అన్వేషించండి

Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?

Animal Review: రణబీర్ కపూర్, రష్మికా మందన్నా జంటగా నటించిన సినిమా 'యానిమల్'. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఇవాళ థియేటర్లలో విడుదలైంది.

సినిమా రివ్యూ: యానిమల్
రేటింగ్: 3/5
నటీనటులు: రణబీర్ కపూర్, రష్మికా మందన్నా, అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్, తృప్తి దిమ్రి, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ తదితరులు
ఛాయాగ్రహణం: అమిత్ రాయ్
నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతని, ప్రణయ్ రెడ్డి వంగా 
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగా
విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023  

Animal movie review in Telugu: 'యానిమల్' సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనూ క్రేజ్ నెలకొనడానికి కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా! తెలుగులో ఆయన తీసిన 'అర్జున్ రెడ్డి' సినిమా! సందీప్ రెడ్డి వంగాకు రణబీర్ కపూర్ లాంటి టాలెంటెడ్ హీరో తోడు కావడంతో సినిమాపై ముందు నుంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి, సినిమా ఎలా ఉంది? 

కథ (Animal Movie Story): దేశంలోని అత్యంత సంపన్నులలో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. స్వస్తిక్ స్టీల్ ఫ్యాక్టరీ యజమాని. రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్) ఆయన కుమారుడు. విజయ్ కాస్త అగ్రెసివ్. అక్కను ర్యాగింగ్ చేశారని కాలేజీకి గన్ తీసుకెళ్లి విద్యార్థులను భయపెడతాడు. కుమారుడి ప్రవర్తన తండ్రికి నచ్చదు. బోర్డింగ్ స్కూల్‌కు పంపిస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత బావతో జరిగిన గొడవ కారణంగా తండ్రి కొడుకుల మధ్య దూరం మరింత పెడుతుంది. రణ్ విజయ్ సింగ్ అమెరికా వెళతాడు. తండ్రి మీద హత్యాయత్నం జరిగిందని తెలిసి 8 ఏళ్ళ తర్వాత ఇండియా వస్తాడు. అటాక్ చేసిన వాళ్ళ తలలు తెగ నరుకుతానని శపథం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది?

గీతాంజలి (రష్మిక), రణ్ విజయ్ సింగ్ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? వాళ్ళ సంసార జీవితం ఎలా ఉంది? బల్బీర్ సింగ్ మీద ఎటాక్ చేసింది ఎవరు? అబ్రార్ (బాబీ డియోల్) ఎవరు? వాళ్ళకు, రణ్ విజయ్ సింగ్ కుటుంబం మధ్య సంబంధం లేదా శత్రుత్వం ఏమిటి? అనేది వెండితెరపై చూడాలి. 

విశ్లేషణ (Animal Telugu Movie Review): కథానాయకుడు తనతో తాను యుద్ధం చేయాల్సి వస్తే... తండ్రిపై తన ప్రేమను చూపించడానికి, తండ్రి ప్రేమను పొందడానికి అనునిత్యం యుద్ధం చేయాల్సి వస్తే... తండ్రిని కాపాడుకోవడం కోసం తన వాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తే... ఎంతటి మానసిక సంఘర్షణకు లోను అవుతాడు? అనేది ప్రతి సన్నివేశంలో సందీప్ రెడ్డి వంగా చెప్పే ప్రయత్నం చేశారు. డైరెక్టోరియల్ బ్రిలియన్స్ పలు సన్నివేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పడంలో సందీప్ రెడ్డి వంగా ఎటువంటి మొహమాటాలు పెట్టుకోరు. 'యానిమల్'లోనూ ఆ మార్క్ డైరెక్షన్ ఉంది. అక్కను ర్యాగింగ్ చేసిన వాళ్ళను కొట్టిన హీరోలను చూసి ఉంటారు. కానీ, గన్ పట్టుకుని కాలేజీకి హీరో వెళ్లడం సందీప్ రెడ్డి వంగా స్టైల్. విమానంలో తొలి రాత్రి కూడా! ఇలా ప్రతిదీ సీన్ నెక్స్ట్ లెవల్ అన్నట్లు లార్జర్ దేన్ లైఫ్ పిక్చర్ బిల్డప్ చేస్తూ వచ్చారు. ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ కిక్ ఇచ్చారు. ఆ యాక్షన్ బ్లాక్ నెవ్వర్ బిఫోర్!

సందీప్ రెడ్డి వంగా పుస్తకంలో రూల్స్, లైన్స్ ఉండవు. లెక్కలు వేసుకోకుండా సీన్స్ తీయడం ఆయనకు అలవాటు. ఆ కారణం చేత ఇంటర్వెల్ తర్వాత సీన్లు లెంగ్తీగా ఉన్నట్లు అనిపిస్తాయి. ఇంటర్వెల్ / మెషిన్ గన్ యాక్షన్ ఎపిసోడ్ తర్వాత అంతకు మించి యాక్షన్ తీయాలనుకోలేదు. ఎమోషన్స్ చెప్పడానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. కథను కథగా చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రణబీర్ - బాబీ డియోల్ మధ్య ఫైట్ జరుగుతుంటే నేపథ్యంలో వచ్చే గీతం సందీప్ వంగా దర్శకత్వ ప్రతిభకు ఉదాహరణ. ఆ క్రమంలో నిడివి ఎక్కువైన ఫీలింగ్ ప్రేక్షకుడిలో మొదలవుతుంది. 

