News
News
X

Biggboss6 Telugu: బిగ్‌బాస్6 కంటెస్టెంట్‌లా రెమ్యునరేషన్లు ఇవే, అతడు టాప్ - ఆమె లీస్ట్,

బిగ్‌బాస్ సీజన్ 6 మొదలైపోయింది. ఈ సీజన్లో పెద్దగా స్టార్లు లేరనే చెప్పాలి.

FOLLOW US: 

తెలుగులోనే బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్. ఆరో సీజన్ మొదలైపోయింది. ఇందులో పెద్దగా స్టార్లు ఎవరూ లేరు. అంతా సాధారణమైనవారినే పిలిచారు. అందుకే ఈసారి పీనాసి ప్లాన్ వేశారంటూ స్టార్ మాపై కామెంట్లు కూడా వచ్చాయి. నిజం చెప్పాలంటే ప్రేక్షకులను నచ్చే కంటెస్టెంట్లు ఎవరూ ఈ సీజన్లో లేరు. కాస్త గొడవలు మొదలైతే అందరూ ఎలాగూ చూడడం మొదలుపెడతారమనే ధీమా స్టార్ మా వారిది.అదే నిజమవుతోంది కూడా. అప్పుడే ఇనయా సుల్తానా -గీతూ మధ్య మాటల తూటాలు పేలడం మొదలయ్యాయి. గీతూ అయితే మొదటి రోజే విసుర్లు,చిరాకులు చూపిస్తోంది. కాగా ఇప్పుడు వీరందరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకొచ్చారన్నది ప్రేక్షకులను తొలిచేస్తున్న ప్రశ్నలు. 

ఒక్క రోజుకు ఎంతంటే...
ఇందులోని కంటెస్టెంట్లకు రోజుకు ఇంత అని మాట్లాడుకుని ఒప్పంద కుదిర్చుకున్నట్టు తెలుస్తోంది. రూ.15 వేల నుంచి రూ.60 వేల వరకు అందుకుంటున్నారు కంటెస్టెంట్లు. ఇక అతి తక్కువగా అందుకుంటున్నది ఇనయా సుల్తానా, టీవీ9 యాంకర్ ఆరోహి అని సమాచారం. వీరిద్దరికీ రోజుకు రూ.15 వేల రూపాయలు. ఇక అభినయశ్రీ, సుదీప రూ.20 వేలు తీసుకుంటుండగా, సోషల్ మీడియా ఇన్ఫ్ఫ్లూయెన్సర్ గా వచ్చిన గలాటా గీతూ రోజుకు రూ.25 వేలు తీసుకుంటోదట. అలాగే జబర్దస్త్ ఫైమా, వాసంతి కూడా రోజుకు రూ.25 వేలే అందుకుంటున్నట్టు సమాచారం. యూట్యూబర్ ఆది మాత్రం రోజుకు 30 వేలు అందుకుంటున్నాడు. 

ఇక సీరియల్ నటి శ్రీ సత్య రోజుకు రూ.30 వేలు, నటుడు షానీ కూడా రూ.30 వేలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక రెండు మూడు సినిమాల్లో హీరోగా నటించిన అర్జున్, కార్తీక దీపం హీరోయిన్ కీర్తి భట్ రోజుకు రూ.35 వేలు తీసుకుంటున్నారట. ఇక జంటగా వచ్చిన మెరీనా-రోహిత్‌లలో మెరీనాకు రూ.35 వేలు, రోహిత్‌కు రూ.45 వేలు ఇస్తున్నారు. అంటే ఈ జంట రోజుకు రూ.80 వేల దాకా సంపాదిస్తోందన్నమాట.  ఇక ఆర్జే సూర్య రూ.40 వేలు తీసుకుంటున్నాడు. 

ఎక్కువ అందుకుంటున్నది...
ఇక రోజుకు ఎక్కువ అందుకుంటున్న కంటెస్టెంట్లు శ్రీహాన్, చలాకీ చంటి, రేవంత్ అని తెలుస్తోంది. వీరిలో రేవంత్‌కే ఎక్కువ. ఇతను రోజుకు రూ.60 వేలు తీసుకుంటున్నాడట. ఇక సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ రూ.50 వేలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. చలాకీ చంటి కూడా దాదాపు అంతే అందుకుంటున్నాడు. ఈ సీజన్లో ఇనయా సుల్తానా అందరి కన్నా తక్కువ తీసుకుంటుంటే, రేవంత్ ఎక్కువ తీసుకుంటున్నాడు. 

‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు వీరే:

1. కీర్తి భట్ (‘కార్తీక దీపం’ సీరియల్ నటి)
2. సుదీప (‘నువ్వు నాకు నచ్చావ్’లో బాలనటి)
3. శ్రీహన్ (సిరి బాయ్ ఫ్రెండ్, యూట్యూబర్)
4. నేహా (యాంకర్)
5. శ్రీ సత్య (మోడల్)
6. అర్జున్ కళ్యాణ్ (సీరియల్ నటుడు)
7. చలాకీ చంటి (‘జబర్దస్త’ కమెడియన్)
8. అభినయ శ్రీ (నటి, డ్యాన్సర్)
9. గీతూ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్)
10. బాలాదిత్య (నటుడు)
11. మరీనా (సీరియల్ నటి, రోహన్ భార్య)
12. రోహన్ (సీరియల్ నటి, మరినా భర్త)
13. వాసంతి కృష్ణన్ (సీరియల్ నటి)
14. షాని (నటుడు)
15. ఆర్జే సూర్య (ఆర్జే)
16. ఆది రెడ్డి (యూట్యూబర్)
17. ఆరోహిరావు (టీవీ యాంకర్)
18. ఫైమా (‘జబర్దస్త్’ కమెడియన్)
19. రాజశేఖర్ (నటుడు)
20. ఇనయా (నటి)
21. రేవంత్  (సింగర్)

Also read: మొదటి రోజే ఇనయాతో చిత్తూరు పిల్ల గొడవ - నామినేషన్ రచ్చ షురూ!

Also Read: ‘బిగ్ బాస్’ సీజన్-6 ప్రైజ్ మనీ ఎంత? హౌస్‌లో ఉంటే వచ్చే ప్రయోజనాలేమిటీ?

Published at : 05 Sep 2022 05:36 PM (IST) Tags: Biggboss6 telugu season Biggboss6 contestants Contestants Remunerations Biggboss Remuneration

సంబంధిత కథనాలు

Rashmika: రష్మికకు మోకాళ్ల నొప్పులు - అసలు విషయం చెప్పేసిన డాక్టర్!

Rashmika: రష్మికకు మోకాళ్ల నొప్పులు - అసలు విషయం చెప్పేసిన డాక్టర్!

DJ Tillu 2: మొన్న డైరెక్టర్, ఇప్పుడు హీరోయిన్లు - 'డీజే టిల్లు'సీక్వెల్‌ను లైట్ తీసుకుంటున్నారా?

DJ Tillu 2: మొన్న డైరెక్టర్, ఇప్పుడు హీరోయిన్లు - 'డీజే టిల్లు'సీక్వెల్‌ను లైట్ తీసుకుంటున్నారా?

Daughters Day 2022: కూతురు సితారకు మహేష్ బాబు డాటర్స్ డే గ్రీటింగ్స్!

Daughters Day 2022: కూతురు సితారకు మహేష్ బాబు డాటర్స్ డే గ్రీటింగ్స్!

Chiranjeevi: మెగా నిర్మాతల నిర్ణయం - 'గాడ్ ఫాదర్'ని మలయాళంలో రిలీజ్ చేస్తారా?

Chiranjeevi: మెగా నిర్మాతల నిర్ణయం - 'గాడ్ ఫాదర్'ని మలయాళంలో రిలీజ్ చేస్తారా?

Nayanthara: నయనతార ప్రెగ్నెంట్? విఘ్నేష్ శివన్ పోస్ట్ వైరల్

Nayanthara: నయనతార ప్రెగ్నెంట్? విఘ్నేష్ శివన్ పోస్ట్ వైరల్

టాప్ స్టోరీస్

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

MS Dhoni: ధోనీ ఫేస్ బుక్ పోస్టుపై స్పష్టత, ఈసారి ప్రపంచకప్ మనదే అంటున్న మహీ

MS Dhoni:  ధోనీ ఫేస్ బుక్ పోస్టుపై స్పష్టత, ఈసారి ప్రపంచకప్ మనదే అంటున్న మహీ

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం