News
News
X

Bigg Boss Telugu 6 - Sri Satya : ఎంబీబీఎస్ పక్కన పెట్టి మరీ వచ్చిన శ్రీ సత్య - 'రేసుగుర్రం'లో పాటతో ఎంట్రీ 

బిగ్ బాస్ హౌస్‌లోకి ఆరో కంటెస్టెంట్‌గా నటి శ్రీ సత్య అడుగుపెట్టారు.

FOLLOW US: 

తెలుగు బుల్లితెర వీక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్' ఆరో సీజన్ (Bigg Boss Season 6 Telugu) ఈ రోజు మొదలైంది. ఈ హౌస్‌లోకి ఆరో కంటెస్టెంట్‌గా మన తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలిసిన సీరియల్ నటి, యూట్యూబర్ శ్రీ సత్య (Sri Satya) అడుగు పెట్టారు. 

తనకు చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే ఇష్టమని, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో రావాలని ఎంబీబీఎస్ పక్కన పెట్టి మరీ వచ్చానని శ్రీ సత్య తెలిపారు. తానొక సాధారణ అమ్మాయినని తెలిపారు. మిస్ విజయవాడ, మిస్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ రౌండ్ విన్ అయిన తర్వాత టెలివిజన్ లోకి వచ్చానని ఆమె చెప్పారు.

'రేసుగుర్రం' పాటకు శ్రీ సత్య పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆమెకు జంక్ ఫుడ్ ఇష్టమని నాగార్జున జంక్ ఫుడ్ తెప్పించారు. అందులో చికెన్ తీసుకుని ఆవిడ హౌస్ లోపలకి వెళ్లారు. హౌస్ లోపలకి వచ్చిన ప్రతి ఒక్కరినీ ఒక్కో కార్డు తీసుకోమని నాగార్జున అడుగుతున్నారు. శ్రీ సత్య సెలెక్ట్ చేసుకున్న కార్డులో హార్ట్ సింబల్ వచ్చింది. ఆల్రెడీ శ్రీహాన్ కి కూడా సేమ్ కార్డు వచ్చింది. 

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. హాట్ స్టార్ లో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షోని నడిపించారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటీటీ వెర్షన్ క్లిక్ అవ్వలేదు.
 
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6 కోసం రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ షోని మొదలుపెట్టారు. ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ షోని హోస్ట్ చేసిన నాగార్జున ఇప్పుడు ఐదోసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈసారి మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. ఆదివారం నాడు గ్రాండ్ గా షో మొదలైంది. ఇక కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిగా నాగార్జున ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.

Also Read : 'సుర్రు సుమ్మైపోద్ది' - బిగ్ బాస్ హౌస్ లో చలాకీ చంటి గ్రాండ్ ఎంట్రీ!
 
ఇక ఈసారి అబ్బాయిల నెంబర్ కంటే అమ్మాయిలే ఎక్కువ మంది హౌస్ లో కనిపించబోతున్నారు. ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ ని చాలా కొత్తగా డిజైన్ చేశారు. మొత్తం 18 మంది పోటీదారులు కాబట్టి ఈసారి షో 100 రోజులకు పైగానే ఉండే ఛాన్స్ ఉంది. మధ్యలో డబుల్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. ఇక టాస్క్ ల విషయానికొస్తే.. బిగ్ బాస్ హిందీ వెర్షన్ నుంచి కొన్ని టాస్క్ లను సీజన్ 6 కోసం తీసుకోబోతున్నారని సమాచారం. గత సీజన్లలో కూడా టాస్క్ లకు సంబంధించి ఇలానే చేశారు. 

View this post on Instagram
 
A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel)

Published at : 04 Sep 2022 07:24 PM (IST) Tags: Bigg Boss 6 Telugu Bigg Boss Season 6 Telugu Bigg Boss Season 6 Bigg Boss 6 Sri Satya

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: నీ ఆటతీరు చూసి మేము కూడా షాకయ్యాం - ఆ కంటెస్టెంట్‌కు ఇచ్చిపడేసిన నాగార్జున

Bigg Boss 6 Telugu: నీ ఆటతీరు చూసి మేము కూడా షాకయ్యాం - ఆ కంటెస్టెంట్‌కు ఇచ్చిపడేసిన నాగార్జున

Bigg Boss 6 Telugu Episode 20: ఇంటి మూడో కెప్టెన్ ఆదిరెడ్డి, భార్యకు ఐలవ్యూ చెప్పిన కామన్‌మ్యాన్, జైలుకెళ్లిన లవర్ బాయ్

Bigg Boss 6 Telugu Episode 20: ఇంటి మూడో కెప్టెన్ ఆదిరెడ్డి, భార్యకు ఐలవ్యూ చెప్పిన కామన్‌మ్యాన్, జైలుకెళ్లిన లవర్ బాయ్

Bigg Boss Telugu 6: రేవంత్ తో గీతూ ఆర్గ్యుమెంట్ - వెక్కి వెక్కి ఏడ్చేసిన కీర్తి!

Bigg Boss Telugu 6: రేవంత్ తో గీతూ ఆర్గ్యుమెంట్ - వెక్కి వెక్కి ఏడ్చేసిన కీర్తి!

టాప్ స్టోరీస్

Minister Jogi Ramesh : బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh :  బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్, చంద్రబాబు చేసిన ద్రోహం మర్చిపోయారా?- మంత్రి జోగి రమేష్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

ఇంగ్లండ్‌పై టీమిండియా వివాదాస్పద విజయం - జులన్ గోస్వామికి ఘనమైన వీడ్కోలు!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!