అన్వేషించండి

Srikanth: పునీత్ నా బాడీగార్డ్.. జిమ్ చేయడం వల్ల చనిపోలేదు, రాత్రి నుంచే..: హీరో శ్రీకాంత్

జిమ్‌లో కసరత్తులు చేస్తూ పునీత్ రాజ్‌కుమార్ కుప్పకూలడని వస్తున్న వార్తల్లో నిజం లేదని హీరో శ్రీకాంత్ తెలిపారు. పునీత్‌తో కలిసి నటించిన ‘జేమ్స్’ సినిమాలో కొన్ని సీన్లు ఇంకా పూర్తికాలేదన్నారు.

బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పార్థీవ శరీరాన్ని చూసి అభిమానులు, ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు. టాలీవుడ్ నటులు నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్‌, ఆలీ‌తోపాటు ప్రభుదేవ తదితరులు పునీత్‌కు నివాళులు అర్పించారు. స్టేడియం ప్రాంగణంలోనే పునీత్‌కు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. పునీత్ తల్లితండ్రులు పార్వతమ్మ, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ అంతిమ సంస్కారాలను కూడా ఇక్కడే నిర్వహించారు. 

పునీత్‌కు నివాళులు అర్పించిన తర్వాత హీరో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పునీత్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు. ‘‘పునీత్ లేడంటే నమ్మలేకపోతున్నాం. కన్నడంలో ‘జేమ్స్’ సినిమా కోసం 40 రోజులు ఆయనతో కలిసి పనిచేశాను. ఈ సినిమా కంటే ముందు నుంచే పునీత్ తెలుసు. ఆయన అన్న శివ రాజ్‌కుమార్‌, ఆయన కుటుంబ సభ్యులు నాకు బాగా తెలుసు. ‘జేమ్స్’ సినిమా ఇంకా పూర్తి కాలేదు. అందులో నాది ప్రతినాయకుడి పాత్ర. నాకు బాడీగార్డుగా పునీత్ నటిస్తున్నాడు. ఇంకా ఒక ఫైట్ సీన్, పాట, డబ్బింగ్ మిగిలి ఉంది. డబ్బింగ్ శివ రాజ్‌కుమార్ చెప్పవచ్చేమో. వారం కిందటే పునీత్ నాతో మాట్లాడాడు. కన్నడ డబ్బింగ్ కూడా నేనే చెప్పాలని కోరాడు’’ అని శ్రీకాంత్ తెలిపారు.

పునీత్‌కు రాత్రి నుంచే బాగోలేదు: ‘‘జేమ్స్ షూటింగ్ సమయంలో పునీత్ రోజు నాకు ఇంటి నుంచి భోజనం తెచ్చేవాడు. అప్పు చాలా ఫిట్‌గా ఉంటాడు. ఎప్పుడూ హుషారుగా ఉండే వ్యక్తి. ఏ రోజు ఆయనకు ఫీవర్, ఇతర అనారోగ్య సమస్యలేవీ రాలేదని పునీత్ ఫ్రెండ్స్ చెప్పారు. ఆయనకు గర్వమనేదే ఉండేది కాదు. అభిమానులను కౌగిలించుకుని అప్యాయంగా ఉండేవాడు. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా సేవా కార్యక్రమాలు చేసేవాడు. మీడియాలో ఆయన జిమ్‌లో వ్యాయామం చేస్తూ పడిపోయారని అంటున్నారు. అందులో నిజం లేదు. రాత్రి నుంచే ఇబ్బందిగా ఉందన్నాడు. ఉదయం 8 గంటల సమయంలో తన ఫ్యామిలీ డాక్టర్‌ను కలిశాడు. అక్కడి నుంచి హాస్పిటల్‌కు వెళ్తుండగా చనిపోయాడు.  

Also Read: మంచు విష్ణుకు హైపర్ ఆది పంచ్.. ‘లెట్ దెమ్ నో అంకుల్’ అంటూ..

పునీత్ కుమార్తె అమెరికా నుంచి బెంగళూరు రావడానికి ఆలస్యం కావడంతో అంతిమ సంస్కారాలను ఆదివారం 10.30 గంటలకు నిర్వహించనున్నారు. దీంతో శనివారం సాయంత్రం 6 గంటలకు పూనీత్ భౌతికకాయ సందర్శన నిలిపివేశారు. పునీత్‌కు ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలకనున్నారు. పునీత్ మృతికి సంతాపంగా ఇప్పటికే కర్ణాటకలో థియేటర్లను మూసివేశారు. మూడు రోజుల పాటు మద్యపాన నిషేధం విధించారు.

Also Read: పునీత్ రాజ్‌కుమార్‌కు బాలకృష్ణ, ఎన్టీఆర్ నివాళి.. తలకొట్టుకుంటూ కన్నీరుమున్నీరు

Also Read: ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావ్! - పునీత్ మరణంపై అనుష్క స్పందన

 Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. మోదీ ట్వీట్

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today October 18th: ‘మేఘసందేశం’ సీరియల్‌:  భూమి మెడలో తాళి కట్టబోయిన సూర్య – పోలీస్‌ గెటప్ లో వచ్చి పెళ్లి ఆపేసిన ఆకాష్‌
‘మేఘసందేశం’ సీరియల్‌:  భూమి మెడలో తాళి కట్టబోయిన సూర్య – పోలీస్‌ గెటప్ లో వచ్చి పెళ్లి ఆపేసిన ఆకాష్‌
Ranikanth Movies OTT : థియేటర్లలో జైలర్ 2 హవా - ఓటీటీల్లో రజనీ కాంత్ టాప్ ట్రెండింగ్ మూవీస్
థియేటర్లలో జైలర్ 2 హవా - ఓటీటీల్లో రజనీ కాంత్ టాప్ ట్రెండింగ్ మూవీస్
Crime Thriller Series OTT : గ్యాంగ్ స్టర్ 'అక్క' వయలెన్స్ మామూలుగా లేదు - కీర్తి సురేష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
గ్యాంగ్ స్టర్ 'అక్క' వయలెన్స్ మామూలుగా లేదు - కీర్తి సురేష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dorothy OTT : ఓటీటీలోకి కీర్తి సురేశ్ బోల్డ్ మూవీ - ఎప్పుడు, ఎందులో, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కీర్తి సురేశ్ బోల్డ్ మూవీ - ఎప్పుడు, ఎందులో, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
BJP Candidates List: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
AP Elections: నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
నామినేషన్లకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు.. కలెక్టర్లతో ఎస్‌ఈసీ పునేఠా అత్యవసర సమీక్ష
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: షాలినికి ఫుల్ కోంటింగ్! నీతూకి చీవాట్లు! త్రిగుణ్ దెబ్బకి ఏడ్చేసిన రోహిత్!
Jio Platforms IPO: జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓకు లిస్టింగ్‌కు ముందే రూ. 2.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల డిమాండ్
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Embed widget