విక్కీ కౌశల్ నటించిన ‘శామ్ బహదూర్’ మొదటి వీకెండ్‌లో రూ.25.55 కోట్లు నెట్ వసూలు చేసింది.

‘యానిమల్’తో పోటీ పడి మరీ ‘శామ్ బహదూర్’ డీసెంట్ కలెక్షన్స్ సాధించింది.

ఈ సినిమాకు మంచి టాక్ కూడా వచ్చింది.

భారత ఆర్మీ మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ శామ్ మెకన్షా బయోపిక్‌గా ‘శామ్ బహదూర్’ తెరకెక్కింది.

మొదటి రోజు శామ్ బహదూర్ రూ.6.25 కోట్లు వసూలు చేసింది.

రెండో రోజు ఏకంగా 50 శాతం పెరిగి రూ.9 కోట్లకు చేరుకుంది.

మూడో రోజు ఆదివారం రూ.10.3 కోట్ల నెట్ సాధించింది.

ఫుల్ రన్‌లో రూ.75 కోట్ల వరకు వసూళ్లు వస్తాయని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

‘యానిమల్’తో పోటీ లేకుండా సోలోగా వచ్చి ఉంటే పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది.