![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bigg Boss6 Telugu Episode 06: ఈ సీజన్ మొదటి కెప్టెన్ అతడే, ఇక వరస్ట్ పెర్ఫార్మర్ ‘అతి’బిడ్డ గీతూ, టాస్క్‌లో ఓవర్‌యాక్షనే ఆమె కొంపముంచింది
Bigg Boss6 Telugu Episode 06: అతి బిడ్డ గీతూరాయల్ బిగ్‌బాస్ సీజన్ 6లో తొలిగా జైలుకి వెళ్లింది.
![Bigg Boss6 Telugu Episode 06: ఈ సీజన్ మొదటి కెప్టెన్ అతడే, ఇక వరస్ట్ పెర్ఫార్మర్ ‘అతి’బిడ్డ గీతూ, టాస్క్‌లో ఓవర్‌యాక్షనే ఆమె కొంపముంచింది Bigg Boss6 Telugu Episode 06 Daily Updates in Telugu Bigg Boss6 Telugu Episode 06: ఈ సీజన్ మొదటి కెప్టెన్ అతడే, ఇక వరస్ట్ పెర్ఫార్మర్ ‘అతి’బిడ్డ గీతూ, టాస్క్‌లో ఓవర్‌యాక్షనే ఆమె కొంపముంచింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/10/f2de54481b85b6e7212e3f0989677b371662772442054248_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bigg Boss6 Telugu Episode 06: బిగ్‌బాస్ సీజన్ 6లో మొదటి కెప్టెన్‌గా బాలాదిత్య గెలిచాడు. ఎలాగైనా గెలవాలని దొంగాటలు, తొండాటలు ఆడిన గలాటా గీతూ తన ఓవర్ యాక్షన్ కారణంగానే వరస్ట్ ఫెర్మార్మర్‌గా మారి జైలుకెళ్లింది. తనకు పీరియడ్స్ ఉన్నాయని చెప్పినా బిగ్‌బాస్ కనికరించలేను. కచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందేనని ఆదేశించారు. ఇక ఎపిసోడ్‌లో మొదట్నించి ఏం జరిగిందంటే...
ఉదయాన వాసంతి, బాలాదిత్య, గీతూ బయల సోఫాలో కూర్చుని ఉన్నారు. గీతూ కాలుపై కాలేసి ఊపడం మొదలుపెట్టింది. బాలాదిత్యకు చికాకుగా అనిపించడం సరిగా కూర్చో, అలా వేరే వారి ముఖాలపై కాలు ఊపకు అంటూ చెప్పారు. చెప్పిన తరువాత కూడా గీతూ అలానే చేయడంతో మళ్లీ చెప్పాడు బాలాదిత్య. గీతూ సారీ చెప్పి మరో వైపు కాలు తిప్పి ఊపడం మొదలుపెట్టింది. ఇక ఈమె మారదు అని వదిలేశారు. రా రా రక్కమ్మ పాటను ప్లే చేశారు బిగ్ బాస్. ఇంటి సభ్యులంతా లేచి కాసేపు డ్యాన్సులేశారు.
కెప్టెన్సీ టాస్క్
బిగ్‌బాస్ మొదటి కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు. ఆరుగురు ఇందులో పోటీపడ్డారు. నీళ్లలో వేసిన తాళాలను నోటితో తీసి, వాటితో బాక్సులను ఓపెన్ చేసి, అందులో ఉన్న కారు నెంబర్ ను చూడాలి. ఆ నెంబర్ ప్లేటులోని అక్షరాలు, నెంబర్లను వెతికి కార్లకు అతికించాలి. అయితే ఈ టాస్క్ బాలాదిత్య గెలిచారు. గీతూ చాలా తొండాటలు ఆడడంతో ఇల్లంతా అరుపులు, గోలతో రచ్చరచ్చ అయింది. మొత్తానికి బాలాదిత్య ఇంటి కెప్టెన్ అయ్యారు.
వరస్ట్ పెర్ఫార్మర్...
ఈ వారం వరస్ట్ పెర్మార్మర్ ఎవరో చెప్పాలని కోరడంతో ఎక్కువ మంది గీతూ రాయల్ ని టార్గెట్ చేశారు. ఆమె ఇన్నాళ్లు చేసిన ఓవర్ యాక్షన్‌ను భరించిన ఇంటి సభ్యులు ఈ రోజు మాత్రం ఆమెకే వరస్ట్ పెర్ఫార్మర్ గుద్దేశారు. ఆమె ముఖం మీద రెడ్ మార్కులతో నిండిపోయింది. ఆమెను జైల్లో వేశారు. తరువాత ఇనయా, శ్రీహాన్ మధ్య కాసేపు వేడి చర్చ జరిగింది. శ్రీహాన్ ఇనయాను వరస్ట్ పెర్మార్మర్ గా ముద్ర వేశాడు. అలా ఎందుకు ఇచ్చాడో చెప్పుకొచ్చాడు. ఆమె నువ్వు సేఫ్ ప్లే ఆడావంటూ శ్రీహాన్ తో అంది. ఈ డిస్కషన్ మధ్యలోనే ఆగిపోయింది.
గీతూని నామినేట్ చేసింది వీళ్లే...
రేవంత్ గీతూని నామినేట్ చేయాలనుకున్నాడు. కానీ ఆమెకు పీరియడ్స్ సమయం కావడంతో జైలుకు పంపడం ఇష్టం లేదని ఆదిరెడ్డికి వేశాడు. ఇక సుదీప గీతూకి గట్టిగానే ఇచ్చిపడేసింది. ‘నాకు నచ్చినట్టు నేనుంటా, నేను నా ఇంట్లో ఉండే ఎవరూ ఒప్పుకోరు’ అని చెప్పి ముఖంపై రెడ్ మార్క్ వేసింది. చలాకీ చంటి కూడా గీతూకే ఓటేశారు. రాజశేఖర్, ఇనయా కూడా గీతూకే ఎర్ర ముద్ర వేశారు. శ్రీ సత్య, ఆరోహి, ఆర్జే సూర్య, వాసంతి, నేహా, మెరీనా జంట, అర్జున్ కళ్యాణ్ కూడా గీతూకే ఓటేశారు.అంటే ఇంట్లో ఉన్న 80 శాతం మంది గీతూనే వరస్ట్ పెర్ఫార్మర్ గా ఒప్పకున్నారు.
Also read: బిగ్‌బాస్ కెప్టెన్సీ పోరులో ఆ ఆరుగురు, ఆరోహి - రేవంత్ మధ్య మళ్లీ గొడవ, ‘అతి’బిడ్డ గీతూ ఓవర్ యాక్షన్
Also read: తొలి వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే, ఈ ఏడుగురిలో ఎవరు బయటకు వెళ్తారు?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)