News
News
X

Bigg Boss 6: ఆ ఇద్దరికే అతి తక్కువ ఓటింగ్, బిగ్‌బాస్ సీజన్ 6లో ఎలిమినేట్ అయ్యే మొదటి కంటెస్టెంట్ ఆమేనా?

బిగ్ బాస్ సీజన్ 6 మొదలై అప్పుడే వారం అయిపోయింది. ఎలిమినేషన్ డే కూడా వచ్చేస్తోంది.

FOLLOW US: 

సండే ఫన్ డే... అనుకుంటూ వచ్చి ఒక కంటెస్టెంట్‌‌ను ఇంట్లోంచి ఎలిమినేట్ చేసేస్తారు హోస్ట్ నాగార్జున. బిగ్ బాస్ సీజన్ 6లో మొదటగా ఇంట్లోంచి వెళ్లబోయేది ఎవరు? అనే చర్చలు మొదలైపోయాయి. ఈసారి లేడీ కంటెస్టెంట్లలో ఒకరు బయటికి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. వారిద్దరిలో ఒకరు ఆరోహి రావ్ కాగా, మరొకరు ఇనయా సుల్తానా. అలాగే అభినయశ్రీ పేరు కూడా వినిపిస్తోంది కానీ, ఆమె కన్నా వీరిద్దరికే వెళ్లే ఛాన్సులు అధికంగా ఉన్నట్టు తెలుస్తున్నాయి. 

ఇద్దరిలో ఎవరూ?
ఆరోహి లేదా ఇనయాల్లో ఎవరు బయటికి వెళ్తారనే అంశం గురించి మాట్లాడుకుంటే ఎక్కువ మంది ఇనయా వెళ్తుందనే భావిస్తున్నారు. ఇనయా మీర ఆరోహి ఆట ఫర్వాలేదనిపిస్తోంది. ఇనయా అసందర్భంగా మాట్లాడడం, తనకు సంబంధం లేని విషయాల్లో కూడా మధ్యలో దూరి మాట్లాడడం కాస్త మైనస్ కావచ్చు. ఇక ఆరోహి రేవంత్ గొడవపడడం వల్ల ఓట్లు తక్కువ పడి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇంట్లో వాళ్లందరూ రేవంత్‌ను టార్గెట్ చేశారనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో క్రియేట్ అయ్యింది. దీంతో ఆయనకు అందరికన్నా ఎక్కువ ఓటింగ్ పడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎలిమినేషన్లో ఉన్న వారిలో ఆయన అధికంగా ఓట్లు పడ్డాయని సమాచారం. అందుకే రేవంత్ తో గొడవ ఆరోహికి వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కామన్‌గా ఎవరినైతే అందరూ టార్గెట్ చేసి ఒంటిరిని చేసినట్టు ప్రవర్తిస్తారో, వారికే ఆర్మీలు ఏర్పడడం జరుగుతాయి. 

మొదటి వారం రేవంత్ పై అందరూ విరుచుకుపడ్డారు. రెండో వారం కూడా ఇదే సాగితే ఆర్మీలు పనిచేయడం మొదలుపెడతాయి.  కౌశల్ ఆర్మీ, అభిజిత్ ఆర్మీలు ఏ రేంజ్‌లో సోషల్ మీడియాలో చురుగ్గా పనిచేశాయో అందరికీ తెలిసిందే. రేవంత్ కోసం కూడా ఒక ఆర్మీ మొదలవ్వచ్చు. ఈ వీక్ రేవంత్ తో ఆరోహి తీవ్రంగానే గొడవపడింది. చిరాకు పడడం, ఆయన్ను జనాభా లెక్కల్లో లేకుంటే సంతోషిస్తా అంటూ కొన్ని అధిక మాటలు ఆమెకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. 

అయితే ఇనయాతో పోలిస్తే ఆరోహి ఆటే చాలా మెరుగ్గా ఉంది. అంతేకాదు ఇనయా కన్నా అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడంలో ఆరోహినే బెటర్. ఇక అభినయశ్రీ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తోంది. బిగ్‌బాస్ హౌస్ లో ఏమైనా జరగొచ్చు. అభినయశ్రీ అంత చురుగ్గా ఉండడం లేదు. కేవలం నలుగురితో కూర్చుని ఏదో ఒకటి మాట్లాడడంలోనే బిజీగా ఉంటోంది. ఆమె ఇంతవరకు ఓపెన్  అయింది కూడా లేదు. ఈమె కన్నా ఇనయా, ఆరోహిలే నటించుకుండా తమ రియల్ క్యారెక్టర్‌తో ఆడారు.ఈ వీక్ కంటెంట్ ఇచ్చిన వారిలో ఇనయా, ఆరోహిల పేర్లు కూడా ఉంటాయి.కానీ అభినయశ్రీ ఇచ్చిన కంటెంట్ ఏమీ లేదు. కాబట్టి ఇలా ఆలోచిస్తే బిగ్ బాస్ అభినయను ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

Also read: ఈ సీజన్ మొదటి కెప్టెన్ అతడే, ఇక వరస్ట్ పెర్ఫార్మర్ ‘అతి’బిడ్డ గీతూ, టాస్క్‌లో ఓవర్‌యాక్షనే ఆమె కొంపముంచింది

Also read: తొలి వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే, ఈ ఏడుగురిలో ఎవరు బయటకు వెళ్తారు?

Published at : 10 Sep 2022 12:35 PM (IST) Tags: Bigg Boss Season 6 Bigg Boss Season 6 Telugu Updates Inaya Sulthana Elimination Biggboss 6 Elimination Arohi rao Elimination

సంబంధిత కథనాలు

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

Khushboo: హాస్పిటల్ లో ఖుష్బూ - ఫ్యాన్స్ ఆందోళన!

Khushboo: హాస్పిటల్ లో ఖుష్బూ - ఫ్యాన్స్ ఆందోళన!

Adipurush: 'ఆదిపురుష్' టీజర్‌పై కంప్లైంట్ - ప్రభాస్, ఓం రౌత్ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్!

Adipurush: 'ఆదిపురుష్' టీజర్‌పై కంప్లైంట్ - ప్రభాస్, ఓం రౌత్ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్!

Sri Simha Koduri : భాగ్ సాలే - ప్రేమ, నేరం, పరుగు? కీరవాణి కుమారుడి కొత్త సినిమా లుక్

Sri Simha Koduri : భాగ్ సాలే - ప్రేమ, నేరం, పరుగు? కీరవాణి కుమారుడి కొత్త సినిమా లుక్

టాప్ స్టోరీస్

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల