Singer KK Telugu Hits: హలో డాక్టర్ నుంచి చెలియా చెలియా దాకా - కేకే తెలుగులో పాడిన సూపర్ హిట్స్ ఇవే!
ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (కేకే) తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. వాటిలో కొన్ని ఇవే.
ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నత్ (కేకే) మంగళవారం కోల్‌కతాలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కేకే హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌ను ఆలపించారు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌ను మనం విన్నది ఆయన స్వరంతోనే.
1994లో వచ్చిన డబ్బింగ్ సినిమా ప్రేమదేశంలో కాలేజ్ స్టైల్, హలో డాక్టర్ లాంటి సూపర్ హిట్ సాంగ్స్‌తో తెలుగులో ఆయన ప్రస్థానం మొదలైంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
ఖుషిలో ఏ మేరా జహా సాంగ్ యూత్‌ను అప్పట్లో ఎంత ఉర్రూతలూగించిందో మనం మర్చిపోలేం. ఈ పాటను మణిశర్మ స్వరపరిచారు.
అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జైరాజ్ స్వరపరిచిన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌ను కూడా ఆయన పాడారు. వాసులో పాటకు ప్రాణం, ఘర్షణలో చెలియా చెలియా, అపరిచితుడులో కొండకాకి కొండెదాన, మున్నా సినిమాలో రెండు పాటలను ఆయన పాడారు.
అలాగే ఆర్యలో ఫీల్ మై లవ్, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ల్ చైలా చైలా, నా ఆటోగ్రాఫ్‌లో గుర్తుకొస్తున్నాయి, గుడుంబా శంకర్‌లో లే లే లెలే, జల్సాలో మై హార్ట్ ఈజ్ బీటింగ్, ఓయ్‌లో వెయిటింగ్ ఫర్ యు, ఆర్య 2లో ఉప్పెనంత, ప్రేమ కావాలిలో మనసంతా ముక్కలు చేసి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో టైటిల్ సాంగ్... తన పాటల్లో కొన్ని ప్రముఖమైనవి.
2014లో ఎవడు సినిమాలో ‘చెలియా చెలియా’ పాటను కూడా ఆయన పాడారు. అదే సంవత్సరం హిందీ సినిమా ఆషికి 2కి రీమేక్‌గా తెరకెక్కిన నీ జతగా నేనుండాలి సినిమాలో పాడిన ‘కనబడునా’ అనేది కేకే చివరి పాట. భౌతికంగా మనకు దూరమైనా కేకే తన పాటల ద్వారా ఎప్పుడూ మనతోనే ఉంటారు.
View this post on Instagram