News
News
X
IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI | Harare Sports Club, Harare - 20 Aug, 12:45 pm IST
(Match Yet To Begin)
ZIM
ZIM
VS
IND
IND
Asia Cup Qualifier, 2022 | Match 1 | Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman - 20 Aug, 07:30 pm IST
(Match Yet To Begin)
SIN
SIN
VS
HK
HK

Ramarao On Duty Review - రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ: మాస్ మహారాజా రవితేజ సక్సెస్ అందుకున్నారా? లేదా?

Ramarao On Duty Telugu Movie Review: మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా ఎలా ఉందంటే?

FOLLOW US: 

సినిమా రివ్యూ: రామారావు ఆన్ డ్యూటీ
రేటింగ్: 2/5
నటీనటులు: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ‌ కౌశిక్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, చైతన్యకృష్ణ, తనికెళ్ళ భరణి, రాహుల్ రామకృష్ణ తదితరులతో పాటు ప్రత్యేక గీతంలో అన్వేషి జైన్ 
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ 
సంగీతం: సామ్ సిఎస్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి 
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ
విడుదల తేదీ: జూలై 29, 2022

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఆల్ రౌండర్. కామెడీ ఎంత బాగా చేస్తారో? సీరియస్ రోల్స్‌లో అంతే ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ కనబస్తారు. 'కిక్' వంటి వినోదాత్మక చిత్రాలతో విజయాలు అందుకున్నారు. 'క్రాక్' లాంటి కమర్షియల్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌తో అలరించారు. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ' (Ramarao On Duty Movie). ఈ రోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? దీంతో రవితేజ విజయం అందుకున్నారా? లేదా?  

కథ (Ramarao On Duty Movie Story): రామారావు (రవితేజ) ఎంఆర్వో... డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ ఆఫీసర్. ప్రజలకు సేవ చేయడం తన బాధ్యతగా భావించే వ్యక్తి. న్యాయం చేయడం కోసం అవసరం అయితే నియమ నిబంధనలు పక్కన పెట్టి మరీ పని చేస్తాడు. అందుకని అతడు అంటే అవినీతి అధికారులు, రాజకీయ నాయకులకు పడదు. అందువల్ల, తరచూ బదిలీలు తప్పవు. చివరకు సొంతూరు వస్తాడు. అప్పుడు తన చిన్ననాటి ప్రేయసి మాలిని (రజిషా విజయన్) భర్త సురేంద్ర (చైతన్య కృష్ణ) కొన్నాళ్ళ నుంచి కనపడటం లేదని రామారావుకు తెలుస్తుంది. సురేంద్ర మిస్సింగ్ కేసు పోలీస్ (వేణు తొట్టెంపూడి) పట్టించుకోవడం లేదని నేరుగా రామారావు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఒక్క సురేంద్ర మాత్రమే కాదని... మొత్తం 20 మంది కనిపించకుండా పోయారని తెలుస్తుంది. వాళ్ళు కనిపించకుండా పోవడానికి, ఎర్ర చందనం అక్రమ రవాణాకు ముడి ఉందని అనుమానం వస్తుంది. కేసు దర్యాప్తు చేయకుండా ఎవరెవరో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. సొంత బాబాయ్ కొడుకు అనంత్ (రాహుల్ రామకృష్ణ) చంపాలని అనుకుంటాడు. సొంత బాబాయ్ కొడుకు రామారావు మీద ఎందుకు అటాక్ చేశాడు? మనుషుల మిస్సింగ్ వెనుక ఎవరున్నారు? చివరకు రామారావు ఈ కేసును పరిష్కరించడా? లేదా? అనేది మిగతా సినిమా.

విశ్లేషణ  (Ramarao On Duty Review) : కొన్ని కథలు పేపర్ మీద బావుంటాయి. ఆ కథను పేపర్ మీద నుంచి స్క్రీన్ మీదకు వచ్చే క్రమంలో కొన్ని తప్పులు జరుగుతుంటాయి. కథలో సోల్ మిస్ అవుతుంది. స్కీన్ మీద సీన్‌తో, ఎమోష‌న్‌తో క‌నెక్ట్ కావ‌డం క‌ష్టంగా ఉంటుంది. 'రామారావు ఆన్ డ్యూటీ' విషయంలో అదే జరిగింది. ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండవ రాసుకున్న క‌థలో కంటెంట్ ఉంది. కానీ, కంటెంట్ స్క్రీన్ మీదకు సరిగా రాలేదు. దీనికి ముఖ్య కారణం... డైరెక్షన్‌లో రియ‌లిస్టిక్ అప్రోచ్‌. ఇంకొక‌టి... లెంగ్త్‌. రెండున్న‌ర గంట‌ల సినిమా అయిన‌ప్ప‌టికీ... చాలా సేపు థియేట‌ర్ల‌లో ఉన్న ఫీలింగ్ క‌లుగుతుంది. ఇంటర్వెల్ ముందు అసలు  కథ మొదలవుతుంది. అప్పటి వరకు మధ్య మధ్యలో వచ్చే ఫ్యామిలీ సీన్స్ నిడివి పెంచాయి తప్ప పెద్దగా ఆకట్టుకోలేదు.

క‌నిపించ‌ని శ‌త్రువుతో క‌థానాయ‌కుడు యుద్ధం చేసేట‌ప్పుడు అత‌డి బాధ‌ను స్క్రీన్ ముందున్న ప్రేక్ష‌కుడు ఫీల్ కావాలి. 'రామారావు ఆన్ డ్యూటీ'లో అటువంటి ఫీల్ క‌లిగించే సీన్స్ లేవు. క‌థానాయకుడు ఎవ‌రితో యుద్ధం చేస్తున్నాడు? అనే ఉత్కంఠ ఆడియన్స్‌లో క‌ల‌గాలి. అదీ జ‌ర‌గ‌లేదు. ఎమోష‌న్ మిస్ కావ‌డంతో ఏ సీన్ కూడా క‌నెక్ట్ అయ్యేలా లేదు. అయితే... ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మండవ‌లో క‌మ‌ర్షియ‌ల్ సెన్స్ ఉంద‌ని ఫైట్స్ చూస్తే తెలుస్తుంది. 

సామ్ సీఎస్ అందించిన స్వరాలలో... సిద్ శ్రీరామ్ ఆలపించిన 'బుల్ బుల్ తరంగ్' వినసొంపుగా ఉంది. సొట్ట‌బుగ్గ‌ల... సాంగ్ కూడా! ఈ రెండు పాట‌ల‌నూ విదేశాల్లో చిత్రీక‌రించారు. అయితే... క‌థ‌కు, ఆ పాట‌ల‌కు సంబంధం ఉన్న‌ట్టు అనిపించ‌దు. సినిమా ఒక స్టైల్‌లో ఉంటే... ఆ రెండు పాట‌లు మ‌రో స్టైల్‌లో ఉన్నాయి. రెగ్యులర్ ఐటమ్ సాంగ్స్‌కు కాస్త భిన్నంగా మెలోడీ ట్యూన్‌తో 'నా పేరు సీసా' రూపొందించడంలో దర్శకుడు శరత్ ప్రత్యేకత చాటుకున్నారు. సామ్ సీఎస్ నేప‌థ్య సంగీతంలో మెరుపులు ఏవీ లేవు. థీమ్ మ్యూజిక్ కొంచెం డిఫ‌రెంట్‌గా ఉంది. కంటెంట్ లెంగ్త్ ఎక్కువ కావ‌డంతో మ్యూజిక్‌తో హోల్డ్ చేయ‌లేక‌పోయారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ బావుంది. సాహి సురేష్ సృష్టించిన 90వ దశకం నేపథ్యాన్ని చక్కగా తెరపైకి తీసుకొచ్చారు. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.  

నటీనటులు ఎలా చేశారు?: ర‌వితేజ త‌న స్ట‌యిల్ ప‌క్క‌న‌పెట్టి చేసిన చిత్ర‌మిది. క‌మ‌ర్షియ‌ల్ అంశాల కంటే క‌థ‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌, ఫైట్ లేకున్నా... రెగ్యుల‌ర్ హీరోయిజం చూపించే అంశాల కంటే డైలాగ్స్ చెప్పే సీన్స్ ఎక్కువ ఉన్నా... క‌థ‌పై, ద‌ర్శ‌కుడిపై న‌మ్మ‌కంతో చేశార‌ని సినిమా చూస్తుంటే అర్థం అవుతుంది. అయితే... కంటెంట్ వీక్ కావ‌డంతో ఆయ‌న చేయ‌గ‌లిగింది ఏమీ లేకుండా పోయింది. త‌న క్యారెక్ట‌ర్ వ‌ర‌కూ క‌రెక్ట్‌గా చేసినా ఆడియ‌న్స్‌కు ఆయ‌న ప‌ర్ఫార్మెన్స్ క‌నెక్ట్ కావ‌డం క‌ష్ట‌మే.

