X

Prabhas: ఓ కిలోమీటరు... ప్రభాస్ పరుగు ఆగలేదు... ఫ్యాన్స్‌కు పండగే!

#RadheShyam : మధురమైన ప్రేమకథా చిత్రంగా రూపొందిన 'రాధే శ్యామ్'లో ఓ ఛేజింగ్ సీక్వెన్స్ ఉంది. దాని కోసం ప్రభాస్ చాలా శ్రమించారట. ఆయన ఏం చేశారంటే?

FOLLOW US: 

'రాధే శ్యామ్'... ప్రేమకథా చిత్రం! అందులో మరో సందేహం అవసరం లేదు. మరి, ప్రభాస్? యాక్షన్ హీరో! గతంలో ఆయన ప్రేమకథా చిత్రాలు చేశారు. కానీ, ఇటీవల ప్రేమకథలు చేయలేదు. 'మిర్చి', 'బాహుబలి', 'సాహో' సినిమాల్లో ప్రేమ కంటే యాక్షన్ ఎక్కువ. ముఖ్యంగా 'బాహుబలి', 'సాహో' సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు యాక్షన్ ఇమేజ్ తీసుకొచ్చాయి. అభిమానులు ప్రభాస్ నుండి యాక్షన్ సన్నివేశాలు ఆశిస్తారు. 'రాధే శ్యామ్'లో అవి ఉండవా? అంటే... ఉన్నాయి.

రీసెంట్‌గా రిలీజైన‌ 'రాధే శ్యామ్' టీజ‌ర్‌లో ప్రభాస్ చేతి నుండి రక్తం కారుతున్నట్టు ఓ షాట్ చూపించారు. ఇంట్లో ఓ ఫైట్ ఉంటుందని, ఆ షాట్ అందులోనిదని టాక్. అది కాకుండా... మార్కెట్ ఏరియాలో ఓ ఛేజింగ్ సీక్వెన్స్ ఉందనే సంగతి తెలిసిందే. దాని కోసం ప్రభాస్ చాలా శ్రమించారట. 'రాధే శ్యామ్' షెడ్యూల్ ఒకటి జార్జియాలో చేశారు. అక్కడే మార్కెట్ సెట్ లో ఛేజింగ్ సీక్వెన్స్  చిత్రీకరించారు. ఆ ఛేజ్ కోసం ఓ కిలోమీటరు ఆగకుండా నాన్‌-స్టాప్‌గా ప్రభాస్ పరుగు తీశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అందుకు, ప్రభాస్ స్ప్రింట్ రన్నింగ్ ప్రాక్టీస్ చేశారు. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కెన్నీ బాట్స్ నేతృత్వంలో ఈ ఛేజ్ తీశారు. స్ట‌యిలిష్‌గా, క్యూట్‌గా ఉంటుందని, 'రాధే శ్యామ్'కు ఇది హైలైట్ అవుతుందని యూనిట్ భావిస్తోందట. 'డార్లింగ్'లో ఫైట్స్ కూడా స్ట‌యిలిష్‌గా , క్యూట్‌గా ఉంటాయి. మరోసారి అటువంటి ఫైట్స్ ప్రభాస్ ట్రై చేస్తున్నారన్నమాట.

Also Read: అర్ధరాత్రి హైద‌రాబాద్‌లో ఆ బ్రిడ్జ్ మీద వెంకీ, వరుణ్! ఏం చేస్తున్నారంటే?

ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించిన 'రాధే శ్యామ్' వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యువి క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ నిర్మిస్తున్నాయి. తెలుగు సహా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. హిందీకి  మిథున్ - మనన్ భరద్వాజ్, అనూ మాలిక్ సంగీతం అందిస్తుండగా.... దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: శాండిల్‌వుడ్‌కు పునీత్ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?
Also Read: అందులో కాజల్ అగర్వాల్ సినిమా ఒక్కటీ లేదేంటి?
Also Read: పునీత్ రాజ్‌కుమార్‌ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు...
Also Read: పెళ్లాం లేచిపోతే.... పెళ్లి కొడుక్కి వచ్చే కష్టాలు ఏంటి?
Also Read: పునీత్ నా బాడీగార్డ్.. జిమ్ చేయడం వల్ల చనిపోలేదు, రాత్రి నుంచే..: హీరో శ్రీకాంత్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Prabhas Pooja hegde Radhe Shyam పూజా హెగ్డే Radhe Shyam Chase Sequence Radhe Shyam News

సంబంధిత కథనాలు

Bigg Boss 5 Telugu: 'నీ గురించి ఫైట్ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేవీ గుర్తులేవు' సిరిపై షణ్ముఖ్ ఫైర్..

Bigg Boss 5 Telugu: 'నీ గురించి ఫైట్ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేవీ గుర్తులేవు' సిరిపై షణ్ముఖ్ ఫైర్..

RRR Movie Length: ఆర్ఆర్ఆర్.. అంతసేపా.. ఇద్దరు హీరోలంటే ఆ మాత్రం ఉంటది!

RRR Movie Length: ఆర్ఆర్ఆర్.. అంతసేపా.. ఇద్దరు హీరోలంటే ఆ మాత్రం ఉంటది!

Bipin Rawat Demise: మీరు లేని లోటు పూడ్చలేనిది.. బిపిన్ రావత్‌కు సెలబ్రిటీల నివాళులు!

Bipin Rawat Demise: మీరు లేని లోటు పూడ్చలేనిది.. బిపిన్ రావత్‌కు సెలబ్రిటీల నివాళులు!

Vijay Devarakonda: మహేష్ బాబు బ్రాండ్ కొట్టేసిన రౌడీ హీరో..

Vijay Devarakonda: మహేష్ బాబు బ్రాండ్ కొట్టేసిన రౌడీ హీరో..

Pushpa: 'ఉ.. అంటావా.. ఊఊ అంటావా..' సమంత స్పెషల్ సాంగ్ వచ్చేస్తుందోచ్..

Pushpa: 'ఉ.. అంటావా.. ఊఊ అంటావా..' సమంత స్పెషల్ సాంగ్ వచ్చేస్తుందోచ్..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Horoscope Today 9 December 2021: ఈ రాశివారు మంచి సలహాలు ఇస్తారు.. మీరు అందులో ఉన్నారా, ఈ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 9 December 2021: ఈ రాశివారు మంచి సలహాలు ఇస్తారు.. మీరు అందులో ఉన్నారా, ఈ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

CDS Bipin Rawat Chopper Crash Live: గురువారం ఢిల్లీకి రావత్ దంపతుల మృతదేహాలు.. శుక్రవారం అంత్యక్రియలు

CDS Bipin Rawat Chopper Crash Live: గురువారం ఢిల్లీకి రావత్ దంపతుల మృతదేహాలు.. శుక్రవారం అంత్యక్రియలు

Saiteja Helicopter Crash : సీడీఎస్‌కే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..! కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...

Saiteja Helicopter Crash :  సీడీఎస్‌కే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..!  కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...