అన్వేషించండి
Advertisement
Pushpa 3rd Song: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి
'పుష్ప'లో 'దాక్కో దాక్కో మేక...', 'శ్రీవల్లి' పాటలు ఛార్ట్ బస్టర్లుగా నిలిచాయి. లేటెస్టుగా మూడో పాట ప్రోమో విడుదలైంది. ఇదీ అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్... ఈ ముగ్గురి కాంబినేషన్ లో మ్యూజిక్ ఎప్పుడూ హిట్టే! 'ఆర్య', 'ఆర్య 2' సాంగ్స్ ఇప్పటికీ ఆడియన్స్ ప్లేలిస్టులో వినిపిస్తాయి. అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ 'పుష్ప' మూవీ. ఆల్రెడీ ఈ సినిమాలో రెండు సాంగ్స్తో రిలీజ్ అయ్యాయి. రెండూ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. లేటెస్టుగా మూడో సాంగ్ రిలీజ్ చేశారు. ఇదీ అల్లు అర్జున్ తో పాటు ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంది.
'నువ్వు అమ్మి అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి' అంటూ సాగే థర్డ్ సాంగ్ ప్రోమోను ఈ రోజు రిలీజ్ చేశారు. అది చూస్తుంటే హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సాంగ్ అని అర్థం అవుతోంది. ఈ నెల 28న ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. ఈ పాటను చంద్రబోస్ రాశారు.
అల్లు అర్జున్ తన ప్రతి సినిమాలోనూ సాంగ్స్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటారు. సుకుమార్ కూడా అంతే! వీళ్లిద్దరూ అంటే దేవి శ్రీ ప్రసాద్ మరింత కేర్ తీసుకుంటాడు. యాక్చువల్లీ... ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. 'ఆర్య', 'ఆర్య 2'లో ఐటమ్ సాంగ్స్ సూపర్ డూపర్ సక్సెస్ సాధించాయి. 'ఆర్య 2'లో 'రింగ రింగ'ను తన 'రెడీ' సినిమా కోసం రీమిక్స్ చేయించుకున్నాడు సల్మాన్ ఖాన్. 'ఆర్య'లోని 'అ అంటే అమలాపురం' కూడా హిందీకి వెళ్లింది. కానీ, ఈసారి 'పుష్ప' హిందీలో రీమేక్ అవుతుండటంతో ఇందులో ఐటమ్ సాంగ్ ను హిందీలో రీమిక్స్ చేసే ఛాన్స్ లేదు.
అల్లు అర్జున్ సరసన రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్న 'పుష్ప' ఫస్ట్ పార్ట్ ఈ డిసెంబర్ లో రిలీజ్ కానుంది. తొలుత ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే, అంతకంటే ముందు రావడాలని డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 17న రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో బన్నీ బాలీవుడ్ మార్కెట్ మీద కన్నేశాడు.
అల్లు అర్జున్ సరసన రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్న 'పుష్ప' ఫస్ట్ పార్ట్ ఈ డిసెంబర్ లో రిలీజ్ కానుంది. తొలుత ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే, అంతకంటే ముందు రావడాలని డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 17న రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో బన్నీ బాలీవుడ్ మార్కెట్ మీద కన్నేశాడు.
Also Read: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?
Also Read: 'రాధే శ్యామ్' టీజర్‌లో అంతులేని కథ... మీరు గమనించారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion