News
News
X

Regina Cassandra: 'ఫుల్లుగా తాగేసి ఇంటికెళ్లా, ప్రెగ్నెన్సీ విషయంలో అబద్దం చెప్పా' - రెజీనా కామెంట్స్!

నటి రెజీనా.. అలీ నిర్వహించే 'అలీతో సరదాగా' షోకి గెస్ట్ గా వచ్చింది.

FOLLOW US: 

కోలీవుడ్ కి చెందిన రెజీనా కసాండ్రా టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' వంటి హిట్ సినిమాల్లో నటించింది. తెలుగులో ఆమె చివరిగా 'ఆచార్య' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించింది. ఈ సినిమా పెద్దగా ఆడనప్పటికీ రెజీనా ఐటెం సాంగ్ బాగానే వర్కవుట్ అయింది. రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'అన్యాస్ ట్యుటోరియల్' అనే వెబ్ సిరీస్ లో ఆహాలో విడుదలైంది. 

ఈ హారర్ సిరీస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ అలీ నిర్వహించే 'అలీతో సరదాగా' షోకి గెస్ట్ గా వచ్చింది. ఈ సందర్భంగా వీరిద్దరూ ఎన్నో ఆసక్తికర విషయాలను చర్చించుకున్నారు. అలీ అడిగే విషయాలకు సమాధానాలు చెప్పుకొచ్చింది రెజీనా.. సెకండ్ ఇయర్ కాలేజ్ చదువుతున్నప్పుడు ఫుల్లుగా తాగేసి ఇంటికెళ్లానని.. ఆ సమయంలో తన తల్లి బాగా తిట్టిందని చెప్పుకొచ్చింది రెజీనా. 

అలానే తను ప్రెగ్నెన్సీ విషయంలో అబద్ధం చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంది. రాత్రి 11 గంటల సమయంలో మిస్టీ దోయ్ స్వీట్ తినాలనిపించడంతో బయటకు వెళ్లగా.. అప్పటికే షాప్స్ అన్నీ క్లోజ్ చేసేశారని.. ఒక షాప్ ఉండడంతో అక్కడికి వెళ్లి అడగ్గా.. క్లోజింగ్ టైమ్ అని చెప్పడంతో వారితో.. 'నేను ప్రెగ్నెంట్.. ఆ స్వీట్ తినాలనుంది' అని అబద్ధం చెప్పిన విషయాన్ని అలీ షోలో వెల్లడించింది రెజీనా. 

'2019 కులుమనాలి.. రూమ్ నెంబర్ నాకు తెలియదు.. ఒకటి జరిగింది' అని రెజీనా ప్రశ్నించగా.. 'నా లైఫ్ లో ఇలాంటివి ఇంకా జరగాలని కోరుకుంటున్నా.. నా ఫ్రెండ్స్ తో కలిసి కులు మనాలికి వెళ్లాను. మధ్యాహ్నం సమయంలో కళ్లకు ఐమాస్క్ వేసుకొని పడుకున్నా.. అప్పుడు ఎవరో నా నుదుటి మీద వేళ్లతో తడిమినట్లు అనిపించింది. ఎవరా..? అని మెల్లగా కళ్లు తెరిచి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఆ ఇన్సిడెంట్ ఎంతో ఫన్నీగా అనిపించింది' అంటూ చెప్పుకొచ్చింది. 

View this post on Instagram
 
A post shared by Regina Cassandra (@reginaacassandraa)

Published at : 12 Jul 2022 05:04 PM (IST) Tags: Regina Cassandra Regina Cassandra pregnancy Regina Cassandra alitho saradaga

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu August 11th Update: బిర్యానీ తింటూ జ్ఞానంబకి దొరికిపోయిన మల్లిక- జానకిని కాలేజీలో చేర్పించిన జ్ఞానంబ

Janaki Kalaganaledu August 11th Update: బిర్యానీ తింటూ జ్ఞానంబకి దొరికిపోయిన మల్లిక- జానకిని కాలేజీలో చేర్పించిన జ్ఞానంబ

Gruhalakshmi August 11th Update: తులసిని తిరుగుబోతు చేసిన లాస్య, అనసూయకి అవమానం- మరోవైపు ఫ్లైట్ ఎక్కుతున్నందుకు తులసి సంబరం

Gruhalakshmi August 11th Update: తులసిని తిరుగుబోతు చేసిన లాస్య, అనసూయకి అవమానం- మరోవైపు ఫ్లైట్ ఎక్కుతున్నందుకు తులసి సంబరం

Guppedantha Manasu ఆగస్టు 11 ఎపిసోడ్: ఆఖరిసారి చూడాలనుందని వసు మెసేజ్ చూసి కంగారుగా వెళ్లిన రిషి, దేవయానితో జగతి సవాల్!

Guppedantha Manasu ఆగస్టు 11 ఎపిసోడ్: ఆఖరిసారి చూడాలనుందని వసు మెసేజ్ చూసి కంగారుగా వెళ్లిన రిషి, దేవయానితో జగతి సవాల్!

Devatha August 11th Update: రుక్మిణి ఫోటోతో దేవుడమ్మ ఇంటికి దేవి- రాధ ఇంట్లో నుంచి వెళ్లిపోతుందేమో అని భయపడుతున్న రామూర్తి, జానకి

Devatha August 11th Update: రుక్మిణి ఫోటోతో దేవుడమ్మ ఇంటికి దేవి- రాధ ఇంట్లో నుంచి వెళ్లిపోతుందేమో అని భయపడుతున్న రామూర్తి, జానకి

Karthika Deepam Premi Viswanath: కార్తీకదీపం లో వంటలక్క రీఎంట్రీ పక్కా, ప్రోమో ఇదిగో

Karthika Deepam Premi Viswanath:  కార్తీకదీపం లో వంటలక్క రీఎంట్రీ పక్కా, ప్రోమో ఇదిగో

టాప్ స్టోరీస్

Kajal Aggarwal : కట్టప్పలా మారిన కాజల్ - బాహుబలి ఎవరో చూశారా రాజమౌళి గారూ?

Kajal Aggarwal : కట్టప్పలా మారిన కాజల్ - బాహుబలి ఎవరో చూశారా రాజమౌళి గారూ?

SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI

SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI

Munugode Congress : "మునుగోడు" ఎలా గెలుద్దాం ? కాంగ్రెస్ సీనియర్ల తర్జన భర్జన !

Munugode Congress :

Independence Day 2022: ఈసారి ఎర్రకోటలోని స్వాతంత్య్ర వేడుకలకు ఓ స్పెషాల్టీ ఉంది, అదేంటో తెలుసా?

Independence Day 2022: ఈసారి ఎర్రకోటలోని స్వాతంత్య్ర వేడుకలకు ఓ స్పెషాల్టీ ఉంది, అదేంటో తెలుసా?