Liger: 'లైగర్' సెన్సార్ రిపోర్ట్ - ఆ బూతు డైలాగ్స్ కట్!
'లైగర్' సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ సర్టిఫికెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda_ నటించిన 'లైగర్'(Liger) సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు విజయ్ అండ్ టీమ్. ఈ నెల మొత్తం కూడా ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం తిరుగుతున్నారు. ఇప్పటికే పలు నగరాలను సందర్శించగా.. ఇప్పుడు మరికొన్ని సిటీలకు వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
సినిమా హిందీ వెర్షన్ సెన్సార్ సర్టిఫికెట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 17వ తేదీన సెన్సార్ పూర్తయినట్లు తెలుస్తోంది. సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు. అయితే ఈ సినిమాకి సెన్సార్ టీమ్ ఏడు మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. అందులో కొన్ని డైలాగ్స్ మార్చాల్సి వచ్చింది, కొన్ని చోట్ల మ్యూట్ వేయాల్సి వచ్చింది. నిడివిలో మాత్రం ఎలాంటి మార్పులు లేదు.
List of Objections & Cuts from Censor Board: సెన్సార్ సర్టిఫికెట్ ప్రకారం.. సినిమాలో ఓ బ్రిటీష్ నోవలిస్ట్ డైలాగ్ ను వాడుకున్నారు. దాన్ని హిందీలోయాడ్ చేశారు. టైటిల్ కార్డును కూడా యాడ్ చేశారు. ఇక 48 నిమిషం దగ్గర 'సైకిల్ తోకో' అనే పదాన్ని మ్యూట్ చేశారు. ఆ తరువాత ఆరు సార్లు 'ఫ*' అనే పదాన్ని మ్యూట్ చేశారు. వీటితో పాటు కుతియా అనే పదాన్ని గంట మూడో నిమిషం దగ్గర మ్యూట్ చేశారు. 'కే లవ్' అనే మాటను కూడా మ్యూట్ చేశారు. ఇవి కాకుండా 'వో తేరీ చాతతా హై..' అనే డైలాగ్‌ను 'లెజెండ్ తేరా చెంచా..' అనే డైలాగ్‌తో మార్చారు.
ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. మొదట్నుంచి ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది. ఈ సినిమాలో ఇప్పటివరకు నాలుగు పాటలు విడుదల కాగా, ఒక్కో దానికి ఒక్కో సంగీత దర్శకుడు పనిచేశారు. మొదట విడుదలైన ‘ది లైగర్ హంట్ థీమ్’కు విక్రం మోంట్రోస్, ‘అక్డీ పక్డీ’కి లిజో జార్జ్, డీజే చేటాస్, సునీల్ కశ్యప్, ‘Watt Laga Denge’కు సునీల్ కశ్యప్, ‘ఆఫట్’కు తనిష్క్ బగ్చి సంగీతం అందించారు.
ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత పూరి జగన్నాథ్, యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్నా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండకు స్టార్‌డం తీసుకొచ్చిన అర్జున్ రెడ్డి విడుదలైన రోజే లైగర్ కూడా రిలీజ్ కానుండటంతో ఇది కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
స్పోర్ట్స్ యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో రమ్యకృష్ణ విజయ్ తల్లి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.
Also Read: తిరు రివ్యూ : ధనుష్, నిత్యా మీనన్ సినిమా ఎలా ఉందంటే?
Also Read: విద్యా బాలన్ 'డర్టీ పిక్చర్'కు సీక్వల్, ఆ పాత్ర చేసేందుకు కంగనా తిరస్కరణ?