అన్వేషించండి

TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?

Tirumala: టీటీడీలో అన్య మత ఉద్యోగుల్ని గుర్తించేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించే అవకాశం ఉంది. అధికారికంగా అయితే 31 మంది ఉన్నట్లుగా గుర్తించారు.

TTD  Other Religions Employees: తిరుమల తిరుపతి దేవస్థానంలో సంస్కరణలకు కొత్త బోర్డు చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తోంది. టీటీడీలో హిందూ ఉద్యోగులు మాత్రమే ఉండాలని తొలి సమావేశంలోనే నిర్ణయం తీసుకుంది.  ఇందులో భాగంగా మొత్తం టీటీడీ ఉద్యోగుల్లో ఎంత మంది హిందూయేతర ఉద్యోగులు ఉన్నారో లెక్కలు తీసింది. మొత్తంగా 31 మంది ఉద్యోగులు ఉన్నట్లుగా అధికారికంగా ధృవీకరించారు. వీరంతా సర్టిఫికెట్ల ప్రకారమే ఇతర మతాలకు చెందిన వారు. వీరు కోరుకుంటే ఇతర శాఖలకు పంపిస్తారు. లేకపోతే వీఆర్ఎస్ ఇస్తారు. అయితే అసలు సమస్య వీరు కాదు.. మాత మార్పిడి చేసుకున్నవారు. 

మత మార్పిడి చేసుకున్న టీటీడీ ఉద్యోగులు ఎంత మంది ?

తిరుమల తిరుపతి దేవస్థానంకు మొదటి నుంచి ఉన్న సమస్య డైరక్ట్ గా ఇతర మతాల కు చెందిన సర్టిఫికెట్లు ఉండి ఉద్యోగంలో చేరిన వారు కాదు. వారిని సులువుగా గుర్తించి బయటకు పంపేయగలరు.కానీ  హిందువులుగా ఉంటూ మతం మారిన వారే అసలు సమస్య . వారు శ్రీవారి భక్తుల మ్మును జీతంగా తీసుకుంటూ మతం మారిపోయి వేరే దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. అలా చేయడమే కాకుండా శ్రీవారి సన్నిధిలో అన్యమత ప్రచారానికి సహకరిస్తున్నారు. వీరి వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. తరచూ అన్యమత ప్రచారం జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎవరో సహకరించకపోతే అలాంటి పరిస్థితి ఉండదని భావిస్తున్నారు. 

Also Read: పవన్‌తో బొత్స ఆలింగనం- సైలెంట్‌గా పక్కకు తప్పుకున్న పెద్దిరెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్సీలు

గతంలో ఉద్యోగుల ఇళ్లల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఇప్పుడు టీటీడీ  బోర్డు నిర్ణయం తీసుకుంది కానీ 2014లో వైసీపీ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇలా మతం మారిన వారి టీటీడీలో ఉద్యోగం చేస్తున్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిచాంరు. కేవలం టీటీడీకే వదిలేయకుండా తాను స్వయంగా పలువురు అనుమానం ఉన్న ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. కొంత మంది ఇళ్లల్లో అసులు శ్రీవారి పటాలు లేకకపోవడం.. ఇతర మత ఆచారాలను పాటించడం గమనించారు. అలాంటి వారిపై కఠిన చర్యుల తీసుకునే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆయనను చీఫ్ సెక్రటరీ పోస్టు నుంచి తొలగించి  ఓ అనామక పదవిలో పడేశారు. దాంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. 

లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్

గత ఐదేళ్లలో అన్యమత ఉద్యోగాలు బాగా పెరిగి ఉంటారని అంచనా !

గత ఐదేళ్లలో టీటీడీలో అన్యమత ఉద్యోగులు బాగా పెరిగి ఉంటారని అంచనా వేస్తున్నారు. మత మార్పిళ్లు ఉద్ధృతంగా జరగడమే దీనికి కారణం అని భావిస్తున్నారు.  నిజానిక టీటీడీలో పని చేసే ప్రతి ఒక్కరూ శ్రీనివాసుడి పట్ల ఎంతో భక్తిభావంతో ఉంటారు. కోట్లాది మంది భక్తులు ఒక్క క్షణం దర్శనం కోసం.. ఆయన సేవ కోసం వస్తున్న వైనం చూసి ఎవరూ ఇతర మతం వైపు చూడకూడదు. కొన్ని కారణాల వల్ల వారు మతం మార్చుకున్నారు. వారందర్నీ గుర్తించేందుకు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి పరిసీలన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget