'యానిమల్'లో రణబీర్‌తో బెడ్ రూమ్ సీన్ చేసిన అమ్మాయి పేరు తృప్తి దిమ్రి. ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటో తెలుసుకోండి. తృప్తి దిమ్రి ఉత్తరాఖండ్ అమ్మాయి. ఫిబ్రవరి 23, 1994లో జన్మించింది. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. తృప్తి దిమ్రి తొలుత యాడ్స్ చేశారు. 'సంతూర్ మామ్'గా ఆవిడ చాలా పాపులర్. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. 'మామ్' సినిమాలో శ్రీదేవి కుమార్తెగా నటించిన అమ్మాయి క్లాస్‌మేట్‌గా చిన్న రోల్ చేశారు. 'పోస్టర్ బాయ్స్'తో కథానాయికగా తృప్తి దిమ్రి కెరీర్ మొదలైంది. ఆ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చింది. 'పోస్టర్ బాయ్స్' తర్వాత 'లైలా మజ్ను' సినిమా చేశారు తృప్తి. ఆ తర్వాత ఆమె కెరీర్ టర్న్ తీసుకుంది. అనుష్క శర్మ నిర్మించిన హారర్ ఫిల్మ్ 'బుల్ బుల్' తృప్తి దిమ్రికి పెద్ద హిట్. తర్వాత 'ఖలా' కూడా హిట్టే. ఇప్పుడు 'యానిమల్' సినిమాతో తృప్తి దిమ్రి పేరు ప్రేక్షకుల్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తృప్తి దిమ్రి తండ్రికి నటుడు కావాలనే కోరిక ఉండేది. నాన్న కోసం తృప్తి నటి అయ్యారు. విక్కీ కౌశల్ 'మేరే మెహబూబ్ మేరే సనమ్', రాజ్ కుమార్ రావు 'విక్కీ వైద్య కా వో వాలా వీడియో'లో తృప్తి నటిస్తున్నారు .