![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mahesh Babu: సర్కారు వారి పాట... ఇంతే ఒక వెయ్యి... లీకయ్యిందిగా!
షూటింగ్ స్పాట్ నుండి హీరో లుక్స్, సాంగ్స్ లీక్ అవ్వకుండా చూడటం దర్శక నిర్మాతలకు సాధ్యం కావడం లేదు. ఏదో విధంగా, ఎవరో ఒకరు లీక్ చేస్తున్నారు. లేటెస్టుగా 'సర్కారు వారి పాట'లో సాంగ్ బిట్ లీక్ అయ్యింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా గత కొన్ని రోజులుగా స్పెయిన్‌లో జరుగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ అక్కడికి వెళ్లారు. షూటింగ్ స్పాట్‌లో మహేష్ బాబుతో ఫొటోలు దిగారు. సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, ఇప్పుడు ఏకంగా సాంగ్ షూట్ చేస్తున్న సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో జస్ట్ పది సెకన్లు మాత్రమే ఉన్నప్పటికీ... అందులో మహేష్ లుక్ చూసి అభిమానులు ఫుల్ ఖుషి ఖుషిగా ఉన్నారు. బాబు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. లీక్డ్ వీడియో చివర్లో 'ఇంతే ఒక వెయ్యి...' అని క్లియర్ గా వినబడుతోంది.
Also Read: రౌడీ అండ్ పూరి... ప్లానింగ్ ఫర్ సమ్మర్!
స్పెయిన్‌లో మహేష్ బాబు, ఫారిన్ డాన్సర్ల మీద 'ఇంతే ఒక వెయ్యి' పాటను చిత్రీకరిస్తున్నారు. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాటను తమన్ పాడినట్టు అర్థమవుతోంది. షూటింగ్స్ కోసం మ్యూజిక్ డైరెక్టర్స్ రఫ్ ట్రాక్స్ పాడటం కామన్. సినిమాలో కూడా ఆయన వాయిస్ ఉంటుందో? మరొకరితో పాడిస్తారో? చూడాలి. ఈ రోజు (మంగళవారం)తో స్పెయిన్ షెడ్యూల్ కంప్లీట్ అవుతుందని సమాచారం.
Also Read: రెండు రోజుల ముందే ప్రీమియర్లు.. పూరికి ఇంత ధైర్యమేంటో..?
మహేష్ బాబు, తమన్ కాంబినేషన్‌లో 'దూకుడు', 'బిజినెస్ మేన్' వంటి మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. 'ఆగడు' సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించలేదు. కానీ, అందులో పాటలు కొన్ని హిట్టయ్యాయి. అప్పటితో కంపేర్ చేస్తే... ఇప్పుడు తమన్ గ్రాఫ్ పెరిగింది. మ్యూజిక్ పరంగా డిఫరెన్స్ చూపిస్తున్నాడు. లేటెస్టుగా లీకైన క్లిప్ చూస్తుంటే... మహేష్, తమన్ కాంబినేషన్‌లో మరో మ్యూజికల్ హిట్ వచ్చేలా ఉంది.
Also Read: నన్నెవ్వరూ ఆపలేరంటున్న సమంత!
కీర్తీ సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. 'గీత గోవిందం' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్పెయిన్ షెడ్యూల్ కు నిర్మాతలలో ఒకరైన 'మైత్రి' రవిశంకర్ కూడా వెళ్లారు.
Chart buster loading 💥 #SarkaruVaariPaata pic.twitter.com/eQCnu2mcez
— ʟᴏʜɪᴛʜ (@IAmLohith_) October 26, 2021
Also Read: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి
Also Read: బస్ డ్రైవర్ నుండి బాలచందర్ వరకూ... తమిళ ప్రజలనూ... రజనీకాంత్ ఎవ్వర్నీ మరువలేదు!
Also Read: రొమాంటిక్ vs వరుడు కావలెను... అండ్ మోర్!
Also Read: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)