Trinayani Serial Today November 30th Episode : 'త్రినయని' సీరియల్: బెడిసికొట్టిన తిలోత్తమ ప్లాన్, ఫ్యామిలీ ముందు గుట్టు రట్టు చేసిన నయని!
Trinayani Serial Today Episode: తిలోత్తమ వేరే వాళ్ల పాపని తీసుకొచ్చి గాయత్రీ దేవి అని నయనికి ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది
Trinayani Serial Today November 30th Episode: తిలోత్తమ, వల్లభ పసిబిడ్డగా ఉన్న గాయత్రీ దేవిని తీసుకొస్తామని వెళ్తారు. ఇక విశాల్, హాసిని బయట వచ్చి మాట్లాడుకుంటారు. ఇంట్లో పాప ఉంటే వీళ్లు ఇంకెవరిని తీసుకొస్తారు అని టెన్షన్ పడతారు. అయితే ఎవరో వేరే పాపను తీసుకొస్తారని.. వాళ్లని మనం ఏం చేయలేమని.. వేరే పాపని తెచ్చి తన తల్లి అని అంటారని.. ఆ పాప గాయత్రీదేవి కాదు అని మనం చెప్తే ఎలా చెప్పారు. అని ప్రశ్నిస్తారు అని అనుకుంటారు. మరోవైపు ఎవరో వీళ్ల మాటలంతా వీడియో రికార్ట్ చేస్తారు. ఇంతలో నయని అక్కడికి వస్తుంది.
నయని: ఏంటి బాబుగారు గాయత్రీ నాదగ్గర ఉంటే ఎవరో వెళ్లి ఈ పాపని తీసుకొస్తారని అంటున్నారు
విశాల్: ఈ పాప కాదులే నయని
హాసిని: అబ్బా చెల్లీ ఓ వైపు ఎవరో వీడియో తీశారు అని మేము టెన్షన్ పడితే నువ్వు వచ్చి మళ్లీ ఇవన్నీ అడుగుతున్నావ్
నయని: ఏంటి మళ్లీ వీడియో వచ్చిందా
విశాల్: వదినా మీరు ఆగండి.. నేనే చెప్తా నయనికి.. నన్ను పెంచిన అమ్మ నన్ను కన్న అమ్మని తీసుకురావడం ఓ అద్భుతం ఓ వేడుక అందుకే ఇదంతా వీడియో తీస్తానని వీడియో గ్రాఫర్ చెప్పాడు
నయని: నిజంగా తీసుకొస్తారా బాబుగారు
హాసిని: పిల్లలు దొరకడం ఓ పనా
నయని: కానీ నా పెద్ద బిడ్డ దొరకాలి కదా అక్క
హాసిని: తననెలా తీసుకొస్తారు
నయని: అత్తయ్య వాళ్లు వెళ్లారు కదా
విశాల్: ప్లీజ్ ఆగండి కొంచెం ఓపిక పట్టండి. కాసేపట్లో అంతా క్లారిటీ వచ్చేస్తుంది
మరోవైపు ఎద్దులయ్య, డమ్మక్క, పావనామూర్తి విశాలాక్షి చుట్టూ తిరిగి ప్రదక్షణలు చేస్తారు. ఇంతలో అందరూ అక్కడికి వస్తారు.
