Trinayani Serial November 29th Episode - 'త్రినయని' సీరియల్: మరో కొత్త డ్రామాకు సిద్ధమైన తిలోత్తమ - గాయత్రీ పాపను తీసుకొస్తానంటూ హడావిడి!
Trinayani Serial Today Episode - నయని పెద్ద కూతురైనా గాయత్రీ దేవిని తాను తీసుకొస్తానంటూ తిలోత్తమ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది
Trinayani Serial November 29th Episode
నయని: ఇప్పుడు అర్థమైందా చెల్లి ఎవరు నిన్ను రెచ్చగొడతారో వాళ్లే నిన్ను చావగొడతారని
విశాల్: సుమన నా కూతురికి గండం అని మాకు తెలిసినా ఏ విధంగా వస్తుంది అని తెలుసుకుందామనే పెద్ద బొట్టమ్మని రప్పించాం. ఉలూచిని ఎత్తుకుందే తప్ప ఎత్తుకొని పారిపోలేదు. ఏది ఏమైనా నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ సుమన
విక్రాంత్: బ్రో నువ్వు సారీ చెప్పడం ఏంటి కళ్లలో కారం పడిందని కాదు అహంకారంతో దాని కళ్లు ఎప్పుడో మూసుకుపోయాయి
సుమన: అనండి అనండి నన్ను అన్న మాటలల్నీ మీకే తగులుతాయి.
డమ్మక్క: సుమన బిడ్డ చేతిలో ఉంటే ఎలా వెళ్తావ్ నేను తీసుకెళ్తా పద అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
తిలోత్తమ: పెద్దబొట్టమ్మ వెళ్లిపోతుంటే.. ఆగు.. ఇంతవరకు సుమన, నయనిలకు మాత్రమే కనిపించేదానివి కదా ఇప్పుడేంటి అందరకీ కనిపిస్తున్నావు
పెద్దబొట్టమ్మ: గవ్వలు ఉన్నంత వరకు అందరికీ కనిపిస్తాను అమ్మా
మరోవైపు సుమన గొంతు పట్టుకోవడంతో గోళ్లు తగిలి దెబ్బతగలడంతో తిలోత్తమ మందు రాసుకుంటుంది. ఈ విషయంలో సుమనపై ఇప్పుడు సీరియస్ అయితే నయని వాళ్లని దెబ్బతీయడం జరగదని సుమన చేసిన ఆ పనిని వదిలేస్తామని వల్లభతో అంటుంది తిలోత్తమ. ఇక నయనిని దారుణంగా దెబ్బతీయాలని తిలోత్తమ ఓ ప్లాన్ వేస్తుంది. దాన్ని వల్లభకు చెప్తుంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసి పెట్టమని వల్లభకు సూచిస్తుంది.
ఇక సుమన తన గదిలో ఉంటుంది. అక్కడికి విక్రాంత్ వస్తాడు. ఎందుకు వచ్చారు.. మధ్యాహ్నం మల్లెపూలు పట్టుకొని ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. నీ కోసమే అని విక్రాంత్ అంటే అవును పువ్వులు చూపి నా కళ్లు పొడిచేశారు అని వెటకారం చేస్తుంది. ఇక విక్రాంత్ దిండు తీసుకొసు బయట పడుకోడానికి వెళ్తే వెళ్లొద్దు అని సుమన ఆపుతుంది. ఏ నువ్వు బయటకు వెళ్లి పడుకుంటావా అని విక్రాంత్ అడిగితే ఇంత పెద్ద బెడ్ మీద మన ఇద్దరం పట్టమా అని సెటైర్ వేస్తుంది. దీంతో కోపంతో విక్రాంత్ మొన్న బూడిదైన డబ్బులను మళ్లీ దక్కించుకుకోవడానికి నన్ను ఇక్కడ పడుకోమంటున్నావా అని అడుగుతాడు. చచ్చినా ఆ పని చేయను అని టచ్ కూడా చేయను అని విక్రాంత్ చిరాకు అవుతాడు. ఇక నయని, విశాల్‌లకు ఏమైనా హాని చేయాలని చూస్తే అస్సలు ఊరుకోను అని హెచ్చిరించి వెళ్లిపోతాడు.
