Bigg Boss Telugu 6: మొదటి రోజే ఇనయాతో చిత్తూరు పిల్ల గొడవ - నామినేషన్ రచ్చ షురూ!
ఉదయాన్నే 'పక్కా లోకల్' సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మన్స్ చేశారు కంటెస్టెంట్స్.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కలర్ ఫుల్ గా మొదలైంది. ఈ సీజన్లో ఒకరిద్దరు మినహా మిగతా వారంతా అప్ కమింగ్ సెలబ్రిటీలే. ఇప్పుడిప్పుడే ఫామ్ పెంచుకుంటున్న వారిని బిగ్ బాస్ 6 హౌస్ లోకి పంపించారు. మొత్తం 21 మంది పోటీదారులు హౌస్ లోకి వెళ్లారు. సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ ఉన్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్లుగా మొదటి టాస్క్ ను డిజైన్ చేశారు బిగ్ బాస్.
ఉదయాన్నే 'పక్కా లోకల్' సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మన్స్ చేశారు కంటెస్టెంట్స్. ఆ తరువాత బాత్రూమ్ లోకి వెళ్లిన గీతూరాయల్ అక్కడ జుట్టు ఎక్కువగా పడి ఉండడంతో.. అక్కడ ఎవరు స్నానం చేశారని ప్రశ్నించింది. దానికి మరో కంటెస్టెంట్ ఇనయా సుల్తానా పేరు చెప్పింది. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లిన గీతూ.. ప్రశ్నించగా.. 'అందరం డ్యూటీస్ ప్లాన్ చేసుకుందాం' అని చెప్పింది. అప్పుడు గీతూ.. తనకు బాత్రూమ్ క్లీనింగ్ ఇచ్చినా.. వేరొకరి జుట్టు తీయనని చెప్పింది. దీంతో ఇనయా, గీతూ ఇద్దరూ వాదించుకున్నారు.
అనంతరం.. బిగ్ బాస్ ఫస్ట్ టాస్క్ ఇచ్చారు. హౌస్ ని మూడు తరగతులుగా డివైడ్ చేశారు. క్లాస్ అండ్ ట్రాష్ అని గ్రూప్స్ పెట్టారు. ట్రాష్ అనే గ్రూప్ గార్డెన్ ఏరియాలో వండుకొని తినాలని చెప్పారు. ట్రాష్ గ్రూప్ లో ఎవరైతే ఉంటారో వారు నేరుగా ఈ వారం నామినేషన్స్ లో ఉంటారని చెప్పారు. మరి ఎవరెవరు ఏ ఏ గ్రూప్ లో ఉన్నారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే!
"Modhati task ki samayam aasannamaindi...!"
— starmaa (@StarMaa) September 5, 2022
Tune in to Day 1 of entertainment, on @StarMaa.#BiggBossTelugu6 #BBLiveOnHotstar #StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/Ug2vWGhCLP
'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లు వీరే:
1. కీర్తి భట్ (‘కార్తీక దీపం’ సీరియల్ నటి)
2. సుదీప (‘నువ్వు నాకు నచ్చావ్’లో బాలనటి)
3. శ్రీహన్ (సిరి బాయ్ ఫ్రెండ్, యూట్యూబర్)
4. నేహా (యాంకర్)
5. శ్రీ సత్య (మోడల్)
6. అర్జున్ కళ్యాణ్ (సీరియల్ నటుడు)
7. చలాకీ చంటి (‘జబర్దస్త’ కమెడియన్)
8. అభినయ శ్రీ (నటి, డ్యాన్సర్)
9. గీతూ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్)
10. బాలాదిత్య (నటుడు)
11. మరీనా (సీరియల్ నటి, రోహన్ భార్య)
12. రోహన్ (సీరియల్ నటి, మరినా భర్త)
13. వాసంతి కృష్ణన్ (సీరియల్ నటి)
14. షాని (నటుడు)
15. ఆర్జే సూర్య (ఆర్జే)
16. ఆది రెడ్డి (యూట్యూబర్)
17. ఆరోహిరావు (టీవీ యాంకర్)
18. ఫైమా (‘జబర్దస్త్’ కమెడియన్)
19. రాజశేఖర్ (నటుడు)
20. ఇనయా (నటి)
21. రేవంత్ (సింగర్)