Silk Smitha Biopic: సిల్క్ స్మిత బయోపిక్ - టైటిల్ రోల్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ
సిల్క్ స్మిత బయోపిక్ తెరకెక్కుతోంది. ఇవాళ ఆమె జయంతి సందర్భంగా సినిమా అనౌన్స్ చేశారు. ఇందులో టైటిల్ రోల్ ఎవరు చేస్తున్నారో తెలుసా?
Silk Smitha biopic movie announced on her birth anniversary: సిల్క్ స్మిత... ఈ పేరు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లి పాతిక సంవత్సరాలు దాటింది. అయినా సరే ఆమెను ఎవరూ మరువలేదు. పాటల్లో, ఏదో ఒక సినిమాలో సిల్క్ స్మిత ప్రస్తావన తప్పకుండా ఉంటోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఆమె జీవితంపై ఓ బయోపిక్ తెరకెక్కుతోంది.
సిల్క్ స్మితగా చంద్రికా రవి
Chandrika Ravi as Silk Smitha: సిల్క్ స్మిత జీవితం ఆధారంగా వి. మహాస్త్రి అమృతరాజ్ సమర్పణలో స్త్రీ సినిమాస్ పతాకంపై ఎస్.బి. విజయ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. దీనికి జయరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి 'సిల్క్ స్మిత' టైటిల్ ఖరారు చేశారు. ది అన్ టోల్డ్ స్టోరీ... అనేది ఉప శీర్షిక. ఇవాళ సిల్క్ స్మిత జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు.
'సిల్క్ స్మిత' బయోపిక్ (Silk Smitha Biopic)లో టైటిల్ పాత్రలో చంద్రికా రవి నటించనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. అంతే కాదు... స్మితగా చంద్రికా రవి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ లుక్ చూస్తే... అచ్చంగా సిల్క్ స్మిత దిగి వచ్చినట్లు ఉందని సోషల్ మీడియాలో కొందరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
Also Read: ఎక్స్‌ట్రా మాస్ - శ్రీ లీలతో డ్యాన్స్ ఇరగదీసిన నితిన్!
Happy 63rd birthday to the timeless beauty, Silk Smitha. With the blessings of her family, it is with immense gratitude that we share with the world her untold story@jayaram986@sivacherry@onlynikil@ursvamsishekar#happybirthdaysilk #silksmithabiopic #chandrikaassilk pic.twitter.com/hDbrs2ec0b
— 𝗖𝗵𝗮𝗻𝗱𝗿𝗶𝗸𝗮 𝗥𝗮𝘃𝗶 (@chandrikaravi_) December 2, 2023
తెలుగు ప్రేక్షకులకు చంద్రికా రవి కొత్త కాదు. ఆల్రెడీ ఆమె ఓ తెలుగు సినిమా చేశారు. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'వీర సింహా రెడ్డి' సినిమాలో 'మా మనోభావాలు దెబ్బ తిన్నాయి' పాటలో హానీ రోజ్, బాలయ్యతో కలిసి స్టెప్పులు వేశారు. అంతకు ముందు 'చీకటి గదిలో చితకొట్టుడు' సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించారు.
Also Read: యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?
'డర్టీ పిక్చర్' కంటే కొత్తగా ఉంటుందా?
సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఆల్రెడీ ఓ సినిమా వచ్చింది. అదే హిందీలో విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించిన 'డర్టీ పిక్చర్'. అందులో ఎమోషన్స్ కంటే విద్య బోల్డ్ స్టెప్స్, పాటలు హైలైట్ అయ్యాయి. మరి, ఆ సినిమాలో చూపించని కొత్త విషయాలు, ఎమోషన్స్ 'సిల్క్ స్మిత'లో ఏం ఉంటాయి? అనే ఆసక్తి పేక్షకుల్లో నెలకొంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply