News
News
X

Biggboss6 Telugu Episode2: రెండో రోజే బిగ్‌బాస్ హౌస్‌లో ఏడుపులు, తగువులు - తిక్కదానా అంటూ తిట్లు మొదలుపెట్టిన గలాటా గీతూ

Bigg Boss 6 Telugu Episode 2 Update: బిగ్‌బాస్6 రెండో రోజు నుంచే ప్రేక్షకులను అలరించడం మొదలుపెట్టింది. తగువులు కూడా ప్రారంభమయ్యాయి.

FOLLOW US: 

Bigg boss 6 Telugu Episode 2: సాధారణంగా కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌస్లోకి వెళ్లాక వారం రోజుల పాటూ అందరం స్నేహంగానే ఉంటారు. నామినేషన్ మొదలయ్యాకే అసలు గొడవలు ప్రారంభమయ్యేది. కానీ బిగ్‌బాస్ 6లో రెండో రోజే ఏడుపులు, తిట్లు, తగువులు మొదలైపోయాయి. ముఖ్యంగా గలాగా గీతూ బాగా హైలైట్ అయ్యింది. నోరేసుకుని అందరిమీద పడిపోతూ కనిపించింది. ఇక ఎపిసోడ్లోకి వెళితే...

పక్కాలోకల్ సాంగ్‌తో బిగ్‌బాస్ ఇంటి సభ్యులను నిద్రలేపారు. అందరూ మాస్ డ్యాన్సులతో ఆకట్టుకున్నారు. తరువాత గీతూ గొడవ మొదలుపెట్టింది. బాత్రూంలో జుట్టు ఉందంటూ హంగామా మొదలుపెట్టింది. తనకు బాత్రూమ్ క్లీన్ చేయమని ఇచ్చినా తాను జుట్టు క్లీన్ చేయనంటూ గొడవ చేసింది. ముఖ్యంగా ఇనయా సుల్తానాను టార్గెట్ చేసుకుంది. ఆమెను తిక్కదానా, తిక్కమ్మ అంటూ నోరు పారేసుకుంది. వెంటనే ఇనయా కూడా ‘నా తిక్క నాకుందిలే’ అంటూ సమాధానం ఇచ్చింది.

ఫస్ట్ టాస్క్...
హౌస్లో మొదటి టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. ఇంటి సభ్యులు క్లాస్ మాస్ ట్రాష్ అనేది టాస్క్. ఇందులో ఎవరు క్లాస్ సభ్యులు, ఎవరు మాస్ సభ్యులు, ఎవరు ట్రాష్ సభ్యులో... కంటెస్టెంట్లే నిర్ణయించాలి. క్లాస్ సభ్యులు ఏ పనీ చేయక్కర్లేదు. ఇక మాస్ సభ్యులకు ఎలాంటి అధికారులు ఉండవు. ట్రాష్ సభ్యులు మాత్రం చిరిగిన దుస్తులతో గార్డెన్లోనే వండుకుని తినాలి. అలా ట్రాష్ సభ్యులుగా గీతూ, ఇనయా, రేవంత్ ఎంపికయ్యారు. ఇక క్లాస్ సభ్యులుగా శ్రీహాన్, సూర్య, ఆదిత్య ఎంపికయ్యారు. మిగతావారంతా మాస్. అయితే చిన్న చిన్న పోటీలతో ట్రాష్ సభ్యులు, క్లాస్లోకి వచ్చే అవకాశాన్ని ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో ఆదిరెడ్డి, ఇనయా పోటీ పడ్డారు. కొబ్బరి బోండంలో నింపిన రంగునీళ్లని కాపాడుకోవాలి. ఇందులో ఇనయా ఓడిపోయింది. దీంతో ఆదిరెడ్డి క్లాస్ టీమ్ లోకి వెళ్లిపోయారు. ఆదిరెడ్డితో శ్రీహాన్ స్వాప్ అయి మాస్ టీమ్ లోకి వచ్చారు. 

నాన్న కోసం...
బిగ్ బాస్ ట్రాష్ సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. ఎవరికైనా సందేశాన్ని పంపండి లేదా గర్వించే విషయాలను చెప్పుకోండి అని అడిగారు. ఇనయా కన్నీంటి పర్యంతం అవుతూ చనిపోయిన తన తండ్రికి సందేశాన్ని పంపింది. రేవంత్ కూడా మరణించిన తన తండ్రికే సందేశాన్ని పంపారు. ఇక గలాటా గీతూ చెప్పడానికి చాలా సమయం తీసుకుంది. తనను చిన్నప్పట్నించి అందరూ ట్రాషీ అంటూనే ఉన్నారని చెప్పుకొచ్చింది. తాను ముఖం మీద మాట్లాడడమే అందరికీ నచ్చేది కాదని, బంధువులెవరూ నాతో మాట్లాడవద్దని చెప్పేవారని తెలిపింది. ఇప్పుడు తనను చూసి అందరూ దగ్గరికి వస్తున్నారని చెప్పింది. తన ఫాలోవర్ల వల్లే ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చింది. గలీజ్‌గా ఉంది... ఏడుస్తున్నానంటూ కాసేపు హంగామా చేసింది.  

Also read: బిగ్‌బాస్6 కంటెస్టెంట్‌లా రెమ్యునరేషన్లు ఇవే, అతడు టాప్ - ఆమె లీస్ట్,

Also Read: ‘బిగ్ బాస్’ సీజన్-6 ప్రైజ్ మనీ ఎంత? హౌస్‌లో ఉంటే వచ్చే ప్రయోజనాలేమిటీ?

Published at : 06 Sep 2022 06:20 AM (IST) Tags: Biggboss6 Telugu Biggboss6 Telugu Episode2 Biggboss6 Telugu Updates Bigg boss 6 Telugu Episode 2

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

టాప్ స్టోరీస్

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!