ఏడాదిన్నర ఎదురుచూశా.... పవన్ కల్యాణ్ నుంచి పిలుపు రాలేదు! - రాజమౌళి
Pawan Kalyan - Rajamouli : ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్... యంగ్ స్టార్ హీరోలతో రాజమౌళి సినిమాలు చేశారు. మహేష్ బాబుతో ఓ సినిమా అంగీకరించారు. మరి, పవన్ కల్యాణ్‌తో ఎందుకు చేయలేదు? చేస్తారా? లేదా?
తెలుగు సినిమా ప్రేక్షకులు ఎదురుచూసే కాంబినేషన్‌లలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ ఒకటి. దర్శకుడు కాకముందు నుంచి పవన్ కల్యాణ్ అంటే రాజమౌళికి ఇష్టం. పవన్ హీరోగా సినిమా తీయాలని అనుకున్నారు. పవర్‌స్టార్‌ను కలిశాననీ, కానీ సినిమా తీయడం కుదరలేదని గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో వెల్లడించారు. అయితే... పవన్‌తో సినిమా ఎందుకు కుదరలేదనేది తాజాగా హాజరైన ఓ కార్యక్రమంలో వివరించారు. 'మగధీర'కు ముందు జరిగిన సంగతి ఇది.
"పవన్ కల్యాణ్ గారితో సినిమా చేయాలని నేను చాలా సంవత్సరాలు వెయిట్ చేశా. ఒకసారి కలిశా. ఆయనతో మాట్లాడితే చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. ఆ తర్వాత 'సార్... మీరు చెప్పండి. మీకు ఎలాంటి సినిమా చేయాలని ఉంది?' అని అడిగా. 'మీరు ఎలాంటి సినిమా చేయాలని అనుకుంటున్నారో చెప్పండి. నేను ఎలాంటి సినిమా చేయడానికైనా రెడీ. ఇలా చేయాలి? అలా చేయకూడదు? వంటివి లేవు' అని పవన్ చెప్పారు. అప్పుడు షూటింగ్ లో కలిశా. మీరు టైమ్ ఇస్తే... ఏ టైమ్‌లో రమ్మంటే ఆ టైమ్‌లో వచ్చి కథ చెబుతానని చెప్పా. ఆ తర్వాత ఒక ఏడాది, ఏడాదిన్నర ఎదురుచూశా... ఆయన దగ్గర నుంచి కబురు వస్తుందని! ఆయన వేరే వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈలోపు నా ఆలోచనా విధానం మారింది" అని రాజమౌళి చెప్పారు.
Also Read: ఓ కిలోమీటరు... ప్రభాస్ పరుగు ఆగలేదు... ఫ్యాన్స్‌కు పండగే!
పవన్‌ను రాజమౌళి కలిసింది దర్శకుడిగా 'మగధీర' తీయడానికి ముందే. పవన్ నుంచి కబురు రాలేదని... ఆ తర్వాత మాస్ సినిమాలు కాకుండా ఎక్కువ మందికి చేరువయ్యే సినిమాలు తీయాలని 'మగధీర', 'యమదొంగ' తీశానని రాజమౌళి వెల్లడించారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ రాజకీయాలపై దృష్టి సారించడం, తాను ఎక్కువ రోజులు అవసరమయ్యే లార్జర్ దేన్ లైఫ్ సినిమాలు తీయడం మొదలు పెట్టడంతో తమ దారులు వేరయ్యానని రాజమౌళి వివరించారు. ఆయన మాటలను గమనిస్తే... ఇప్పట్లో ఇద్దరి కాంబినేషన్ కుదిరే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
Also Read: అర్ధరాత్రి హైదరాబాద్‌లో ఆ బ్రిడ్జ్ మీద వెంకీ, వరుణ్! ఏం చేస్తున్నారంటే?
Also Read: శాండిల్‌వుడ్‌కు పునీత్ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?
Also Read: అందులో కాజల్ అగర్వాల్ సినిమా ఒక్కటీ లేదేంటి?
Also Read: పునీత్ రాజ్‌కుమార్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు...
Also Read: పెళ్లాం లేచిపోతే.... పెళ్లి కొడుక్కి వచ్చే కష్టాలు ఏంటి?
Also Read: పునీత్ నా బాడీగార్డ్.. జిమ్ చేయడం వల్ల చనిపోలేదు, రాత్రి నుంచే..: హీరో శ్రీకాంత్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి