Bigg Boss Telugu 6 Episode 4: తొలి వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే, ఈ ఏడుగురిలో ఎవరు బయటకు వెళ్తారు?
Bigg Boss Telugu 6 Episode 4: బిగ్‌బాస్ సీజన్ 6 తొలి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. మొదటి వారం ఎలిమినేషన్ కోసం ఏడుగురు నామినేట్ అయ్యారు.
Bigg Boss Telugu 6: సీజన్ 6లో తొలి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియలో ఎవరంటే ఎవరికీ పడదో ప్రేక్షకులకు తెలిసేది. ఇప్పటికే ఆల్రెడీ ముగ్గురు నామినేషన్లలో ఉండగా, మరికొందరు నామినేషన్ ప్రక్రియ ద్వారా ఇంటి నుంచి బయటికి వెళ్లేందుకు నామినేట్ అవుతారు. ఈ ప్రక్రియ వాడీవేడిగానే సాగినట్టు ప్రోమో ద్వారా తెలుస్తోంది. తాజాగా వచ్చిన ప్రోమోలో రేవంత్ కే ఎక్కువ ఓట్లు పడినట్టు కనిపిస్తోంది. దాదాపు ఆరు నుంచి ఏడు మంది రేవంత్ కే ఓటేసినట్టు ప్రోమోలో కనిపిస్తోంది. ఫైమాకు రేవంత్ కు వాదన అయింది, అలాగే ఆరోహికి రేవంత్‌కు కూడా వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. మొదటి వారంలోనే హీట్ పెరిగిపోయింది.
ఫ్లష్ అవుట్...
బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా పేర్లతో కూడి ముద్రలు, పేపర్లు అక్కడ పెట్టారు. ఎవరిని ఇంట్లో ఉండకుండా ఫ్లష్ అవుట్ చేయాలనుకుంటున్నారో వారి పేర్లను పేపర్ మీద ముద్రించి, నలిపి టాయిలెట్ కమోడ్‌లో వేసి ఫ్లష్ కొట్టాలనే టాస్క్ ఇచ్చారు. ఇందులో రేవంత్ ఫైమాక ఇంట్లో పనిచేయడం చూడలేదని అన్నాడు. దానికి ఫైమా ‘నేను చేసినప్పుడు నువ్వు చూడలేదేమో’ అంటూ కౌంటర్ ఇచ్చింది. రేవంత్ కూడా తగ్గకుండా ‘నేను ఇంట్లో లేనేమో అయితే’ అంటూ సమాధానం ఇచ్చాడు. రేవంత్ మాటతీరును తప్పుపట్టింది ఫైమా. తన గొంతు పెద్దగా ఉంటుందని, నీకోసం తగ్గించుకోలేనని చెప్పాడు రేవంత్. ఇక అర్జున్ కళ్యాణ్ ఫైమాను నామినేట్ చేశాడు. ఆమె తనను తప్పుగా అర్థం చేసుకుందని వివరణ ఇచ్చాడు.
మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్నది వీరే, ఎవరు ఔట్?
1. రేవంత్
2. చంటి
3. శ్రీ సత్య
4. ఫైమా
5. ఇనయా
6. ఆరోహి
7. అభినయశ్రీ
Also read: నామినేషన్లలో ఆ ముగ్గురు, బయటకు వెళ్లేది ఆమేనా? ఆకలితో ఏడ్చేసిన రేవంత్
Also read: రెండో రోజే బిగ్‌బాస్ హౌస్‌లో ఏడుపులు, తగువులు - తిక్కదానా అంటూ తిట్లు మొదలుపెట్టిన గలాటా గీతూ
శ్రీసత్యకు యాటిట్యూడ్
నటి వాసంతి శ్రీ సత్యను నామినేట్ చేసింది. ఆమెతో మాట్లాడటానికి వెళితే యాటిట్యూడ్ చూపిస్తుందని అంది. అలాగే ఆరోహి, రేవంత్ మధ్య కూడా వాదన జరిగింది. ‘అమ్మో లేచిండు’ అంటూ తనని అందని రేవంత్ అనగా ఎవరితో అన్నానో చెప్పమంటూ అడిగింది ఆరోహి. సుదీప కూడా రేవంత్‌నే నామినేట్ చేస్తున్నటు తెలుస్తోంది. మొత్తమ్మీద రేవంత్ హౌస్‌లో ఎక్కువ నామినేషన్లు పొందినట్టు కనిపిస్తోంది. పూర్తి ఎపిసోడ్ చూస్తే కానీ వివరాలు తెలియవు.
నిజానికి ఈసారి గలాటీ గీతూకు ఎక్కువ నామినేషన్లు పడతాయని ప్రేక్షకులు ఊహించారు. ఆమె చేసిన ఓవరాక్షన్ అలా ఉంది మరి. కానీ ఆమె క్లాష్ టీమ్ లోకి వెళ్లి సేవ్ అయిపోయంది. ఇక ట్రాష్ టీమ్ లో ఉన్నందున అభినయ, ఇనయా, బాలాదిత్య ఇప్పటికే నామినేషన్లలో ఉన్నారు.
Modhati week nominate ayyedi evaru? 😱
— starmaa (@StarMaa) September 7, 2022
Watch the drama unfold on @StarMaa, streaming 24/7 on @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar#DisneyPlusHotstar #StarMaa pic.twitter.com/UR4qJrRYq4