అన్వేషించండి

Ram Gopal Varma: దర్శకుడు ఆర్జీవీకి మరోసారి పోలీసుల నోటీసులు - ఈ నెల 25న విచారణకు రావాలని ఆదేశం

Ongole News: దర్శకుడు ఆర్జీవీకి ఒంగోలు పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. ఈ నెల 25న విచారణకు రావాలని మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆయన వాట్సాప్ నెంబరుకు నోటీసు పంపించారు.

Ongole Police Notices To Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు (Ramgopal Varma) ప్రకాశం పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25న ఒంగోలు (Ongole) రూరల్ పీఎస్‌లో విచారణకు హాజరు కావాలని సీఐ శ్రీకాంత్ నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు ఆర్జీవీ వాట్సాప్ నెంబరుకు నోటీసు పంపించారు. అయితే, మంగళవారమే విచారణకు రావాలని ఆర్జీవీకి నోటీసులివ్వగా వారం రోజులు గడువు కావాలని కోరారు. షూటింగుల్లో బిజీగా ఉన్నందున సమయం కావాలని సీఐ వాట్సాప్‌నకు మెసేజ్ పంపించారు. అనంతరం వర్మ తరఫు న్యాయవాదులు సైతం వచ్చి ఒంగోలు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆర్జీవీ పంపిన లేఖను పోలీసులకు అందజేశారు. కాగా, అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఆర్జీవీ అనుచిత వ్యాఖ్యలు చేశారని అక్కడి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారు. దీనిపై ఆర్జీవి హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. ఈ విషయంపై పోలీసులతోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.

వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్

మరోవైపు, ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను అరెస్ట్ చేస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగించే ప్రమాదం ఉందన్నారు. అటు, నటుడు పోసాని కృష్ణమురళిపైనా ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఓ మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబుపై పోసాని అసత్య ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు సీఎం వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని.. వర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా ఉన్నాయని పేర్కొన్నారు. 

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పైనా టెక్కలి పీఎస్‌లో కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ టెక్కలి నియోజకవర్గ జనసేన నేత కణితి కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: YS Sharmila: 'చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ చేయాలి అన్నట్లుంది' - కడప స్టీల్ ప్లాంట్‌‌పై జగన్‌వి ఆస్కార్ డైలాగులన్న షర్మిల, టెంకాయలు కొట్టి వినూత్న నిరసన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan In Assembly: ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Tirumala News: సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
AR Rahman Saira Divorce: రెహమాన్ విడాకులపై స్పందించిన పిల్లలు... పేరెంట్స్ సపరేషన్ గురించి ఏమన్నారో తెలుసా?
రెహమాన్ విడాకులపై స్పందించిన పిల్లలు... పేరెంట్స్ సపరేషన్ గురించి ఏమన్నారో తెలుసా?
Dating Reward In China: ప్రేమిస్తే జీతంతో పాటు బోనస్‌ - ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చిన కంపెనీ
ప్రేమిస్తే జీతంతోపాటు బోనస్‌ - ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చిన కంపెనీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగామెగాస్టార్ కోసం..  కలిసిన మమ్ముట్టి-మోహన్ లాల్ టీమ్స్ఏఆర్ రెహమాన్ విడాకులు, 29 ఏళ్ల బంధానికి ముగింపుMarquee players list IPL 2025 Auction | ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల చూపు వీరి మీదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan In Assembly: ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఐదేళ్లే కాదు మరో పదేళ్లు చంద్రబాబు సీఎం - అసెంబ్లీలో పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Tirumala News: సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
AR Rahman Saira Divorce: రెహమాన్ విడాకులపై స్పందించిన పిల్లలు... పేరెంట్స్ సపరేషన్ గురించి ఏమన్నారో తెలుసా?
రెహమాన్ విడాకులపై స్పందించిన పిల్లలు... పేరెంట్స్ సపరేషన్ గురించి ఏమన్నారో తెలుసా?
Dating Reward In China: ప్రేమిస్తే జీతంతో పాటు బోనస్‌ - ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చిన కంపెనీ
ప్రేమిస్తే జీతంతోపాటు బోనస్‌ - ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చిన కంపెనీ
Kollywood: యూట్యూబ్ ఛానెళ్లతో తలనొప్పి,  ఆ రివ్యూలు అనుమతులు వద్దు - సంచలన నిర్ణయం తీసుకున్న తమిళ నిర్మాతల సంఘం
యూట్యూబ్ ఛానెళ్లతో తలనొప్పి, ఆ రివ్యూలు అనుమతులు వద్దు - సంచలన నిర్ణయం తీసుకున్న తమిళ నిర్మాతల సంఘం
Roti Kapada Romance First Review: ‘రోటి కపడా రొమాన్స్’ ఫస్ట్ రివ్యూ... పెళ్లికి ముందు రొమాన్స్ చేసిన కపుల్స్ కథ ఎలా ఉందంటే?
‘రోటి కపడా రొమాన్స్’ ఫస్ట్ రివ్యూ... పెళ్లికి ముందు రొమాన్స్ చేసిన కపుల్స్ కథ ఎలా ఉందంటే?
TTD Latest News: తిరుమలలో హిందూయేతర ఉద్యోగులు ఎంతమంది? వారి తొలగింపునకు ఉన్న అడ్డంకులేంటీ?
తిరుమలలో హిందూయేతర ఉద్యోగులు ఎంతమంది? వారి తొలగింపునకు ఉన్న అడ్డంకులేంటీ?
YS Sharmila: 'చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ చేయాలి అన్నట్లుంది' - కడప స్టీల్ ప్లాంట్‌‌పై జగన్‌వి ఆస్కార్ డైలాగులన్న షర్మిల, టెంకాయలు కొట్టి వినూత్న నిరసన
'చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ చేయాలి అన్నట్లుంది' - కడప స్టీల్ ప్లాంట్‌‌పై జగన్‌వి ఆస్కార్ డైలాగులన్న షర్మిల, టెంకాయలు కొట్టి వినూత్న నిరసన
Embed widget