విశాలాక్షి: అమ్మా నువ్వు ఈ గాయత్రీ పాపని మీ ఆయనకు ఇవ్వాలి
నయని: ఎందుకు
విశాలాక్షి: మరి తిలోత్తమ తీసుకొచ్చే బిడ్డను ఎత్తుకోవా
విక్రాంత్: అంటే చంటి పాపని తీసుకొస్తున్నారా
వల్లభ: ఏంటి డౌటా.. ఇవాళ తుపాకీ లేకుండానే తూటా పేలనుంది
విశాల్: అన్నయ్య అమ్మ ఎక్కడ
వల్లభ: మీ అమ్మ బరువు మామూలుగా ఉండదు కదరా తమ్మి.. మోసుకొస్తుంది గాయత్రీ పెద్దమ్మని
హాసిని: మనసులో..(నయని గాయత్రీపాపని విశాల్‌కి ఇవ్వడంతో) అయ్యో చెల్లి ఇప్పటి వరకు నీ పెద్ద కూతుర్నే నువ్వు ఎత్తుకున్నది అది నీకు ఎలా చెప్పాలో తెలీక ఇలా బొమ్మలా నిల్చొన్నా
విశాల్: మనసులో.. తిలోత్తమ అమ్మ ఎవర్నీ తీసుకొస్తుందో ఏంటో తను మా అమ్మ కాదు అని చెప్తే నువ్వు ఎలా చెప్తున్నావ్ అంటారు.
తిలోత్తమ: (ఇంతలో తిలోత్తమ ఓ పాపను తీసుకొని వస్తుంది.) అలా చూస్తావ్ ఏంటి నయని నీ బిడ్దను ఎత్తుకోవడానికి ఎవరి అనుమతి అయినా అడగాలా ఎత్తుకో అని నయనికి పాపను ఇస్తుంది
సుమన: ఏంటి అక్క బిడ్డను ఎత్తుకుంటే ఆనంద బాష్పాలు గలగలా రాలిపోతాయి అనుకున్నా ఎవరో పరాయి బిడ్డను ఎత్తుకున్నట్లు అలా ఎత్తుకుని చూస్తున్నావ్
నయని: పిల్లలు ఎవరైనా పరాయి వాళ్లు కాదు సుమన. దేవుళ్లని మోసే అదృష్టం వచ్చిందనుకుంటాను
విశాలాక్షి: ఎద్దులయ్య మిగతా కార్యం పూర్తి కావాలి అంటే నువ్వు ఆ పని మీద వెళ్లాలి కదా
ఎద్దులయ్య: చిత్తం తల్లి
వల్లభ: ఏం కార్యం మీద వెళ్లాడు ఎద్దులయ్య
హాసిని: ఏం కార్యం అయితే మీ కెందుకు ముందకు మీ పాపపు కార్యం ముగించండి
తిలోత్తమ: పాపపు పని కాదు పాప పని
విక్రాంత్: అదేలే అమ్మా.. మొత్తానికి పెద్దమ్మని వెతికి తీసుకొచ్చేశారు
విశాల్: మేము ఇంత కష్టపడ్డ తీసుకురాలేకపోయాం. మీరు ఇంత సింపుల్‌గా ఎలా తీసుకురాగలిగారు
పావనామూర్తి: ఇంతకీ పాప నయనీ లా ఉందా.. విశాల్ లా ఉందా.. ఎవరు అని తేల్చకుందా అనుకున్నా తెలీయడం లేదు.
వల్లభ: వేసిన జోకులు చాలు కానీ ఈ పిల్ల పేరుమీద ఎంత ఆస్తి రాస్తారో చెప్పండి
విక్రాంత్: బ్రో అటు తిరుగి ఇటు తిరిగి చివరకు ఆస్తి దగ్గరకే వస్తారు అనుకున్నా
తిలోత్తమ: అవునురా దత్తత తీసుకున్న గాయత్రీ పాప పేరుమీదే పాతిక కోట్లు రాసినప్పుడు సొంత బిడ్డకు ఎంత ఇవ్వాలి
సుమన: అదే నా దగ్గర ఉంటే ఆస్తి మొత్తం ఇచ్చేస్తా
విశాల్: దానిదేముంది సుమన మన బిడ్డ అంటే మన దగ్గర ఉన్నది అంతా తనదేగా
తిలోత్తమ: ఇంత ఈజీగా ఒప్పు కుంటావ్ అనుకోలేదు నాన్న. నీ సహృదయానికి జోహార్లు
