Vidya Balan: ఆ ఫోటోస్ చూసి మమ్మల్ని ఎంజాయ్ చేయనివ్వండి - రణ్‌వీర్ న్యూడ్ ఫోటోస్ పై విద్యా బాలన్ కామెంట్స్
న్యూడ్ ఫోటోషూట్ చేసి బాలీవుడ్ ని షేక్ చేశారు రణ్‌వీర్ సింగ్. దీనిపై బాలీవుడ్ నటీనటులు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.
న్యూడ్ ఫోటోషూట్ చేసి బాలీవుడ్‌ను షేక్ చేశారు రణ్‌వీర్ సింగ్. సోషల్ మీడియాలో ఈ ఫోటోస్‌తో చాలా మీమ్స్ కూడా వచ్చాయి. కొందరు దీన్ని సపోర్ట్ చేస్తుంటే మరి కొందరు మాత్రం విమర్శిస్తున్నారు. తాజాగా దీనిపై బాలీవుడ్ నటి విద్యా బాలన్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మహిళలని కూడా ఈ ఫోటోస్ చూసి ఎంజాయ్ చేయనివ్వమని ఆమె అన్నారు. ముంబయిలో జరిగిన అవార్డుల వేడుకకు విద్యా బాలన్ హాజరయ్యారు. పలువురు మీడియా ప్రతినిధులు విద్యా బాలన్‌ను దీని గురించి అడిగారు.
‘‘అందులో తప్పేముంది? ఒక పురుషుడు న్యూడ్‌గా ఫస్ట్ టైం ఫోటోస్ దిగాడు. అవి చూసి ఎంజాయ్ చేయనివ్వండి. కొంతమందికి (పోలీసు కేసు పెట్టిన వాళ్ళు) ఆ ఫోటోస్ నచ్చకపోతే చూడటం మానెయ్యాలి. వాళ్ళకి ఏం పని లేదనుకుంటా అందుకే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం లాంటివి చేసి వాళ్ళ టైం వెస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి నచ్చకపోతే ఫోటోస్ చూడకుండా పేపర్ పక్కన పడెయ్యాలి’’ అని అన్నారు. పేపర్ మ్యాగజైన్ కోసం రణ్‌వీర్ సింగ్ న్యూడ్ అండ్ బోల్డ్ ఫోటోషూట్ చేశారు. రణ్‌వీర్ భార్య, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్‌కు ఈ ఫోటో ఘాట్ తనకి తెగ నచ్చేసిందట.
రణ్‌వీర్ ట్రెండ్‌ను పలువురు ఫాలో కూడా అయ్యారు. విష్ణు విశాల్, టాలీవుడ్ నటుడు నందు కూడా రణ్‌వీర్ ట్రెండ్ అంటూ అర్థనగ్న ఫోటోస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు గాను రణవీర్ సింగ్‌పై పోలీస్ ఫిర్యాదు నమోదైంది. మహిళల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఈ ఫొటోలు ఉన్నాయంటూ.. చెంబూర్ పోలీస్ స్టేషన్‌లో ఓ ఎన్జీవో రణ్‌వీర్‌పై ఫిర్యాదు చేసింది. కంప్లైంట్‌లో పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అలానే ఇండియన్ పీనల్ కోడ్‌లోని వివిధ సెక్షన్ల కింద నటుడిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినవారు డిమాండ్ చేశారు.
Also Read : థియేటర్లకు జనాలు రావడం లేదంటే నమ్మను, ఇండస్ట్రీకి ఇది గడ్డు కాలం కాదు - ఎన్టీఆర్
Also Read : ఫ్యాట్ టు ఫిట్, 88 నుంచి 75 కేజీల వరకూ - నందమూరి కళ్యాణ్ రామ్ కష్టం అంతా ఇంతా కాదు
View this post on Instagram