Amma Rajasekhar Nithiin: నితిన్‌కు డ్యాన్స్ రాదు, నేనే నేర్పించా! ఈ రోజు నన్నే అవమానించాడు - అమ్మ రాజశేఖర్ సెన్సేషనల్ కామెంట్స్
అమ్మ రాజశేఖర్.. నితిన్ ని తిట్టిపోశారు. అంతేకాదు.. ఎలా బాగుపడతావో చూస్తా అంటూ శాపనార్ధాలు కూడా పెట్టారు.
టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో నితిన్ ఒకరు. డాన్స్, యాక్టింగ్ ఇలా అన్నింటిలో నితిన్ కి మంచి పేరుంది. అలాంటిది నితిన్ కి అసలు డాన్సే రాదని అంటున్నారు ఓ డాన్స్ మాస్టర్. ఆయన మరెవరో కాదు.. అమ్మ రాజశేఖర్. పలు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసిన అమ్మ రాజశేఖర్ దర్శకుడిగా కూడా సినిమాలు చేశారు. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేసిన ఓ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి హీరో నితిన్ ని గెస్ట్ గా పిలిచారు. కానీ నితిన్ ఈవెంట్ కి హాజరు కాలేదు.
ఈ విషయంలో అప్సెట్ అయిన అమ్మ రాజశేఖర్ నేరుగానే నితిన్ ని తిట్టిపోశారు. అంతేకాదు.. ఎలా బాగుపడతావో చూస్తా అంటూ శాపనార్ధాలు కూడా పెట్టారు. నితిన్ ముందే రానని చెప్పినా బాగుండేది కానీ వస్తానని చెప్పి రాకుండా తనను మోసం చేశాడని అమ్మ రాజశేఖర్ ఫైర్ అయ్యారు. అతడి కోసం మంచి వీడియో రూపొందించాలని.. చాలా కష్టపడ్డానని కానీ అతడు రాలేదని అన్నారు. కనీసం బైట్ అయినా పంపించలేదని తన బాధను వ్యక్తం చేశారు.
పోనీ బిజీగా ఉండి రాలేదా..? అంటే కాదని.. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారని.. జ్వరం వచ్చిందని అబద్ధం చెబుతున్నాడని అన్నారు. నితిన్ కి డాన్సే రాదని.. తనే నేర్పించినట్లు చెప్పారు. మన ఎదుగుదలకి సాయం చేసిన వారిని మర్చిపోకూడదని.. అలా చేస్తే ఎదగలేరని అన్నారు. అమ్మని, గురువుని మర్చిపోయి బాగుపడ్డ వాళ్లు లేరని అన్నారు. ఈ ఆర్టిస్టులంతా టెక్నీషియన్స్ ను ఫ్రూట్స్ లా చూస్తుంటారని.. తినేసి అవతల పడేస్తారని.. కానీ వాటి విత్తనాలు మళ్లీ మొలకెత్తుతాయి.. మళ్లీ పండ్లు కాస్తాయని ఎమోషనల్ గా మాట్లాడారు.
అమ్మ రాజశేఖర్ చేసిన ఈ కామెంట్స్ ని నితిన్ పట్టించుకుంటారో లేక లైట్ తీసుకుంటారో చూడాలి. ఇక నితిన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న 'మాచర్ల నియోజకవర్గం' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ సినిమా నుంచి ఓ ఐటెం సాంగ్ ను రిలీజ్ చేశారు.
Also Read: 'హ్యాపీ బర్త్ డే'తో మత్తు వదిలిపోయింది!
View this post on Instagram