విశాలాక్షి: పరిస్థితి అలాంటిది అని నాన్న అన్నింటికి రాజీ పడుతున్నాడు.. అమ్మా నువ్వు ఎందుకు ఏం మాట్లాడుతున్నావ్
నయని: ఇంత కష్ట పడి నా బిడ్డను ఇంటికి తీసుకొచ్చిన తిలోత్తమ అత్తయ్యని ఎలా అభినందించాలో తెలీయడం లేదు.. మీరు చెప్పండి అత్తయ్య నగలు ఇమ్మంటారా, స్థలం ఇమ్మంటారా, డబ్బు ఇమ్మంటారా చెప్పండి
వల్లభ: అమ్మా నేను కూడా నీ వెనక తిరిగి కష్టపడ్డాను కదా నయని నీకు ఇచ్చిన దాంట్లో నాకు కొంత ఇవ్వు అమ్మా
తిలోత్తమ: నయని అర్థం చేసుకుంటుంది. మనం అడగక్కర్లేదు
నయని: చేయి చాచండి అత్తయ్య
మరోవైపు ఓ మహిళ డబ్బులు లెక్కిస్తూ ఉంటూ తన మనవరాలు ఈ ఇంటి బిడ్డ అయితే కోటీశ్వరురాలు అయితే అప్పుడు డబ్బే డబ్బు అనుకుంటుంది. అది అంతా విన్న ఎద్దులయ్య నిన్ను ఈ ఇంటికే పరిగెత్తిస్తాను అని ఎద్దులా తన దగ్గరకు వెళ్తాడు. ఇక నయని తిలోత్తమకు కుడి చేయి ఒక్కటే చాలు అంటుంది. ఇక తిలోత్తమ తెచ్చిన ఆ పాపతో పాప మా అత్తయ్య కుడి చేతిని నీ కుడి చేతితో పట్టుకో అమ్మా అని పాప చేతిని తన అత్తయ్య చేతిలో పెడుతుంది. అందరూ షాక్ అవుతారు.
సుమన: చెక్ ఇస్తావ్ అనుకుంటే పాప చేతిని ఇస్తావ్ ఎంటి అక్క
నయని: ఇదే లెక్క మీకు తెలుసో లేదో తెలీదు కానీ స్పష్టంగా చెప్తాను వినండి. నేను కన్నది గాయత్రీ అమ్మగారిని. తను నా నుంచి దూరం అయిపోయిన ఏ క్షణం అయినా నా దగ్గరకు వస్తుంది అనే ఆశతో ఉన్నాను. ఈ పాప గాయత్రీ పాప అయితే తిలోత్తమ్మ కుడిచేతిని గాయత్రీ అత్తయ్య కుడిచేతితో తాకితే చాలు నిప్పు రవ్వలు ఎగిసి పడతాయి కదా అత్తయ్య.. నిప్పు అంటుకొని అత్తయ్య కేకలు పెడతారు. జన్మజన్మలు వెంటాడే అగ్ని జ్వాలని గుర్తిస్తే చాలు తను నేను కన్న తొలి బిడ్డ అని రుజువు అవుతుంది. అయినా మీకు ఈ విషయం తెలుసుకదా అత్తయ్య ఇంత చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయారు.
విశాలాక్షి: అర్థం అదే కదా డమ్మక్క ఈ బిడ్డ నయని బిడ్డ కాదని
తిలోత్తమ: మంట వస్తుందని నీకు ఎలా తెలుసు
నయని: స్వామిజీ గారు చెప్పారు కదా
వల్లభ: మమ్మీ మనకు అఖండ స్వామి చెప్పినట్లు నయనికి గురువు గారు చెప్పారు అనుకుంటా
విశాల్: అదేంటి అమ్మ ఎన్ని టెస్టులు చేసినా ఆ బిడ్డ మా బిడ్డే అని తెలుస్తుంది అన్నావ్
మరి ఈ పాప ఎవరు అని అందరూ అనుకుంటే కాసేపట్లో తెలుస్తుంది అని డమ్మక్క అంటుంది. మరోవైపు బయట ఉన్న ఆ మహిళ దగ్గరకు ఎద్దులయ్య వెళ్లి తనని వెంబడిస్తారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply