News
News
X

Bigg Boss Telugu 6: ‘ఓ పాట పాడు రాజా’, ఇనయాను ఆడేసుకుంటున్న గీతూ, లేటేస్ట్ బిగ్ బాస్ ప్రోమో రిలీజ్

బిగ్ బాస్ రెండో రోజు నుంచే వేడెక్కడం మొదలైంది. ముఖ్యంగా గీతూ వివాదాలకు కేంద్రబిందువులా మారుతోంది.

FOLLOW US: 

చిత్తూరు యాసతో ప్రేక్షకులను అలరిస్తోంది గీతూ రాయల్. కానీ ఆమె మరీ చిన్న చిన్న విషయాలకే గొడవలు పడడం మాత్రం అప్పుడే ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తోంది. ముఖ్యంగా ఆమె ఇనయా సుల్తానాతో పదేపదే వాగ్వాదానికి దిగుతోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో కూడా ఆమె ఇనయానే టార్గెట్ చేసింది. ఇందులో ఆమె ట్రాష్ నుంచి క్లాస్‌కి మారినట్టు తెలుస్తోంది. ఆమె స్థానంలోకి బాలాదిత్య వచ్చాడు. క్లాస్‌లోకి మారాక అందరి చేత సేవలు చేయించుకోవడం మొదలుపెట్టింది. ‘తమ్ముడు బాలా యాక్సెస్ కార్డు ఏడమ్మా’ అంటూ బాలాదిత్యను ఆటపట్టించింది. 

ఇక ఇనయాను అయితే విసిగిస్తూనే ఉంది. ‘ఇనయా నా బాటిల్ తో నీళ్లు తే పో’, ‘ఆరోహి  ఓ గిన్నెతో నీళ్లు తెస్తే చేయి కడుక్కుంటా’ అంటూ సేవలు చేయించుకుంది. పదేపదే ఇనయాను పిలిచి విసిగించడం మొదలుపెట్టింది. ఇనయా రాగానే నిమ్మకాయ నీళ్లు కలిపి ఇవ్వమని అడిగింది గీతూ. నీళ్లు తెచ్చాక ఓ పాట పాడు రాజా అని అడిగింది. దానికి ఇనయా నాకు రాదు అనడంతో, ఓ రైమ్ పాడమని అడిగింది. దానికి ఇనయా పనులు చేయించుకోమన్నారు కానీ పాటలు పాడమని చెప్పలేదు అంటూ కౌంటర్ ఇచ్చింది.నీ కోం నేనెందుకు పాట పాడాలి, రైమ్ పాడాలి అంటూ సమాధానం ఇచ్చింది. దానికి గీతూ ‘వెళ్లి నా దువ్వెన తీసుకురా’ అని పని చెప్పింది. ఇనయా సీరియస్ గా గార్డెన్లోకి నడుచుకుని వెళ్లిపోయింది. 

గీతూ ప్రవర్తన కొంతమందికి విసుగు తెప్పిస్తే, కొంతమందికి నవ్వుతెప్పించింది. ఆమె కావాలనే ఇనయాను టార్గెట్ చేస్తుందని మాత్రం చూసే ప్రతివారికి అర్థమవుతోంది. ఈసారి ఇనయా వర్సెస్ గీతూ ఫైట్ తప్పేలా లేదు. ఇప్పటికే దాదాపు ఇనయా ఈ వారం నామినేషన్లోకి వెళ్లిపోయింది. ఆ బాధలో ఉన్న ఇనయాకు గీతూ తలనొప్పిలా మారింది.  

View this post on Instagram
 
A post shared by STAR MAA (@starmaa)

Also read: రెండో రోజే బిగ్‌బాస్ హౌస్‌లో ఏడుపులు, తగువులు - తిక్కదానా అంటూ తిట్లు మొదలుపెట్టిన గలాటా గీతూ

Also read: బిగ్‌బాస్6 కంటెస్టెంట్‌లా రెమ్యునరేషన్లు ఇవే, అతడు టాప్ - ఆమె లీస్ట్,

Published at : 06 Sep 2022 12:16 PM (IST) Tags: Bigg Boss Telugu Promo Bigg Boss Telugu 6 Bigg Boss Telugu 6 season promo

సంబంధిత కథనాలు

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

Devi Sri Prasad: స్టార్ హీరోతో విబేధాలు - దేవిశ్రీప్రసాద్ రియాక్షన్ ఇదే!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

RGV On Adipurush Teaser: ఆయన లుక్ నాక్కూడా నచ్చలేదు, ప్రభాస్‌పై కుట్ర పెద్ద జోక్ - ‘ఆది పురుష్’ టీజర్ పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

టాప్ స్టోరీస్

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల