అన్వేషించండి

Varun Tej Lavanya Tripathi: హనీమూన్‌కు వెళ్లిన స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య

Varun Tej Lavanya Tripathi honeymoon: కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి హనీమూన్ టూర్ వేశారు. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలుసా?

Varun Tej and Lavanya Tripathi, the newly married celebrity couple, are off on their honeymoon tour : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఆయన సతీమణి & హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎక్కడ ఉన్నారో తెలుసా? హనీమూన్ టూర్‌లో! అవును... ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇండియాలో లేరు. విదేశాల్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్లారు? ఏమిటి? వంటి వివరాల్లోకి వెళితే... 

ఫిన్ ల్యాండ్ వెళ్లిన స్టార్ కపుల్!
Varun Tej and Lavanya Tripathi honeymoon in Finland: కొత్తగా పెళ్ళైన స్టార్ కపుల్ వరుణ్ & లావణ్య ప్రజెంట్ ఫిన్ ల్యాండ్ లో ఉన్నారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రయాణం అయినట్లు తెలుస్తోంది. ఫిన్ ల్యాండ్ నుంచి మరొక ప్రదేశానికి కూడా వెళతారని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందింది. ఓ వారం లేదా 10 రోజుల పాటు టూర్ ఉండొచ్చని ఖబర్. 

ఫిన్ ల్యాండ్ అంటే మెగా ఫ్యామిలీకి ఇష్టం అనుకుంట! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కొన్నాళ్ల క్రితం ఆ మంచు ప్రదేశానికి వెళ్లారు. ఇప్పుడు వరుణ్ తేజ్, లావణ్య దంపతులు సైతం అక్కడికి వెళ్లారు.

Also Readక్రష్మిక క్లబ్‌లో ఆలియా భట్ - భర్తను వదిలేసింది ఏంటి?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

పెళ్లి విదేశాల్లో జరిగినప్పటికీ...
ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఏడు అడుగులు వేశారు. పెళ్లి విదేశాల్లో జరిగినప్పటికీ... త్వరగా ఇండియా వచ్చేశారు. పెళ్లి జరిగిన మూడు రోజులకు కొత్త జంట హైదరాబాద్ సిటీలో అడుగు పెట్టింది. ఇక్కడ రిసెప్షన్ జరిగింది. ఆ తర్వాత డెహ్రాడూన్‌లోని అత్తారింటికి వరుణ్ తేజ్ వెళ్లారు. లావణ్య త్రిపాఠి బంధు మిత్రుల కోసం అక్కడ మరో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అన్ని పనులు పూర్తి కావడంతో కాస్త వెసులుబాటు చేసుకుని ఇప్పుడు హనీమూన్ టూర్ వేశారు. 

'ఆపరేషన్ వేలంటైన్' వాయిదా పడటం కూడా...
Varun Tej Upcoming movie 2024 - Operation valentine: వరుణ్ తేజ్ హనీమూన్ టూర్ వేయడం వెనుక 'ఆపరేషన్ వేలంటైన్' వాయిదా కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమాను తొలుత డిసెంబర్ 8న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... వచ్చే ఏడాదికి ఆ సినిమా వాయిదా పడటంతో వరుణ్ తేజ్ (Varun Tej)కు కొంత ఫ్రీ టైమ్ దొరికింది. లేదంటే ఆయన 'ఆపరేషన్ వేలంటైన్' ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉండేవారు. 

Also Readసిల్క్ స్మిత బయోపిక్ - టైటిల్ రోల్ చేస్తున్న హాట్ లేడీ ఎవరో తెలుసా?

హనీమూన్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో హీరోగా నటించనున్న 'మట్కా' చిత్రీకరణలో వరుణ్ తేజ్ జాయిన్ అవుతారు. లావణ్యా త్రిపాఠి యాక్టింగ్ కెరీర్ విషయానికి వస్తే... డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ కోసం రూపొందుతున్న ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. అందులో ఆమెకు జోడీగా 'బిగ్ బాస్' విన్నర్ అభిజీత్ నటిస్తున్నారు. అది కాకుండా మరో సినిమాకు ఆమె సంతకం చేసినట్లు తెలిసింది.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today August 11th: ‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీకి నిజం చెప్పిన రాజు – శశికి గిఫ్ట్‌ ఇచ్చిన ఐషు  
‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీకి నిజం చెప్పిన రాజు – శశికి గిఫ్ట్‌ ఇచ్చిన ఐషు  
Jagadhatri Serial Today August 10th: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Embed widget