Alia Bhatt Rashmika: క్రష్మిక క్లబ్‌లో ఆలియా భట్ - భర్తను వదిలేసింది ఏంటి?
Alia Bhatt reviews Animal Movie: రణబీర్ కపూర్ నటించిన 'యానిమల్' సినిమాపై ఆయన భార్య, ప్రముఖ హీరోయిన్ ఆలియా భట్ ప్రశంసల వర్షం కురిపించింది.
Alia Bhatt Joins Crushmika Club: రష్మికా మందన్నాను అభిమానులు, ప్రేక్షకులు ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసు కదా... 'క్రష్మిక'! ఇప్పుడు ఈ క్రష్మిక క్లబ్బులో స్టార్ హీరోయిన్ ఆలియా భట్ జాయిన్ అయ్యారు. రష్మిక నటన తనకు ఎంత గానో నచ్చిందని ప్రశంసల జల్లు కురిపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
క్రష్మిక క్లబ్బులో జాయిన్ అవుతున్నా!
రష్మికా మందన్నా నటించిన 'యానిమల్' శుక్రవారం విడుదలైంది. విమర్శకుల నుంచి సినిమాకు మిశ్రమ స్పందన లభించింది కానీ ప్రేక్షకుల నుంచి మాత్రం ఫుల్ మార్క్స్ పడ్డాయి. అందుకు ఫస్ట్ డే కలెక్షన్స్ ఉదాహరణ. మొదటి రోజు ఈ సినిమాకు 116 కోట్ల రూపాయల గ్రాస్ లభించింది. హీరో హీరోయిన్లు రణబీర్ కపూర్, రష్మిక నటనతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వానికి ప్రత్యేక ప్రశంసలు లభిస్తున్నాయి.
Alia Bhatt Post On Animal Movie: 'యానిమల్' గురించి ఆలియా భట్ కూడా ఓ పోస్ట్ చేశారు. అందులో సందీప్ రెడ్డి వంగా తరహాలో మరొకరు ఉండరని ఆమె ప్రశంసించారు. 'యానిమల్' తనకు షాక్ ఇవ్వడంతో పాటు సర్‌ప్రైజ్ చేసిందని ఆమె పేర్కొన్నారు. గూస్ బంప్స్ వచ్చాయని చెప్పారు.
'యానిమల్'లో రష్మిక చాలా అందంగా కనిపించారని, నిజాయతీగా నటించారని ఆలియా భట్ పేర్కొన్నారు. వ్యక్తితగంగా రష్మికతో మాట్లాడానని, ఓ సన్నివేశంలో ఆమె అద్భుతంగా నటించిందని, అది స్ఫూర్తివంతంగా ఉందని ఆమె తెలిపారు. క్రష్మిక క్లబ్బుల్లో జాయిన్ అవుతున్నట్లు చెప్పారు. ఆలియాకు రష్మిక లవ్యూ చెప్పారు.
Also Read: సిల్క్ స్మిత బయోపిక్ - టైటిల్ రోల్ చేస్తున్న హాట్ లేడీ ఎవరో తెలుసా?
భర్త రణబీర్ కపూర్ పేరు ఎక్కడ?
బాబీ డియోల్, అనిల్ కపూర్, తృప్తి దిమ్రి, శక్తి కపూర్... నటీనటుల పేర్లను తన పోస్టులో ఆలియా భట్ ప్రస్తావించారు. చిత్ర బృందం అందరికీ కంగ్రాట్స్ చెప్పారు. అయితే... ఆమె పోస్టులో 'యానిమల్' సినిమాలో హీరో, భర్త రణబీర్ కపూర్ పేరు లేదు. సొంత మనిషి గురించి స్పెషల్ గా చెప్పడం ఎందుకు? అనుకున్నారేమో!? ఇంట్లో ఆయనతో సినిమా గురించి చాలా సేపు డిస్కస్ చేసి ఉంటారు. బయట భర్తను పొగిడితే దిష్టి తగులుతుందని చెప్పలేదేమో!? అత్తగారు నీతూ సింగ్, భర్త రణబీర్ కపూర్ తో 'యానిమల్' ప్రీమియర్ షోకు ఆలియా భట్ హాజరయ్యారు.
Also Read: ఎక్స్‌ట్రా మాస్ - శ్రీ లీలతో డ్యాన్స్ ఇరగదీసిన నితిన్!
అమ్మాయి పుట్టిన తర్వాత రెండో విజయం!
రణబీర్ కపూర్, ఆలియా భట్ ఏప్రిల్ 14, 2022లో పెళ్లి చేసుకున్నారు. ఆ ఏడాది నవంబర్ 6న వాళ్లకు అమ్మాయి రహా జన్మించింది. బిడ్డ గర్భంలో ఉండగా... రణబీర్, ఆలియా జంటగా నటించిన 'బ్రహ్మాస్త్ర' విడుదలై, భారీ విజయం సాధించిందని. ఆ తర్వాత రణబీర్ నటించిన 'తూ జూఠీ మై మక్కర్', ఇప్పుడీ 'యానిమల్' సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఈ రెండు సినిమాలకూ మంచి పేరు, వసూళ్లు వస్తున్నాయి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply