RC15 : రామ్ చరణ్ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్..
రామ్ చరణ్ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్ ని తీసుకోవాలనుకుంటున్నారట. ఆయన ఎవరంటే..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్' తరువాత రామ్ చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి 'విశ్వంభర' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్ సురేష్ గోపిని తీసుకోవాలనుకుంటున్నారట. ఈ టాలెంటెడ్ యాక్టర్ తో దర్శకుడు శంకర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో సురేష్ గోపి.. శంకర్ డైరెక్ట్ చేసిన 'ఐ' సినిమాలో విలన్ గా నటించారు.
Also Read: వేషం కడితే అన్ని మతాల దేవుడ్ని... తీస్తే ఎవరికీ కాని జీవుడ్ని అంటున్న చిరంజీవి!
ఆ బంధంతోనే మరోసారి శంకర్ దర్శకత్వంలో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట సురేష్ గోపి. సినిమా స్క్రిప్ట్, తన క్యారెక్టరైజేషన్ కూడా డిఫరెంట్ గా ఉండడంతో సురేష్ గోపి ఒప్పుకున్నట్లు సమాచారం. బాలీవుడ్ నటి ఈషా గుప్తా కూడా ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనుందని టాక్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, అంజలి, జయరాం లాంటి నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూణేలో మొదలైంది. ఈ షెడ్యూల్ లో హీరో-హీరోయిన్ పై ఓ డ్యూయెట్ ని చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని విధంగా ఈ పాటను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారట. శంకర్ సినిమాల్లో పాటలను ఎంత లావిష్ గా రూపొందిస్తారో తెలిసిందే. అలానే ఈ సినిమాలో డ్యూయెట్ కోసం భారీగా ఖర్చు చేయబోతున్నారట.
ఈ సినిమా నిర్మాణం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు నిర్మాత దిల్ రాజు. తన బ్యానర్ లో వస్తోన్న 50వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకి తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యహరించనున్నారు.
Also Read: సర్కారు వారి పాట... ఇంతే ఒక వెయ్యి... లీకయ్యిందిగా!
Also Read: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి
Also Read: బస్ డ్రైవర్ నుండి బాలచందర్ వరకూ... తమిళ ప్రజలనూ... రజనీకాంత్ ఎవ్వర్నీ మరువలేదు!
Also Read: రొమాంటిక్ vs వరుడు కావలెను... అండ్ మోర్!
Also Read: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి