By: ABP Desam | Updated at : 10 Jul 2022 03:59 PM (IST)
సూర్యతో దుల్కర్ సల్మాన్
'కేజీఎఫ్' సినిమాతో హోంబేలె ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ పాన్ ఇండియా లెవెల్ లో పాపులర్ అయింది. ఈ సినిమా తీసుకొచ్చిన లాభాలతోనే ఇప్పుడు మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కి శ్రీకారం చుడుతోంది హోంబేలె ఫిలిమ్స్. ఇప్పుడు ప్రభాస్ హీరోగా 'సలార్' అనే సినిమాను నిర్మిస్తోంది. దీంతో పాటు అటు మలయాళం, ఇటు తమిళంలో కూడా భారీ ప్రాజెక్ట్స్ ను సెట్ చేయడానికి రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ తో ఓ సినిమాను మొదలుపెట్టారు.
ఇప్పుడు ఓ క్రేజీ మల్టీస్టారర్ ను మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. సూర్య, దుల్కర్ సల్మాన్ లాంటి టాలెంటెడ్ హీరోలతో ఓ సినిమా చేయబోతున్నారు. దీన్ని సుధా కొంగర డైరెక్ట్ చేయబోతున్నారు. నిజానికి ఈ ప్రాజెక్ట్ ను గతంలోనే అనౌన్స్ చేశారు కానీ ఈ కాంబినేషన్ గురించి చెప్పలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ లో దుల్కర్ సల్మాన్ కూడా జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది.
'ఆకాశం నీ హద్దురా' సినిమా సమయంలో సుధా కొంగర వర్క్ కి ఫిదా అయిన సూర్య ఆమె అడిగిన వెంటనే ఈ సినిమాకి ఓకే చెప్పారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సూర్య నిర్మాతగా చాలా బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన నటించిన 'ఈటి' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక దుల్కర్ సల్మాన్ 'సీతారామం' సినిమాతో త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Salaar Release Date: ఫ్లాప్ ఇచ్చిన రోజు హిట్ కొట్టడానికి వస్తున్న ప్రభాస్ - ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్
Urfi Javed: ఉర్ఫీ జావెద్కు లైంగిక వేదింపులు - అతడి ఫొటో, వాట్సాప్ చాట్ బయటపెట్టిన బ్యూటీ
Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్ల్లో పాప్కార్న్ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?
Anjali Arora On Leaked MMS: అదంతా ఫేక్, అసభ్యకర వీడియోపై కంటతడి పెట్టిన అంజలి
Vijay Devarakonda : పూరి నాన్న, ఛార్మి అమ్మ - 'లైగర్' ఈవెంట్లో విజయ్ దేవరకొండ
Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్
TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం
Jagan Independence Day: 75 ఏళ్ల విజయ ప్రస్థానం మరపురానిది: ఏపీ సీఎం జగన్
India Independence Day 2022: కూతురుని, కొడుకుని ఒకేలా చూడకపోతే ఎలా? నారీశక్తికి అండగా నిలవండి - ప్రధాని మోదీ