ఇంటర్వెల్ వరకు తర్వాత ఏం జరుగుతుంది? అని ఆసక్తిగా చూసిన ప్రేక్షకుడు, ఆ తర్వాత కాస్త త్వరగా ముగిస్తే బావుంటుందనే సీన్లు కొన్ని ఉన్నాయి. ఎడిటర్ కూడా సందీప్ రెడ్డి వంగా కావడంతో తీసిన సన్నివేశాలపై ప్రేమ ఎక్కువ కావడంతో కత్తెర వేయడానికి మనసు ఒప్పుకోలేదు. జోయా ఎపిసోడ్ & ఇంటర్వెల్ తర్వాత తండ్రి కుమారుల మధ్య సీన్లలో కొంత కత్తెర వేయవచ్చు. అయితే... రణబీర్ కపూర్ ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ కొంత వరకు ఆ లోటుపాట్లను కవర్ చేసింది. 

నేపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోశారు హర్షవర్ధన్ రామేశ్వర్. హీరోయిజం ఎలివేట్ కావడంతో ఆయన ఆర్ఆర్, పాటల ప్రాముఖ్యతను మరువలేం. కెమెరా వర్క్ టాప్ క్లాస్. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. మాటల్లో సందీప్ రెడ్డి వంగా మార్క్ కనిపించింది. 'అర్జున్ రెడ్డి'పై విమర్శలు వచ్చినట్లు... రష్మిక, రణబీర్ మధ్య సీన్లతో పాటు డైలాగులపై కొందరు విమర్శలు చేయవచ్చు. ఆ సీన్స్ ఎఫెక్ట్ అటువంటిది. భార్య భర్తల మధ్య అనుబంధంలో, వాళ్ళిద్దరి మధ్య ఆలోచనల్లో ఫిల్టర్ లేకుండా చెప్పారు. 

నటీనటులు ఎలా చేశారంటే: రణబీర్ కపూర్ ప్రతిభ గురించి కొత్తగా చెప్పాలా? స్టార్ కంటే ముందు పెర్ఫార్మన్స్‌తో పేరు తెచ్చుకున్నారు. 'సంజు' చూశాక... సంజయ్ దత్ రియల్ లైఫ్ క్యారెక్టర్ చేసినా సరే, రణబీర్ అంత బాగా చేయలేరని ప్రశంసలు వచ్చాయి. క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా నటించే హీరోలలో రణబీర్ ఒకరు. రణ్ విజయ్ సింగ్ పాత్రకు ప్రాణం పోశారు. టీనేజ్, యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్... వివిధ దశల్లో జీవించారు. ప్రేక్షకులను ఆ పాత్రతో పాటు ప్రయాణం చేసేలా నటించారు. 

గీతాంజలి పాత్రకు రష్మికా మందన్నా న్యాయం చేశారు. రణబీర్, రష్మిక మధ్య వైఫ్ అండ్ హజ్బెండ్ బాండింగ్... పెళ్లి గురించి చెప్పే కొన్ని డైలాగులకు కొందరి నుంచి క్లాప్స్ పడతాయి. జోయా పాత్రలో తృప్తి దిమ్రి గ్లామర్ కొందరిని ఆకర్షిస్తుంది. ఆమె, రణబీర్ మధ్య కలయిక సన్నివేశం గురించి డిస్కషన్ జరుగుతుంది. రణబీర్ తండ్రిగా అనిల్ కపూర్ నటనలో వంక పెట్టడానికి ఏమీ లేదు.

Also Read: దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?

రణబీర్ కపూర్ తర్వాత సినిమాలో హైలైట్ అంటే బాబీ డియోల్ యాక్టింగ్! కేవలం కళ్ళతో భయపెట్టారు. ఆయన పాత్ర గురించి ఎక్కువ అంచనాలు పెట్టకోవద్దు. స్క్రీన్ స్పేస్ తక్కువ. రణబీర్, బాబీ మధ్య యాక్షన్ సీన్ డిజైనింగ్ కూడా బావుంది. పృథ్వీరాజ్ పాత్ర నిడివి తక్కువ. కానీ, ఇంపాక్ట్ ఉంటుంది. స్క్రీన్ మీద కొందరు తెలుగు నటీనటులు సైతం కనిపించారు.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

చివరగా చెప్పేది ఏంటంటే: యానిమల్... రెగ్యులర్ రొటీన్ సినిమా కాదు. క్యారెక్టర్ బేస్డ్, కంటెంట్ బేస్డ్ చిత్రమిది. సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్ & ఎమోషనల్ ఫిల్మ్! టైటిల్‌కు తగ్గట్టు యాక్షన్ సీన్లలో శత్రువులపై రణబీర్ కపూర్ 'బీస్ట్'లా విరుచుకుపడ్డారు. ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్‌లలో 'యానిమల్' ఒకటిగా, ముందు వరుసలో నిలుస్తుంది. ముందు చెప్పినట్లు... ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ కిక్ / హై వస్తుంది. ఆ తర్వాత కూడా హై మూమెంట్స్ ఉన్నాయి. అయితే... మూడు గంటలపై పైగా థియేటర్లలో కూర్చోక తప్పదు. ఇటువంటి సినిమాను ఒక్కసారైనా తప్పకుండా థియేటర్లలో చూడాలి. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

PS: 'యానిమల్'లో వయలెన్స్ యాక్షన్ ప్రేమికులకు నచ్చుతుంది. అయితే... ఫీల్ గుడ్ ఫిలిమ్స్, పిల్లలతో కలిసి సినిమా చూడాలని కోరుకునే ప్రేక్షకులు ఈ సినిమాకు దూరంగా ఉండటం మంచిది.

Also Readది విలేజ్ వెబ్ సిరీస్ రివ్యూ: ఆర్య & మిళింద్ రావు థ్రిల్ ఇచ్చారా? భయపెట్టారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget