Pushpaka Vimanam Trailer: పెళ్లాం లేచిపోతే.... పెళ్లి కొడుక్కి వచ్చే కష్టాలు ఏంటి?
ఆనంద్ దేవరకొండ నటించిన 'పుష్పక విమానం' సినిమా ట్రైలర్ ను ప్రముఖ హీరో అల్లు అర్జున్ లాంచ్ చేశారు.
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. 'దొరసాని' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. ఆ తరువాత 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో హిట్ అందుకున్నాడు. ఈసారి 'పుష్పక విమానం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రముఖ హీరో అల్లు అర్జున్ ట్రైలర్ లాంచ్ చేయగా.. విజయ్ దేవరకొండ 'థాంక్యూ బన్నీ అన్నా' అంటూ ట్వీట్ చేశాడు.
Also Read: పునీత్ రాజ్‌కుమార్‌కు బాలకృష్ణ, ఎన్టీఆర్ నివాళి.. తలకొట్టుకుంటూ కన్నీరుమున్నీరు
ఇక ఈ ట్రైలర్ ను చూస్తుంటే చాలా కామెడీగా అనిపిస్తుంది. ట్రైలర్ లోనే కథ చెప్పే ప్రయత్నం చేశారు. గవర్మెంట్ స్కూల్ లో టీచర్ గా పనిచేసే ఓ అమాయకపు కుర్రాడికి.. అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. ఎన్నో ఆశలతో సిటీలో కాపురం పెడతారు. అయితే పెళ్లైన దగ్గర నుంచి తన భార్యను మాత్రం ఎవరికీ చూపించడు. భర్త ఇంట్లోనే ఉన్నట్లుగా అందరినీ నమ్మిస్తుంటాడు.
అలా నమ్మించడానికి నానా కష్టాలు పడుతుంటాడు. కానీ అతడి భార్య కాపురం పెట్టిన మొదటిరోజే లేచిపోతుంది. ఈ విషయంలో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఈ క్రమంలో కొన్ని సన్నివేశాలు చాలా కామెడీగా ఉన్నాయి. తన భార్య లేచిపోయిందని లెటర్ రాసి పెట్టిందని.. కానీ ఆ లెటర్ మింగేసా అని హీరో పోలీసులకు చెప్పడం హైలైట్ గా నిలిచింది.
ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ మట్టపల్లి, గోవర్ధన్ రావు దేవరకొండ నిర్మాతలు. ఈ సినిమాను నవంబరు 12న విడుదల చేయబోతున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు.
Happy to launch the trailer of #PushpakaVimanam. Best wishes to the entire team.https://t.co/0vJFz8uytS@TheDeverakonda @ananddeverkonda @itsdamodara @SaanveMegghana @tanga_official @GeethSaini @KingofHillEnt
— Allu Arjun (@alluarjun) October 30, 2021
Also Read: నోట మాట రాలేదు... పునీత్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి
Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. మోదీ ట్వీట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి