News
News
X

Vijay Deverakonda: 'లైగర్'కి సీక్వెల్ - అసలు విషయం చెప్పిన విజయ్ దేవరకొండ

'లైగర్' సినిమా ఇంతగా జనాలకు రీచ్ అవ్వడానికి కారణం కరణ్ జోహార్ అని చెప్పారు విజయ్.

FOLLOW US: 

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన 'లైగర్'(Liger) సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు విజయ్ అండ్ టీమ్. ఈ నెల మొత్తం కూడా ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం తిరుగుతున్నారు. ఇప్పటికే పలు నగరాలను సందర్శించగా.. ఇప్పుడు మరికొన్ని సిటీలకు వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

'లైగర్' సినిమా ఇంతగా జనాలకు రీచ్ అవ్వడానికి కారణం కరణ్ జోహార్ అని చెప్పారు విజయ్. తను హైదరాబాద్ నుంచి వచ్చానని.. పూరి గారు ఏపీలో నర్సీపట్నం అనే చిన్న విలేజ్ నుంచి వచ్చారని.. స్క్రిప్ట్ నచ్చడంతో.. తమ నుంచి ఏదీ ఆశించకుండా 'లైగర్' సినిమాకి సాయం చేస్తున్నారని కరణ్ గురించి గొప్పగా మాట్లాడారు విజయ్. ఇదే సమయంలో 'లైగర్'కి సీక్వెల్ ఉంటుందా..? అని ప్రశ్నించగా.. ఉండొచ్చని బదులిచ్చారు విజయ్. 

కానీ ఇప్పుడే సీక్వెల్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని తెలిపారు. 'లైగర్' సినిమా గనుక భారీ హిట్ అయితే కచ్చితంగా సీక్వెల్ ఆలోచన వస్తుంది. సినిమా రిజల్ట్ ను బట్టి సీక్వెల్ ఉంటుందా..? లేదా..? అనే విషయంపై క్లారిటీ వస్తుంది. 

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. మొదట్నుంచి ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది. ఈ సినిమాలో ఇప్పటివరకు నాలుగు పాటలు విడుదల కాగా, ఒక్కో దానికి ఒక్కో సంగీత దర్శకుడు పనిచేశారు. మొదట విడుదలైన ‘ది లైగర్ హంట్ థీమ్’కు విక్రం మోంట్రోస్, ‘అక్డీ పక్డీ’కి లిజో జార్జ్, డీజే చేటాస్, సునీల్ కశ్యప్, ‘Watt Laga Denge’కు సునీల్ కశ్యప్, ‘ఆఫట్’కు తనిష్క్ బగ్చి సంగీతం అందించారు.

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత పూరి జగన్నాథ్, యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్నా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండకు స్టార్‌డం తీసుకొచ్చిన అర్జున్ రెడ్డి విడుదలైన రోజే లైగర్ కూడా రిలీజ్ కానుండటంతో ఇది కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

స్పోర్ట్స్ యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో రమ్యకృష్ణ విజయ్ తల్లి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.

Also Read : 'లైగర్' సెన్సార్ రిపోర్ట్ - ఆ బూతు డైలాగ్స్ కట్!

Also Read : 'లైగర్' సెన్సార్ రిపోర్ట్ - సినిమాలో పాటలు ఎన్ని? ఫైట్లు ఎన్ని?

Published at : 19 Aug 2022 04:25 PM (IST) Tags: Puri Jagannadh Liger Movie Vijay Deverakonda karan johar Liger Sequel

సంబంధిత కథనాలు

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Devatha October 7th Update: సత్య ముందు ఆదిత్యని ఇరికించిన రుక్మిణి- జానకమ్మని ఇంటికి తీసుకొచ్చేసిన రాధ

Devatha October 7th Update: సత్య ముందు ఆదిత్యని ఇరికించిన రుక్మిణి- జానకమ్మని ఇంటికి తీసుకొచ్చేసిన రాధ

Adipurush Director Om Raut : మేం ఏ తప్పూ చేయలేదు , నా రావణుడు ఇంతే - 'ఆదిపురుష్' దర్శకుడు

Adipurush Director Om Raut : మేం ఏ తప్పూ చేయలేదు , నా రావణుడు ఇంతే - 'ఆదిపురుష్' దర్శకుడు

Ennenno Janmalabandham October 7th : మలబార్ మాలినినా మజాకా, స్పృహలోకి వచ్చిన సులోచన - యాక్సిడెంట్ చేసిన ఖైలాష్

Ennenno Janmalabandham October 7th : మలబార్ మాలినినా మజాకా, స్పృహలోకి వచ్చిన సులోచన - యాక్సిడెంట్ చేసిన ఖైలాష్

Bigg Boss 6 Telugu Episode 33: ఎట్టకేలకు రేవంత్ కెప్టెన్? తమ కోరికల చిట్టాను బిగ్‌బాస్‌కు చెప్పిన ఇంటి సభ్యులు, తన కుక్కల బొచ్చు అడిగిన గీతూ

Bigg Boss 6 Telugu Episode 33: ఎట్టకేలకు రేవంత్ కెప్టెన్? తమ కోరికల చిట్టాను బిగ్‌బాస్‌కు చెప్పిన ఇంటి సభ్యులు, తన కుక్కల బొచ్చు అడిగిన గీతూ

టాప్ స్టోరీస్

YSRCP MLA: మాకు ఓటు వేయకపోతే పింఛన్లు ఆపేస్తాం - వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

YSRCP MLA: మాకు ఓటు వేయకపోతే పింఛన్లు ఆపేస్తాం - వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్, కేఏ పాల్ మాత్రమే సొంత విమానాలు కొన్నారు, భవిష్యత్ లో పొత్తు పెట్టుకుంటారేమో?- బండి సంజయ్

Godfather Box Office : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?

Godfather Box Office : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?

Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy :  మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు