Sumanth Look In Sita Ramam: ముగింపు మన చేతుల్లో ఉండదు - 'సీతా రామం'లో సుమంత్ లుక్ చూశారా? మాట విన్నారా?
Sumanth as Brigadier Vishnu Sharma: దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'సీతా రామం'. ఇందులో సుమంత్ ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేశారు.
![Sumanth Look In Sita Ramam: ముగింపు మన చేతుల్లో ఉండదు - 'సీతా రామం'లో సుమంత్ లుక్ చూశారా? మాట విన్నారా? Sumanth First Look From Dulquer Salmaan's Sita Ramam movie as Brigadier Vishnu Sharma released Watch dialogue motion poster here Sumanth Look In Sita Ramam: ముగింపు మన చేతుల్లో ఉండదు - 'సీతా రామం'లో సుమంత్ లుక్ చూశారా? మాట విన్నారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/09/72776b162c286c22e276a5e9863635fa1657350688_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
''కొన్ని యుద్ధాలు మొదలుపెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది, ముగింపు కాదు'' అని సుమంత్ అంటున్నారు. 'సీతా రామం' సినిమాలో ఆయన డైలాగ్ ఇది. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతున్న చిత్రమిది. యుద్ధంతో రాసిన ప్రేమకథ... అనేది ఉపశీర్షిక. ఇందులో సుమంత్ బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు (Sumanth First Look Sita Ramam Movie).
'సీతా రామం'లో రెండు పాటలు విడుదల చేశారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఆ రెండు పాటలను ఎస్పీ బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్పీ చరణ్ ఆలపించారు. పాటలకు అద్భుత స్పందన లభిస్తోంది.
'అందాల రాక్షసి', 'పడి పడి లేచె మనసు' చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రమిది. రష్మికా మందన్న (Rashmika Mandanna) కీలక పాత్రలో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read : హిందీలో సమంతకు మరో అవకాశం - స్టార్ హీరో కుమార్తెను తప్పించి మరీ...
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)