అన్వేషించండి

Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్

TTD: రాజకీయ నేతల సిఫారసు లెటర్లతో పని లేకుండా వీఐపీ దర్శనం చేసుకోవచ్చు. ఈ టిక్కెట్లను ఎయిర్ పోర్టులో దిగగనే పొందే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది.

VIP darshan can be done without recommendation letters: తిరుమల శ్రీవారి దర్శనం ప్రతి ఒక్క హిందువుకు ఎంతో ముఖ్యం. పుట్టిన రోజు నాడు అయినా .. జీవితంలో ఏదైనా సాధించిన రోజు అయినా.. దూర ప్రాంతంలో ఉండి సొంత రాష్ట్రానికి వచ్చినా ముందుగా శ్రీవారి దర్శనం చేసుకోవాలని అనుకుంటారు.అందుకే తిరుమల కొండలపై ఎప్పుడూ విపరీతమైన రద్దీ ఉంటుంది. 300 దర్శనం  టిక్కెట్లను మూడు నెలల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉటుంటుంది. ఇక వీఐపీ దర్శన టిక్కెట్లకు అయితే రాజకీయ నేతల సిఫారసు లేఖలు అవసరం. 

అయితే రాజకీయ నేతల సిఫారసు లేఖలు అవసరం లేకుండానే శ్రీవారి పథకం ద్వారా వీఐపీ దర్శన టిక్కెట్లు కొనుగోలు చేసే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఎయిర్ పోర్టునూ ఈ ఫెసిలిటీ ఉంది. రేణిగుంట విమానాశ్రయంలో దిగిన వెంటనే శ్రీవాణి టిక్కెట్లు కొనుగోలు చేసి వీఐపీ దర్శనానికి వెళ్లవచ్చు. ఇప్పటి వరకూ ఉన్న  శ్రీవాణి టికెట్ల సంఖ్య పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.  ణిగుంట విమానాశ్రయంలో ప్రతిరోజూ జారీ చేస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల సంఖ్యను టీటీడీ 100 నుండి 200 కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో భక్తులు టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది.            

Also Read : దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం

బోర్డింగ్ పాస్‌ ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో మాత్రమే ఈ ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేస్తారు. అలాగే తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం వెనుక వైపు ఉన్న శ్రీవాణి టికెట్ కౌంటర్ లో ఆఫ్ లైన్ లో జారీ చేస్తున్న టికెట్ల సంఖ్యను 900 నుండి 800 కు తగ్గించారు. మొదటి వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఈ టికెట్లను జారీ చేస్తారు. అంటే రోజుకు వెయ్యి మంది వరకూ వీఐపీ దర్శనం చేసుకోవచ్చు. ఈ దర్శనం టిక్కెట్ రూ. 10వేలు ఉంటుంది. ఇప్పటి వరకూ శ్రీవాణి ట్రస్ట్ కు పదివేలు విరాళం ఇచ్చే వారికి రూ. 500 కలిపి మొత్తం పదివేల ఐదు వందలకు ఈ టిక్కెట్ ఇస్తున్నారు. నిధులన్నీ శ్రీవారి ట్రస్టుకు వెళ్లేవి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రూల్స్ మార్చారు.   

Also Read: YS Sharmila: 'చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ చేయాలి అన్నట్లుంది' - కడప స్టీల్ ప్లాంట్‌‌పై జగన్‌వి ఆస్కార్ డైలాగులన్న షర్మిల, టెంకాయలు కొట్టి వినూత్న నిరసన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Prakasam District News: బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
PAN 2.0 - Aadhaar: పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
RBI Governor Salary: ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Embed widget