రజిషా విజయన్ మంచి నటి. మాలిని పాత్రలో చక్కగా నటించారు. అయితే, ఆమె పాత్ర నిడివి తక్కువే. దివ్యాంశ‌ కౌశిక్ ఓకే. హీరో భార్య పాత్రకు సూట్ అయ్యారు. కానీ, ఆమె నటన ఆకట్టుకోవడం కష్టం. వేణు తొట్టెంపూడి చాలా ఏళ్ళ విరామం తర్వాత స్క్రీన్ మీద కనిపించారు. 'సామి...' అంటూ డిఫరెంట్ స్టైల్‌లో డైలాగులు చెప్పారు. ఆయ‌న క్యారెక్ట‌రైజేష‌న్ వీక్‌గా ఉంది. వేణు బ‌దులు ఆ పాత్ర‌ను ఎవ‌రు చేసినా పెద్ద వ్య‌త్యాసం ఉండ‌దు. నాజర్, రాహుల్ రామకృష్ణ, నరేష్, పవిత్రా లోకేష్ తదితర సీజనల్ ఆర్టిస్టులు పాత్రల పరిధి మేరకు చేశారు. 'నా పేరు సీసా...' పాటలో అన్వేషి జైన్ డ్యాన్స్, గ్లామర్ షో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేస్తాయి. 

Also Read : విక్రాంత్ రోణ రివ్యూ: కిచ్చా సుదీప్ సినిమా ఎలా ఉందంటే?
 
చివరగా చెప్పేది ఏంటంటే?: రెండు మూడు యాక్ష‌న్ సీన్స్‌, సాంగ్స్ 'రామారావు ఆన్ డ్యూటీ' హిట్ చేయలేవు. ర‌వితేజ కోసం థియేట‌ర్ల‌కు వెళ్ళిన ప్రేక్ష‌కులు మాస్ మ‌హారాజా శైలి అంశాలు లేక‌పోవ‌డంతో నిరాశ చెందుతారు. క‌థా నేప‌థ్యం బావున్న‌ప్ప‌టికీ నిదానంగా సాగిన క‌థ‌నం, ఏమాత్రం ఉత్కంఠ‌కు గురి చేయని, సాగ‌దీసిన స‌న్నివేశాలు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌లో ప‌క్క చూపులు చూసేలా చేస్తాయి. ర‌వితేజ‌, శ‌ర‌త్ మండ‌వ విజయం కోసం మరో ప్ర‌య‌త్నం చేయక తప్పదు.

Also Read : ది లెజెండ్ రివ్యూ: లెజెండ్ శరవణన్ ఆకట్టుకున్నాడా?

Published at : 29 Jul 2022 12:34 PM (IST) Tags: ABPDesamReview Ramarao On Duty Review In Telugu Ramarao On Duty Telugu Review Ravi Teja Ramarao On Duty Review Ramarao On Duty Rating

సంబంధిత కథనాలు

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు 

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!

Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!

SSMB28Update: 'పోకిరి' రిలీజ్ డేట్‌కి మహేష్, త్రివిక్రమ్ సినిమా - సమ్మర్‌లో మాసివ్ అండ్ ఎపిక్ బ్లాస్ట్!

SSMB28Update: 'పోకిరి' రిలీజ్ డేట్‌కి మహేష్, త్రివిక్రమ్ సినిమా - సమ్మర్‌లో మాసివ్ అండ్ ఎపిక్ బ్లాస్ట్!

Puri Jagannadh: క్రేజీ డీల్ వదులుకున్న 'లైగర్' టీమ్ - ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరి జగన్నాధ్!

Puri Jagannadh: క్రేజీ డీల్ వదులుకున్న 'లైగర్' టీమ్ - ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరి జగన్నాధ్!

టాప్ స్టోరీస్

IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!

IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!

Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?

Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి  దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?

Rajinikanth as Governor: రజనీకాంత్‌కు గవర్నర్ పోస్ట్ ! బీజేపీ ఆఫర్ ఇచ్చిందా ? తలైవా అంగీకరించారా ?

Rajinikanth as Governor:   రజనీకాంత్‌కు గవర్నర్ పోస్ట్ !  బీజేపీ ఆఫర్ ఇచ్చిందా ? తలైవా అంగీకరించారా ?

Freebies Politics : చట్టాలు చేస్తే , తీర్పులు ఇస్తే ఉచిత పథకాలు ఆగుతాయా ? మార్పు ఎక్కడ రావాలి ?

Freebies Politics : చట్టాలు చేస్తే , తీర్పులు ఇస్తే ఉచిత పథకాలు ఆగుతాయా ? మార్పు ఎక్కడ రావాలి ?