అన్వేషించండి

Stock Market News: పడి లేచిన అదానీ స్టాక్స్- భారీ లాభాల్లో సెన్సెక్స్ అండ్‌ నిఫ్టీ- రూ.5.50 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

Adani Group Stocks: అదానీ గ్రూప్ స్టాక్స్ క్షీణతతో ప్రారంభమైన మార్కెట్లు ముగింపు దశలో భారీ లాభాలు అందుకున్నాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.5.50 లక్షల కోట్లు పెరుగుదల కనిపించింది.

Stock Market Today: అదానీ గ్రూప్ షేర్ల కొనుగోళ్లు పుంజుకోవడం, ఐటీ షేర్లు, రిలయన్స్ షేర్లు జోరుతో స్టాక్ మార్కెట్ స్పీడ్ అందుకుంది. రెండు రోజులుగా డల్‌గా సాగుతున్న మార్కెట్‌లో కొత్త జోష్ నింపాయి. దీంతో భారత స్టాక్ మార్కెట్ బలమైన ర్యాలీని చూస్తోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 1500 పాయింట్లకుపైగా పెరిగి 79,000 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ మళ్లీ 79000 ని టచ్ చేసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా పెరుగుదలను చూస్తోంది. నిఫ్టీ50 ఇండెక్స్ 500 పాయింట్లకుపైగా జంప్‌తో 23,800 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 28 షేర్లు సూపర్ 
సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 28 స్టాక్‌లు లాభాలతో ట్రేడవుతుండగా, 2 మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 48 లాభాలతో, 2 నష్టాలతో ట్రేడవుతున్నాయి. SBI 4.27%, అల్ట్రాటెక్ సిమెంట్ 2.67%, బజాజ్ ఫైనాన్స్ 2.65%, టైటాన్ 2.45%, HCL టెక్ 2.40%, ITC 2.37%, భారతీ ఎయిర్‌టెల్ 2.23% లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ 0.25%, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 0.20% క్షీణతతో ట్రేడవుతున్నాయి.

మళ్లీ దూసుకెళ్లిన అదానీ షేర్లు 
భారీగా పతనమైన అదానీ గ్రూప్ షేర్లు మళ్లీ రీ బౌన్స్ అయ్యాయి. ఏసీసీ 3.81 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2.40 శాతం, అదానీ పోర్ట్స్ 2.54 శాతం, అంబుజా సిమెంట్ 3.60 శాతం వృద్ధితో ట్రేడవుతున్నాయి.

ఇన్వెస్టర్ల సంపద రూ.5.50 లక్షల కోట్లు పెరుగుదల
స్టాక్ మార్కెట్ పెరుగుదల కారణంగా పెట్టుబడిదారుల సంపదలో భారీ హైక్ వచ్చింది. బిఎస్‌ఇలో లిస్టయిన షేర్ల మార్కెట్ క్యాప్ గత సెషన్‌లో రూ.425.38 లక్షల కోట్లు ఉన్న సంపద రూ.430.98 లక్షల కోట్లకు చేరుకుంది. నేటి సెషన్‌లో ఇన్వెస్టర్ల సంపదలో రూ.5.60 లక్షల కోట్లు పెరుగుదల కనిపించింది. 

నేటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్ ఐటీ, ఆటో, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్స్, రియల్ ఎస్టేట్, ఇంధనం, ఇన్‌ఫ్రా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లు కూడా లాభపడ్డాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Admitted to AIIMS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Admitted to AIIMS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అనారోగ్యం - శ్వాసకోశ సమస్యలతో ఎయిమ్స్‌లో చేరిక
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
GTA 6: జీటీఏ 6 రిలీజ్ అయ్యేది ఎప్పుడు - ధర ఎంత ఉండవచ్చు?
జీటీఏ 6 రిలీజ్ అయ్యేది ఎప్పుడు - ధర ఎంత ఉండవచ్చు?
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Embed widget