News
News
X

NTR Speech : థియేటర్లకు జనాలు రావడం లేదంటే నమ్మను, ఇండస్ట్రీకి ఇది గడ్డు కాలం కాదు - ఎన్టీఆర్

'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్... తన అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ పడిన కష్టం గురించి, ఇండస్ట్రీ గురించి మాట్లాడారు.

FOLLOW US: 

''ఇండస్ట్రీకి గడ్డు కాలం అంటున్నారు. థియేటర్లకు జనాలు రావడం లేదని అంటున్నారు. ఇదంతా నేను నమ్మను'' అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు. అద్భుతమైన సినిమా వస్తే చూసి ఆశీర్వదించే గొప్ప హృదయం కలిగినటువంటి తెలుగు ప్రేక్షకులంతా దేవుళ్ళని ఆయన చెప్పారు. 'బింబిసార'ను ప్రేక్షకులు అందరూ ఆదరించాలని ఆయన కోరారు.

నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'బింబిసార'. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండస్ట్రీలో తాజా పరిస్థితులపై క్లుప్తంగా మాట్లాడిన ఆయన... అన్నయ్య కళ్యాణ్ రామ్, ఇతర యూనిట్ సభ్యుల గురించి మాట్లాడారు. 'బింబిసార'తో పాటు వచ్చే 'సీతా రామం' సినిమాను కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 

'బింబిసార'గా కళ్యాణ్ రామ్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేం!
'బింబిసార' సినిమాలో, ఆ పాత్రలో కళ్యాణ్ రామ్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేమని ఎన్టీఆర్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''మీకు నచ్చే వరకూ సినిమాలు చేస్తూనే ఉంటామని గతంలో ఇదే వేదికపై చెప్పను. మీరు కలర్ ఎగరేసుకునేలా చేయడమే మా బాధ్యత అని అన్నాను. ఈ సినిమా విడుదల తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ గారు కలర్ ఎంత పైకి ఎత్తుతారో మీరే చూస్తారు. కళ్యాణ్ అన్న కెరీర్ బింబిసార ముందు, తర్వాత అనేలా ఉంటుంది'' అని తెలిపారు. 

నేను అదృష్టవంతుడిని: ఎన్టీఆర్ 
కళ్యాణ్ రామ్ అన్నయ్య వినమంటే ఐడియాగా 'బింబిసార' కథ విన్నానని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''కథ విన్న రోజు భయం మొదలైంది. దర్శకుడిగా వశిష్ఠ్ మల్లిడికి అనుభవం లేదు. కొత్త దర్శకుడు కనుక ఇంత పెద్ద సినిమాను హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుందా? లేదా? అని లోపల ఒక బెరుకు. కానీ, మీ అందరి కంటే నేను చాలా అదృష్టవంతుడిని. ఈ సినిమాను ముందే చూశా. ఎంత కసితో అయితే ఆ రోజు 'బింబిసార' కథ చెప్పాడో? అంతే కంటే గొప్పగా సినిమాను మలిచాడు. అది అంత సులభం కాదు. నాకు కథ తెలుసు, కథనం తెలుసు, ఏం జరగబోతోందో తెలుసు. ఇంత తెలిసిన నాకు సినిమా చూసేటప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ కి లోనయ్యాను. ప్రేక్షకులు కూడా ఆ ఎగ్జైట్మెంట్ కి గురి అవుతారు. చాలా చాలా అద్భుతంగా సినిమా తీశాడు. దర్శకుడిగా వశిష్ఠ్ మల్లిడి ఏం తీయగలడు? ఎటువంటి సినిమాలు తీయగలడు? అనేది చెప్పడానికి 'బింబిసార' ఒక టీజర్. అతని భవిష్యత్తుకు ఇదొక ట్రైలర్. హ్యాట్సాఫ్ వశిష్ఠ్'' అని అన్నారు.

Also Read : రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ: మాస్ మహారాజా రవితేజ సక్సెస్ అందుకున్నారా? లేదా?

భయం లేకుండా చేసిన ఎం.ఎం. కీరవాణి
'బింబిసార' చిత్ర బృందానికి భయం లేదని, ఎప్పుడు విడుదల అవుతుందనే ఆత్రం మాత్రమే ఉందని, దానికి కారణం ఎంఎం కీరవాణి అని ఎన్టీఆర్ అన్నారు. సినిమాకు కీరవాణి ఇచ్చిన నేపథ్య సంగీతం గానీ, ఆయన చేసిన కొత్త పాటలు గానీ అద్భుతం అన్నారు. 'బింబిసార' సినిమాకు కీరవాణి వెన్నుముక అని ఎన్టీఆర్ చెప్పారు. 

Also Read : పేపర్ రాకెట్ రివ్యూ: చావు బండి నుంచి బతుకు వరకూ - వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Published at : 30 Jul 2022 09:35 AM (IST) Tags: Bimbisara Pre Release Event NTR Speech NTR On Kalyan Ram NTR About Tollywood Crisis

సంబంధిత కథనాలు

SitaRamam: 'సీతారామం' కథ ఫస్ట్ విజయ్ దేవరకొండకి చెప్పా - హను రాఘవపూడి కామెంట్స్!

SitaRamam: 'సీతారామం' కథ ఫస్ట్ విజయ్ దేవరకొండకి చెప్పా - హను రాఘవపూడి కామెంట్స్!

Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!

Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!

Prabhas: 'సీతారామం' ఎఫెక్ట్ - ప్రభాస్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్!

Prabhas: 'సీతారామం' ఎఫెక్ట్ - ప్రభాస్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్!

Bimbisara: 'బింబిసార' రేర్ ఫీట్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!

Bimbisara: 'బింబిసార' రేర్ ఫీట్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!

Taapsee Pannu : నా శృంగార జీవితం ఆయనకు ఆసక్తికరంగా అనిపించలేదు ఏమో!? - తాప్సీ పన్ను

Taapsee Pannu : నా శృంగార జీవితం ఆయనకు ఆసక్తికరంగా అనిపించలేదు ఏమో!? - తాప్సీ పన్ను

టాప్ స్టోరీస్

CWG 2022: నిమిషాల వ్యవధిలో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం - గెలిచిందెవరంటే?

CWG 2022: నిమిషాల వ్యవధిలో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం - గెలిచిందెవరంటే?

TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా, ఎగ్జామ్ ఎప్పుడంటే?

TS Constable Exam : తెలంగాణ కానిస్టేబుల్ రాత పరీక్ష వాయిదా, ఎగ్జామ్ ఎప్పుడంటే?

Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!

Munugodu bypoll : మునుగోడు ఉపఎన్నిక డిసెంబర్ లోనా? ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఉత్కంఠ!

Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!

Bihar Politics: BJPకి రాంరాం- కాంగ్రెస్, RJDతో నితీశ్ కుమార్ చర్చలు!