News
News
X

Bigg Boss6 Telugu Episode3: నామినేషన్లలో ఆ ముగ్గురు, బయటకు వెళ్లేది ఆమేనా? ఆకలితో ఏడ్చేసిన రేవంత్

Bigg Boss 6 Telugu Episode 3 Update: బిగ్ బాస్ మూడో రోజు టాస్కులతో నిండిపోయింది. మధ్యలో రేవంత్ ఏడ్వడం మాత్రం చూసేవారికి బాధనిపించేలా ఉంది.

FOLLOW US: 

Bigg boss 6 Telugu Episode 3: బిగ్ బాస్ సీజన్ 6 మూడో రోజులోకి ప్రవేశించింది. ఈ రోజంతా టాస్కులు, వాదనలతో నిండిపోయింది. అలాగే  ముగ్గురు నామినేషన్లలోకి వెళ్లగా, ముగ్గురు నామినేషన్ల నుంచి సేవ్ అయ్యారు. ట్రాష్ టీమ్ లో ఉన్న ఇనయా సుల్తానా, బాలాదిత్య, అభినయ నేరుగా నామినేట్ అయినట్టు ప్రకటించారు బిగ్ బాస్. ఇక క్లాస్ టీమ్‌లో ఉన్న ఆది రెడ్డి, గీతూ, నేహా నామినేషన్ల నుంచి సేవ్ అయ్యారు. దీంతో అందరి కళ్లూ ఇనయాపైనే ఉన్నాయి. ఎందుకంటే ఇనయాకే ఫ్యాన్ బేస్ తక్కువుంది. కాబట్టి ఆమెనే ఈసారి బయటికి వెళ్లేది అని భావిస్తున్నారు ఎక్కువ శాతం మంది. 

ఇక ఎపిసోడ్ విషయానికి వస్తే... ఆరోహి తాను కేవలం సూర్యతోనే ఎక్కువగా ఉంటున్నానని రేవంత్ అన్నాడంటూ తన స్నేహితులతో చెప్పుకుంటూ కనిపించింది. అదే సమయంలో అర్జున్ కూడా రేవంత్ కు కొన్ని సలహాలు ఇస్తూ కనిపించాడు. కానీ రేవంత్ లైట్ తీసుకున్నాడు. ఇక మెరీనా తన భర్త సరిగా హగ్ ఇవ్వట్లేదంటూ ఆరోహి, ఇనయాల దగ్గర చెప్పుకొచ్చింది. 

గీతూ కూడా రేవంత్ కు సలహాలు ఇచ్చింది. అందరిమీద నోరు పారేసుకునే గీతూ ‘మాట్లాడేముందుకు కాసేపు ఆలోచించండి’ అంటూ రేవంత్‌కు సలహా ఇచ్చింది. మీ గురించి అందరూ నెగిటివ్ మాట్లాడుతున్నారు అందుకే ఇలా చెబుతున్నా అంటూ చెప్పుకొచ్చింది. 

రేవంత్ కంటతడి
బిగ్ స్విచ్ పేరుతో బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చాడు. ట్రాష్ నుంచి ఎవరైనా క్లాస్ కి వెళ్లొచ్చని, అలాగే క్లాస్ నుంచి ఒకరు ట్రాష్ కి రావాలని చెప్పాడు. రేవంత్ వెళ్లాలనుకున్నా గీతూ తాను వెళ్తానంటూ పట్టుపట్టి మరీ వెళ్లింది.  దీంతో రేవంత్ చాలా డల్ అయిపోయాడు. ఉదయం నుంచి ఏం తినలేదు అంటూ బాత్రూమ్ దగ్గర కంటతడిపెట్టుకున్నాడు. ట్రాష్ టీమ్‌లో వారికి బిగ్ బాస్ ఇచ్చిన ఫుడ్ తినలేకపోతున్నా అంటూ ఉదయం నుంచి ఏమీ తినకుండానే ఉన్నాడు. గీతూ క్లాస్ లోకి వెళ్లడంతో, బాలాదిత్య తనకు తానుగానే ట్రాష్ లోకి వచ్చాడు. 

రోల్ బేబీ రోల్
మూడో ఛాలెంజ్ ను ఇచ్చాడు బిగ్ బాస్. రోల్ బేబీ రోల్ పేరుతో సాగిన ఈ ఛాలెంజ్‌లో నేహా చేతిలో ఇనయా ఓడిపోయింది. దీంతో నేహా క్లాస్ టీమ్ కి వెళ్లిపోయింది. నేహా క్లాస్‌లోకి రావడంతో సూర్య మాస్‌లోకి వెళ్లిపోయాడు. ఆ తరువాత అభినయ, రేవంత్ మధ్య ఓ ఛాలెంజ్ వస్తుంది. అందులో రేవంత్ గెలవడంతో ఆయన మాస్ టీమ్‌లోకి వస్తాడు.  దీంతో అతని ఆకలి బాధలు తీరిపోతాయి. అభినయ మాస్ టీమ్ నుంచి ట్రాష్ లోకి వెళ్లిపోతుంది. 

ఈలోపు ఎండ్ బజర్ మోగడంతో ఈ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. మాస్ టీమ్‌‌లో ఉన్న అభినయ, బాలాదిత్య, ఇనయా నేరుగా నామినేట్ అయినట్టు ప్రకటిస్తాడు బిగ్ బాస్. ఇక క్లాస్‌లో ఉన్న ఆదిరెడ్డి, గీతూ, నేహా సేఫ్ అని ప్రకటిస్తాడు. 

గీతూ ఓవరాక్షన్...
మధ్యలో బిగ్ స్విచ్ ఛాలెంజ్ వచ్చాక... రేవంత్ గీతూని క్లాసులోకి పంపించాడు కదా. ఆ సమయంలో కాసేపు గీతూ చాలా ఓవరాక్షన్ చేసింది. ఇనయాను ముఖ్యంగా టార్గెట్ చేసుకుంది. ఆరోహి చేత అన్నం కలిపించడం, చేతులు కడుక్కునేందకు బౌల్ తెమ్మనడం, కావాలనే ఇనయాను ఇబ్బంది పెట్టడం ఇవన్నీ చేసింది. ఆమె చిత్తూర యాస వినసొంపుగా ఉండడంతో అవన్నీ కాస్త కామెడీగా మారుతున్నాయి. లేకుంటే ఆమె ఓవరాక్షన్‌కు మిగతా ఇంటిసభ్యులు కచ్చితంగా రియాక్ట్ అయ్యేవారు. 

Also read: రెండో రోజే బిగ్‌బాస్ హౌస్‌లో ఏడుపులు, తగువులు - తిక్కదానా అంటూ తిట్లు మొదలుపెట్టిన గలాటా గీతూ

Also read: ‘ఓ పాట పాడు రాజా’, ఇనయాను ఆడేసుకుంటున్న గీతూ, లేటేస్ట్ బిగ్ బాస్ ప్రోమో రిలీజ్

Published at : 07 Sep 2022 06:19 AM (IST) Tags: inaya sulthana Bigg Boss6 Telugu Episode3 Bigg Boss6 Telugu Galatta Geethu

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

టాప్ స్టోరీస్

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Jinping House Arrest: షాకింగ్! గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు- సైన్యం చేతిలోకి దేశం!

Jinping House Arrest: షాకింగ్! గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు- సైన్యం చేతిలోకి దేశం!

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