సుమన: (హాల్‌లో హాసినితో విశాల్, విక్రాంత్‌లు సంతకాలు పెట్టించుకుంటుంటే) ఏంటి అక్కా గుడ్డిగా సంతకాలు పెట్టేస్తున్నావ్
హాసిని: నాకు కళ్లు ఉన్నాయి చూస్తున్నాలే చిట్టి
సుమన: ఏ కాగితం చదవకుండానే సైన్ చేస్తున్నావ్ జాగ్రత్త
విక్రాంత్: నీలా కాగితాలు మార్చే అలవాటు మాకు లేదు
సుమన: నేను కాగితాలు మాత్రమే మార్చేస్తా మీరు జీవితాలు మార్చేస్తారుగా
పావనామూర్తి: అబ్బబ్బా.. పొద్దున్న లేస్తే చాలు ఏదో ఒక యుద్ధం మొదలవుతుంది. కొద్ది సేపు అయినా ప్రశాంతంగా ఉండొచ్చు కదా
డమ్మక్క: ఏమీ తోచకపోతే నయనిలా పూజలు చేసుకోవచ్చుకదా
పావనామూర్తి: (నయని అందరికీ హరతి ఇస్తుంది) ఉదయాన్నే అందరికీ హారతి ఎందుకు ఇస్తున్నావు తల్లీ
వల్లభ: తాళపత్రాల్లో గండం ఆగమనం గురించి రాసి ఉంది కదా అందుకే
పావనామూర్తి: కానీ గాయత్రీ పాప పసిబిడ్డగా ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు కదా
తిలోత్తమ: నాకు తెలుసు
నయని: అత్తయ్య అమ్మగారు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా
తిలోత్తమ: నువ్వు ఇంకా గౌరవంగా అమ్మగారు అంటున్నావ్ కానీ ఈ జన్మలో గాయత్రీ అక్కయ్య నీ పెద్ద కూతురు
విశాల్: ఆ లెక్కలు మాకు తెలుసు అమ్మా. పాప ఎక్కడ ఉందో మీకు తెలుసా అని అడుగుతున్నా
వల్లభ: ఓరేయ్ తంబి మా అమ్మకు మీ అమ్మ జాడ తెలుసు అని స్పష్టంగా చెప్పినా తెలుసా అని ఎలా అడుగుతున్నావ్
తిలోత్తమ: సర్లే మీకు నమ్మబుద్ధి కావట్లేదు అంటే తేలికగా తీసుకుందాం
నయని: అయ్యో అలా ఎలా వదిలేస్తాం అత్తయ్య. ఇన్నాళ్లుగా దూరం అయింది వెతికి ఎదురు చూస్తూ ఆశ పడుతున్న నాకు గాయత్రీ అమ్మగారి జాడ తెలుసు అని మీరు చెప్తుంటే నా గుండె చూడండి ఎంత వేగంగా కొట్టుకుంటోంది.
వల్లభ: కన్నావు కదా ఆ మాత్రం దడ ఉంటుంది పెద్ద మరదలా. మీ అమ్మ ఎటువైపు ఉందో తెలుసా
ఎద్దులయ్య: ఇటువైపు పుత్రా(గాయత్రీ పాపని ఎత్తుకొని వస్తూ)
విక్రాంత్: ఏంటి ఎద్దులయ్య మీకు కూడా మా పెద్దమ్మ జాడ తెలుసా
ఎద్దులయ్య: తెలుసు నాయనా అమ్మా రా అమ్మా.. విశాలాక్షి పాప వస్తుంది.
ఇక గాయత్రీ దేవి జాడ తనకు తెలుసని అంటే అందరూ నమ్మనట్లు చూశారని కేవలం విశాలాక్షి మాత్రమే తన మాటకు మద్దతు పలికిందని తిలోత్తమ అంటుంది. దీంతో ఎద్దులయ్య తమరు ఎవరూ చేయని పని చేసినందుకు అభినందించాలి పెద్దమాత అంటాడు. ఇక నయని కూడా నిజమే అత్తయ్య ఏదో ఒక రోజు నా పెద్ద కూతురు వస్తుంది అని ఎదురు చూస్తున్నాం తప్పితే వెతకడం లేదు అంటుంది. దీంతో వల్లభ మీరు ఊ అంటే మా అమ్మ తీసుకువస్తుంది అంటాడు. ఇక డమ్మక్క అలా ఎలా తీసుకొస్తారు అంటుంది. సుమన అయితే వాళ్లకు తెలుసు కదా తీసుకొస్తారు అంటుంది. తిలోత్తమ తప్పకుండా బిడ్డను తీసుకొస్తా అంటుంది. మరోవైపు తన దగ్గర ఉన్న గాయత్రీ పాపే నయని పెద్ద బిడ్డ అని తనకు తెలిసినా చెప్పలేకపోతున్నా అని హాసిని బాధ పడుతుంది. ఇక వల్లభ, తిలోత్తమ పాపను తీసుకొస్తామని అక్కడి నుంచి వెళ్తారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