - అదీ సింగర్ కేకే క్యారెక్టర్
కోల్‌కతాలోని గురుదాస్ కాలేజీ వార్షోకోత్సవ వేడుకలో కేకే లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి వెళ్లారు. అక్కడ అనారోగ్యంతో మృతి చెందారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కేకే పలు హిట్ సాంగ్స్ పాడారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read: ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణం - స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తూనే - ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
Also Read: హలో డాక్టర్ నుంచి చెలియా చెలియా దాకా - కేకే తెలుగులో పాడిన సూపర్ హిట్స్ ఇవే
View this post on Instagram