Bheemla Nayak: పవన్ సినిమాకి అమెజాన్ క్రేజీ ఆఫర్.. మరి ఓటీటీలో రిలీజ్ చేస్తారా..?
పవన్ కళ్యాణ్ నటిస్తోన్న 'భీమ్లా నాయక్' సినిమాపై అమెజాన్ కన్ను పడింది. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయమని భారీగా ఆఫర్ కూడా ఇచ్చిందట.
'వకీల్ సాబ్' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు 'భీమ్లా నాయక్' సినిమాలో నటిస్తున్నారు. మలయాళంలో తెరకెక్కిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సినిమాలో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ డైలాగ్స్-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చకచకా కొనసాగుతోంది.
Also Read: బిగ్ బాస్ ఎమోషనల్ గేమ్.. తట్టుకోలేక ఏడ్చేసిన హౌస్ మేట్స్..
నిజానికి ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' సినిమా కూడా జనవరిలో వస్తుండడంతో పవన్ సినిమాను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మార్చి నెలాఖరున సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై అమెజాన్ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. సినిమాను థియేటర్లో విడుదల చేయకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే మంచి రేటు ఇస్తామని నిర్మాతలకు భారీ ఆఫర్ చేస్తున్నారట.
దాదాపు రూ.140 కోట్ల మేరకు ఈ ఆఫర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రేంజ్ లో ఇప్పటివరకు ఏ సౌత్ ఇండియన్ సినిమా అమ్ముడవ్వలేదు. కానీ పవన్ సినిమాకి మాత్రం ఇంత మొత్తాన్ని ఆఫర్ చేయడానికి రెడీ అయిపోయింది అమెజాన్ సంస్థ. డిజిటల్ హక్కులు కాకుండా.. నిర్మాతల దగ్గర ఇంకా శాటిలైట్, హిందీ రైట్స్, ఆడియో రైట్స్ ఉండనే ఉంటాయి. అయితే ఈ ఆఫర్ ను నిర్మాతలు తీసుకునే అవకాశం లేదనిపిస్తుంది.
పవన్ కళ్యాణ్ కూడా రిలీజ్ విషయంలో ఎలాంటి రూల్స్ పెట్టలేదట. నిర్మాతలకు ఎలా నచ్చితే అలానే రిలీజ్ చేసుకోమని చెప్పారట. ఓటీటీ ఆఫర్ టెంప్టింగా ఉన్నప్పటికీ నిర్మాతలు మాత్రం ఓటీటీకి సినిమాను అమ్మలేరు. మొన్నామధ్య 'భీమ్లా నాయక్'ను ఓటీటీలో రిలీజ్ చేస్తారని వార్తలొచ్చినప్పుడు నిర్మాణ సంస్థ ఖండించింది. 'భీమ్లా నాయక్' సినిమా థియేటర్లోనే విడుదలవుతుందని స్పష్టం చేసింది. కాబట్టి ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చే ఛాన్సే లేదనిపిస్తుంది. పైగా ఫ్యాన్స్ కూడా ఊరుకోరు.
Also Read: ప్రభాస్-పూజాహెగ్డేల మధ్య గొడవ.. నిజమేనట..
Also Read: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి
Also Read: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?
Also Read: ఆ విషయంలో బాధగా ఉందంటున్న రజనీకాంత్
Also Read: సంక్రాంతి రేస్ నుంచి మహేష్, పవన్ ఔట్.. కొత్త రిలీజ్ డేట్లు ఇవేనా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి