Ghani Anthem Promo: 'గని' యాంథెమ్.. 'They Call Him Ghani.. కనివిని ఎరుగని'..
వరుణ్ తేజ్ నటిస్తోన్న 'గని' సినిమా ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా ఈ సినిమాలో 'గని' యాంథెమ్ సాంగ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
మెగాహీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'గని'. బాక్సింగ్ క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు.
Also Read: 'ఆర్ఆర్ఆర్' థియేట్రికల్ బిజినెస్.. అంత తక్కువకి అమ్మేస్తున్నారా..?
ఈ క్రమంలో ఇటీవల 'గని ఫస్ట్ పంచ్'ను విడుదల చేశారు. బాక్సింగ్ రింగ్ లో ఉన్న వరుణ్ తేజ్ లుక్ ను రివీల్ చేస్తూ చిన్న వీడియోను వదలగా.. అది ట్రెండింగ్ అయింది. ఇప్పుడు 'గని' యాంథెమ్ ను విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. 'They Call Him Ghani.. కనివిని ఎరుగని' అంటూ సాగే ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. రేపు ఉదయం 11:08 గంటలకు పూర్తి పాటను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. దీనికోసం ఆయన స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు.
అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ-సిద్దు ముద్ద సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ముందుగా జూలై నెలాఖరున విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Here's the promo of #GhaniAnthem 🥊
— Geetha Arts (@GeethaArts) October 26, 2021
▶ https://t.co/0K8ZD9Y1qm
The Inspiring first single from #Ghani releasing tomorrow @ 11:08 AM! 🔥@IAmVarunTej @nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @Naveenc212 @MusicThaman @george_dop @abburiravi @adityamusic pic.twitter.com/4I6joQi0Rp
Also Read: రామ్ చరణ్ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్..
Also Read: వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని... తీస్తే ఎవరికీ కాని జీవుడ్ని అంటున్న చిరంజీవి!
Also Read: సర్కారు వారి పాట... ఇంతే ఒక వెయ్యి... లీకయ్యిందిగా!
Also Read: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి