Samantha: నన్నెవ్వరూ ఆపలేరంటున్న సమంత!
సమంతలో ఆధ్యాత్మిక, తాత్విక చింతన ఈమధ్య ఎక్కువైంది. విడాకులకు కొన్ని రోజుల ముందు #MyMomSaid (మా అమ్మ చెప్పింది) అంటూ సోషల్ మీడియాలో కోట్స్ పోస్ట్ చేశారు. లేటెస్టుగా మరొకటి పోస్ట్ చేశారు సమంత.
సమంతలో ఫైటింగ్ స్పిరిట్ కష్టాల్లో ఉన్న వ్యక్తులు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అక్కినేని నాగచైతన్యతో వైవాహిక బంధంతో వేరు పడిన తర్వాత ఆమె ఎన్నో ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్నారు. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందని అన్నట్టు మౌనంగా ఉన్నారు. తనను అవకాశవాది, ఆశావాది అని వస్తున్న విమర్శలకు వివరణ ఇచ్చి తన పనిలో నిమగ్నమయ్యారు సమంత.
Also Read: సామి... అమ్మి అంటాంటే పెళ్లాన్నయిపోయినట్టుందిరా సామి
శిల్పారెడ్డితో పాటు కొంతమంది స్నేహితులతో కలిసి చార్ ధామ్ యాత్రకు వెళ్లిన సమంత... ఆ యాత్ర గురించి తప్ప మధ్యలో ఎటువంటి పోస్టులు చేయలేదు. యాత్ర ముగియడంతో మళ్లీ నార్మల్ లైఫ్ కి వచ్చేశారు. పోస్టులు మొదలుపెట్టారు. "నేను గాలి దిశను మార్చలేను. కానీ, ఎప్పుడూ నా గమ్యాన్ని చేరుకోవడానికి దాన్ని అడ్జస్ట్ చేయగలను" అని జిమ్మీ డీన్ వ్యాఖ్యను సమంత ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. #MyMonSaid హ్యాష్ ట్యాగ్ జోడించారు. ఎదురుగాలి వీచినా... తన గమ్యం చేరుకుంటానని, తనను ఎవ్వరూ ఆపలేరనే అర్థం అందులో కనిపిస్తోంది. చార్ ధామ్ యాత్ర నుంచి హైదరాబాద్ వచ్చిన సమంత, సినిమా పనులు త్వరలో ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. 'శాకుంతలం' షూటింగ్ కంప్లీట్ కాగా... రెండు కొత్త సినిమాలు షూటింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
Also Read: ఆ విషయంలో బాధగా ఉందంటున్న రజనీకాంత్
అన్నట్టు... అక్కినేని నాగచైతన్య, సమంత మధ్య ఏం జరిగింది? వాళ్లిద్దరూ ఎందుకు విడిపోయారు? అనేది సామాన్య ప్రేక్షకులు ఎవరికీ తెలియదు. ఆ మాటకొస్తే... సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులకు కూడా తెలియదు. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలతో పాటు నాగచైతన్య, సమంత సన్నిహితులకు తప్ప! విడాకులకు కారణం ఇదేనంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు చెప్పేవన్నీ ఊహాగానాలే. అందుకని, అసలు కారణం ఏంటో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, వాళ్ల ఆసక్తి కొన్నాళ్లు అలాగే ఉండాలేమో! ఎందుకంటే... సమంతకు విడాకులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇష్టం లేదు కనుక!
Also Read: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?
విడాకులు తీసుకోవడానికి గల కారణాల గురించి సమంత ఎక్కడా.... ఎప్పుడూ ప్రస్తావించలేదు. కానీ, పరోక్షంగా విడాకుల గురించి ప్రశ్నించిన వారిపై అసంతృప్తితో ఉన్న విషయాన్ని బయట పెడుతున్నారు. కొందరు హెడ్ లైన్స్ కోసం తన గురించి ఏదో ఆలోచిస్తున్నట్లు, తన పరిస్థితి గురించి పట్టించుకుంటున్నట్టు ప్రశ్నలు అడుగుతారని... అది చాలా దారుణమని సమంత వ్యాఖ్యానించారు. సో... తన దగ్గర విడాకులు తీసుకున్న అని పరోక్షంగా సమంత చెప్పినట్టు అయ్యింది.
Also Read: సంక్రాంతి రేస్ నుంచి మహేష్, పవన్ ఔట్.. కొత్త రిలీజ్ డేట్లు ఇవేనా..?
Also Read: 'రాధే శ్యామ్' టీజర్‌లో అంతులేని కథ... మీరు గమనించారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి