Vijay Deverakonda's Liger: రౌడీ అండ్ పూరి... ప్లానింగ్ ఫర్ సమ్మర్!
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమా 'లైగర్'. దీనికి వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సినిమాకు పూజ చేసిన రోజునే... ఫస్ట్ కాపీ ఎప్పటికి రెడీ అవుతుందో పక్కాగా చెప్పగల టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్. సినిమా ఓపెనింగ్ డే అప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాడు. అటువంటి పూరి స్పీడుకు కొవిడ్-19 కంప్లీట్ గా బ్రేకులు వేసింది. అనుకున్నట్టుగా సినిమా షూటింగ్ జరగలేదు. అందుకని, సినిమా విడుదల లేట్ అయ్యింది. కరోనా కాలంలో అన్ని సినిమాలు వాయిదా పడినట్టు ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ షూటింగ్ స్టార్ట్ కావడంతో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు పూరి.
Also Read: నన్నెవ్వరూ ఆపలేరంటున్న సమంత!
వచ్చే ఏడాది వేసవికి 'లైగర్'ను విడుదల చేయాలని పూరి జగన్నాథ్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలో డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేయాలని చూస్తున్నారు. రీసెంట్ గా రోడ్డు మీద ఓ అభిమానితో ముచ్చటించిన పూరి జగన్నాథ్ వచ్చే ఏడాది వేసవిలో 'లైగర్' విడుదల అవుతుందని, చూడమని చెప్పారు. సో... నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో 'లైగర్' రిలీజ్ పక్కా అన్నమాట.
రీసెంట్ గా ముంబైలో 'లైగర్' లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.
Also Read: బస్ డ్రైవర్ నుండి బాలచందర్ వరకూ... తమిళ ప్రజలనూ... రజనీకాంత్ ఎవ్వర్నీ మరువలేదు!
పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీ ఈ వారం విడుదలకు సిద్ధమైంది. ఆ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కి అటెండ్ అయిన విజయ్ దేవరకొండ, పూరి... ఆ తర్వాత ముంబై వెళ్లారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ షెడ్యూల్ లో ఆమె కూడా జాయిన్ కావాల్సి ఉంది. అయితే, షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ డ్రగ్ కేసులో పోలీసులు విచారణ రావాల్సిందిగా ఆమెకు నోటీసులు ఇచ్చారు. దాంతో షెడ్యూల్ మధ్యలో కొన్ని రోజులు ఆమెకు బ్రేక్ ఇవ్వనున్నారని సమాచారం.
Also Read: పవన్ సినిమాకి అమెజాన్ క్రేజీ ఆఫర్.. మరి ఓటీటీలో రిలీజ్ చేస్తారా..?
Also Read: ప్రభాస్-పూజాహెగ్డేల మధ్య గొడవ.. నిజమేనట..
Also Read: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి
Also Read: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?
Also Read: ఆ విషయంలో బాధగా ఉందంటున్న రజనీకాంత్
Also Read: సంక్రాంతి రేస్ నుంచి మహేష్, పవన్ ఔట్.. కొత్త రిలీజ్ డేట్లు ఇవేనా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి