అన్వేషించండి

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్‌ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు...

పునీత్ రాజ్‌కుమార్‌

1/19
కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుటుంబంలో ఆఖరి సంతానం పునీత్ రాజ్‌కుమార్‌. 1975లో మార్చి 17న జన్మించారు. అతని కంటే ముందు ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. (Image Credit/ Social Media)

2/19
ఊహ తెలియని వయసులో పునీత్ నటుడిగా పరిచయమయ్యారు. ఆరు నెలల వయసులో 'ప్రేమద కనిక' సినిమాతో తెరంగేట్రం చేశారు. అప్పుడు అతనికి పేరు కూడా పెట్టలేదు. ఆ సినిమా టైటిల్స్‌లో 'మాస్టర్ రాజ్ కుమార్' అని వేశారు. బాల నటుడిగా రెండో సినిమా నుండి లోహిత్ అని వేశారు. (Image Credit/ Social Media)

3/19
'చలీసువ మాడగళు' సినిమాకు బాలనటుడిగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అందించే పురస్కారం అందుకున్నారు. అప్పటికి అతని వయసు ఏడేళ్లు. (Image Credit/ Social Media)

4/19
పునీత్ చైల్డ్ హుడ్ ఫెవరెట్ సాంగ్ ఏంటో తెలుసా? 'అయామ్ ఏ డిస్కో డ్యాన్సర్'!  అవును... మిథున్ చక్రవర్తి  పాటే. (Image Credit/ Puneeth Rajkumar Facebook)

5/19
'బెట్టాద హువు' సినిమాతో బాలనటుడిగా పునీత్ నేషనల్ అవార్డు అందుకున్నారు. అప్పుడు ఆయన వయసు ఏడేళ్లు. (Image Credit/ Social Media)

6/19
బాలనటుడిగా పునీత్ చివరి సినిమా 'శివ మెచ్చిన కన్నప్ప'. అందులో శివుడిగా రాజ్ కుమార్ అతిథి పాత్రలో కనిపించారు. శివ రాజ్ కుమార్ హీరోగా నటించారు. ఈ సినిమాతో లోహిత్ నుండి పునీత్ గా పేరు మారింది. (Image Credit/ Puneeth Rajkumar Facebook)

7/19
హీరోగా పరిచయం కావడానికి ముందే పునీత్ వివాహమైంది. ఓ స్నేహితుడి ద్వారా పరిచయమైన అశ్వినిని ప్రేమించి పెళ్లి (డిసెంబర్ 1, 1999) చేసుకున్నారు. ఆమెది బెంగళూరు. (Image Credit/ Social Media)

8/19
'అప్పు' (2002) సినిమాతో పునీత్ హీరోగా పరిచయమయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా పునీత్ కెరీర్ కు గట్టి పునాది వేసింది. (Image Credit/ Social Media)

9/19
'అరసు' (2007)తో హీరోగా పునీత్ తొలి అవార్డు అందుకున్నారు. ఆ సినిమాతో ఆయనకు ఫిల్మ్ ఫేర్ వచ్చింది. (Image Credit/YouTube)

10/19
'మిలన' (2007)తో హీరోగా పునీత్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం అందుకున్నారు. ఆ సినిమా 365 రోజులు ఆడింది. (Image Credit/ Social Media)

11/19
కర్ణాటకలో పునీత్‌ను చాలామంది రాజ్‌కుమార్‌తో పోలుస్తారు. న‌ట‌న‌లో, దానంలో తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అని అంటుంటారు. అయితే, పునీత్ మాత్రం తండ్రితో పోల్చవద్దని చెప్పేవారు. తనను తల్లి గారాబంగా పెంచారని పునీత్ అంటుండేవారు. తల్లికి పునీత్ చాలా క్లోజ్.  (Image Credit/ Puneeth Rajkumar Facebook)

12/19
పునీత్, అశ్విని దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారి పేర్లు ధ్రితి, వందిత. (Image Credit/ Social Media)

13/19
పునీత్ హీరో మాత్రమే కాదు. నిర్మాత కూడా. పి.ఆర్.కె ప్రొడక్షన్స్ (పునీత్ రాజ్ కుమార్) స్థాపించి... తొలి ప్రయత్నంగా 'కావలుధారి' నిర్మించారు. ఆ సినిమాను తెలుగులో 'కపటధారి'గా సుమంత్ రీమేక్ చేశారు. ఆయన నిర్మించిన 'ఫ్రెంచ్ బిర్యానీ', 'ఫ్యామిలీ ప్యాక్' సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. (Image Credit/ Puneeth Rajkumar Facebook)

14/19
పునీత్, రజనీకాంత్ మధ్య వయసులో చాలా వ్యత్యాసం ఉంది. కానీ, నటులుగా ఇద్దరి మధ్య తేడా ఒక్క ఏడాదే. రజనీకాంత్ 'అపూర్వ రాగంగాళ్' (1975) విడుదలైన మరుసటి ఏడాది బాలనటుడిగా పునీత్ తొలి సినిమా 'ప్రేమద కనిక' (1976) విడుదలైంది. (Image Credit/ Puneeth Rajkumar Facebook)

15/19
'మీలో ఎవరు కోటీశ్వరుడు' కన్నడ వెర్షన్ 'కన్నడద కొట్యాధిపతి'తో టీవీ హోస్ట్ అవతారం ఎత్తారు పునీత్. ఓ టీవీ షో 'నేత్రావని' ప్రొడ్యూస్ చేశారు. (Image Credit/ Puneeth Rajkumar Facebook)

16/19
పునీత్ గాయకుడు కూడా! పాటలు పాడటం ద్వారా వచ్చే ఆదాయాన్ని సహాయ కార్యక్రమాలకు వినియోగించేవారు. (Image Credit/ Puneeth Rajkumar Facebook)

17/19
శివ రాజ్ కుమార్ నటించిన 'భజరంగీ 2' కన్నడ, తెలుగు భాషల్లో శుక్రవారం విడుదలైంది. బెంగళూరులో నిర్వహించిన ఆ సినిమా వేడుకలో యష్, శివతో కలిసి పునీత్ డ్యాన్స్ చేశారు. అదే ఆయన పాల్గొన్న చివరి సినిమా వేడుక. (Image Credit/ Social Media)

18/19
'కిల్లింగ్ వీరప్పన్', 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు శివ రాజ్ కుమార్ తెలుసు. పునీత్ మరో అన్నయ్య రాఘవేంద్ర రాజ్ కుమార్ కూడా కన్నడలో హీరో. (Image Credit/ Social Media)

19/19
పునీత్ కు సైక్లింగ్, ఫిట్నెస్ అంటే ఇష్టం. ఎప్పుడూ ఫిట్ గా ఉండేవారు. ఓ సినిమా కోసం బాడీ బిల్డ్ చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చి మరణించారు. పునీత్ హీరోగా రెండు సినిమాలు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. (Image Credit/ Puneeth Rajkumar Facebook)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget