News
News
X
IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI | Harare Sports Club, Harare - 20 Aug, 12:45 pm IST
(Match Yet To Begin)
ZIM
ZIM
VS
IND
IND
Asia Cup Qualifier, 2022 | Match 1 | Al Amerat Cricket Ground Oman Cricket (Ministry Turf 1), Oman - 20 Aug, 07:30 pm IST
(Match Yet To Begin)
SIN
SIN
VS
HK
HK

Samantha in Immortal Ashwatthama: హిందీలో సమంతకు మరో అవకాశం - స్టార్ హీరో కుమార్తెను తప్పించి మరీ... 

సమంతకు హిందీ సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయని ముంబై టాక్. హిందీలో ఫస్ట్ సినిమా స్టార్ట్ కావడానికి ముందే మరో సినిమా ఛాన్స్ వచ్చిందని సమాచారం.

FOLLOW US: 

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌తో సమంతకు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆమె నటనకు చాలా మంది ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా! అందుకని, ఆమెకు హిందీ నుంచి అవకాశాలు క్యూ కడుతున్నాయని టాక్.

సమంత ప్రధాన తారగా తానొక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నానని హీరోయిన్ తాప్సీ పన్ను వెల్లడించారు. హిందీలో సమంతకు అది తొలి సినిమా. ఇంకా ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ కాలేదు. దాని తర్వాత మరో సినిమా (Samantha Second Bollywood Project) కూడా చర్చల్లో ఉందని తెలుస్తోంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా దినేష్ విజయన్ నిర్మించనున్న సినిమాలో ఆమె నటించనున్నారని సమాచారం. అది కాకుండా మరో రెండు సినిమాలు చర్చల్లో ఉన్నాయట!

Samantha To Act With Vicky Kaushal:  విక్కీ కౌశల్ హీరోగా 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' తీసిన ఆదిత్య ధర్, ఇప్పుడు 'ఇమ్మోర్టల్ అశ్వథామ' సినిమా ప్లాన్ చేశారు. అందులో సమంతను నాయికగా తీసుకోవాలని దర్శక - నిర్మాతలు భావిస్తున్నారట. ఇటీవల ఆమెను కలిసిన దర్శకుడు కథ కూడా చెప్పారట. సమంతకు కథ నచ్చిందని, చర్చలు జరుగుతున్నాయని సమాచారం. తొలుత ఈ సినిమాలో కథానాయికగా సారా అలీ ఖాన్ పేరు వినిపించింది. ఇప్పుడు ఆమెను తప్పించి సమంతను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

విక్కీ కౌశల్ సినిమా పక్కన పెడితే... అక్షయ్ కుమార్, సమంత (Akshay Kumar Samantha Movie) జంటగా కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టు ముంబై టాక్. 'కాఫీ విత్ కరణ్' షోలో అక్షయ్, సమంత సందడి చేయనున్న సంగతి తెలిసిందే. 

Also Read : సమ్మర్ సీజన్ టార్గెట్ చేసిన మహేష్ & త్రివిక్రమ్, SSMB 28 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే?

ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు 'శాకుంతలం', 'యశోద', విజయ్ దేవరకొండ 'ఖుషి'... ప్రస్తుతం సమంత చేతిలో ఉన్నవి అన్నీ ప్లాన్ ఇండియా సినిమాలే. ఆమె ప్లానింగ్ చూస్తుంటే... ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తయిన తర్వాత కూడా పాన్ ఇండియా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నట్టు ఉన్నారు. ముంబైకు మకాం మార్చాలని సమంత ఆలోచిస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. 

Also Read : 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' రివ్యూ: మోడ్రన్ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి? సిరీస్ ఎలా ఉంది?

Published at : 09 Jul 2022 12:25 PM (IST) Tags: samantha Samantha Hindi Films Samantha in Immortal Ashwatthama Samantha Akshay Kumar Movie Samantha Vicky Kaushal

సంబంధిత కథనాలు

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?

Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!

Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!

SSMB28Update: 'పోకిరి' రిలీజ్ డేట్‌కి మహేష్, త్రివిక్రమ్ సినిమా - సమ్మర్‌లో మాసివ్ అండ్ ఎపిక్ బ్లాస్ట్!

SSMB28Update: 'పోకిరి' రిలీజ్ డేట్‌కి మహేష్, త్రివిక్రమ్ సినిమా - సమ్మర్‌లో మాసివ్ అండ్ ఎపిక్ బ్లాస్ట్!

Puri Jagannadh: క్రేజీ డీల్ వదులుకున్న 'లైగర్' టీమ్ - ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరి జగన్నాధ్!

Puri Jagannadh: క్రేజీ డీల్ వదులుకున్న 'లైగర్' టీమ్ - ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరి జగన్నాధ్!

Viruman: ప్రభాస్ ఫ్లాప్ సినిమా పాయింట్‌తో కార్తీ సినిమా - సూపర్ హిట్ అయిందే!

Viruman: ప్రభాస్ ఫ్లాప్ సినిమా పాయింట్‌తో కార్తీ సినిమా - సూపర్ హిట్ అయిందే!

టాప్ స్టోరీస్

IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!

IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!

Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?

Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి  దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?

Rajinikanth as Governor: రజనీకాంత్‌కు గవర్నర్ పోస్ట్ ! బీజేపీ ఆఫర్ ఇచ్చిందా ? తలైవా అంగీకరించారా ?

Rajinikanth as Governor:   రజనీకాంత్‌కు గవర్నర్ పోస్ట్ !  బీజేపీ ఆఫర్ ఇచ్చిందా ? తలైవా అంగీకరించారా ?

Freebies Politics : చట్టాలు చేస్తే , తీర్పులు ఇస్తే ఉచిత పథకాలు ఆగుతాయా ? మార్పు ఎక్కడ రావాలి ?

Freebies Politics : చట్టాలు చేస్తే , తీర్పులు ఇస్తే ఉచిత పథకాలు ఆగుతాయా ? మార్పు ఎక్కడ రావాలి ?