అన్వేషించండి

Trinayani Serial December 2nd Episode - 'త్రినయని' సీరియల్: విశాలాక్షిని తన వశం చేసుకోవాలనే తిలోత్తమ ప్రయత్నం ఫలిస్తుందా!

Trinayani Serial Today Episode: విశాలాక్షి అమ్మవారిని మైమరపించి నిజం తెలుసుకోవాలని తిలోత్తమ ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది

Trinayani Telugu Serial Today Episode

విశాలాక్షి: గాయత్రీ దగ్గర ఉన్న తాళపత్రమే చదువుతాను. ఎద్దులయ్య దాన్ని ఇలా ఇవ్వు.
సుమన: ఏంటి కనిపిస్తుందా.. మొత్తం శూన్యమేనా
విశాలాక్షి: కనిపిస్తుంది
తిలోత్తమ: ఏంటి శూన్యమా
విశాల్: విశాలాక్షి నీకు నిజంగానే కనిపిస్తుందా..
విశాలాక్షి: కనిపిస్తోంది నాన్న గండ్రని అక్షరాలు.. ఎంత బాగా రాశారో.. కానీ రాత బాగా రాసున్నా విధి రాత బాగోదు ఒక్కోసారి 
నయని: ఏం రాసుంది విశాలాక్షి అందులో
విశాలాక్షి: " కొడుకు తండ్రి అయితే, ఆ చిన్ని తండ్రి కూతురైన తల్లిని కాపాడుకోవడానికి కష్టాలపాలవుతాడు. "
నయని: వల్లభ నవ్వితే.. మీకు అర్థం కాలేదు బావగారు
తిలోత్తమ: నీకు అర్థమైందా నయని అర్థమైతే చెప్పు
నయని: గాయత్రి అమ్మగారికి వచ్చే గండాల నుంచి కాపాడబోయి విశాల్ బాబు గారు కష్టాల పాలవుతారు అని ఉంది.  
సుమన: పోనీలే మా ఆయనో హాసిని అక్క భర్తో అయ్యుంటే అయ్యో రామా అనుకునే వాళ్లం కూతురు కోసం ఆ మాత్రం కష్టపడాలి బావగారు
విశాల్: పర్లేదు సుమన.. తల్లి కోసం ఎంత చేసినా తక్కువే.  
హాసిని: విశాలాక్షి నీ టాలెంట్ చూపించమంటే ఇలా చదివేశావేంటి
విశాలాక్షి: ఇందులో అలాగే ఉంది పెద్దమ్మ
విక్రాంత్: లేదు లేదు నువ్వు నీకు గుర్తింపు తెచ్చుకోవాలని ఇలా చదివేశావ్
ఎద్దులయ్య: తప్పు పుత్రా గుర్తించడం లేదు కానీ అమ్మ గుర్తింపు చాలానే ఉంది
డమ్మక్క: అమ్మ గుర్తుగానే సర్వం ఉంది తక్కువ చేసి మాట్లాడకు పుత్రా
విక్రాంత్: నేను నమ్మలేను బ్రో. మనుషులు ఎవరూ చదవలేనిది విశాలాక్షి ఎలా చదువుతుంది.
విశాల్: శివభక్తులకు అంత శక్తి ఉండొచ్చు
విక్రాంత్: అసాధ్యం బ్రో పెద్ద బొట్టమ్మ తప్పితే ఆ తాళపత్రాలు చదవాలి అంటే దేవుడే దిగి రావాలి 
తిలోత్తమ: పర్లేదు లేరా చిన్న పిల్ల సరదాగా ఉన్న అదే నిజం అవుతుందేమో చూద్దాం.. ఏం నయనీ
సుమన: మొగుడు నరకయాత్ర అనుభవిస్తే ఇంకేం సమాధానం ఇస్తుంది మా అక్క

మరోవైపు విక్రాంత్ తన గదిలో వర్క్ చేస్తుంటాడు. అప్పుడు సుమన కప్పులో పాలు  తీసుకొని వస్తుంది. పాలు కప్పులో ఏంటి గ్లాస్‌లో తీసుకురాలేదు ఏంటి అని అడుగుతాడు. దీంతో సుమన "నేను నీరు తెస్తే దాహం లేదు అంటారు. పాలు తెస్తే మూడ్ లేదు అంటారు. ఇప్పుడు నేను కప్పులో తెస్తే గ్లాస్‌లో తేలేదు ఎందుకు అంటున్నారు. ఎలా అయినా నాతో గొడవ పడాలి అనే చూస్తారా.. అయినా నేను ఈ పాలు మీకోసం తీసుకురాలేదు. ఉలూచి కోసం తీసుకొచ్చా" అని అంటుంది. ఇక సుమన ఉయ్యాల దగ్గరకు వెళ్తే అందులో పాప ఉండదు. పాప ఎక్కడ అని విక్రాంత్‌ని అడిగితే నాకు తెలీదు అంటాడు. సుమన కాస్త కంగారు పడుతుంది. ఇంతలో హాసిని ఓ పాపని తీసుకొస్తుంది. నేనే బయటకు తీసుకెళ్లా అని చెప్తుంది. 
సుమన: నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా తీసుకెళ్తావు అక్క
హాసిని: చెప్పేది పూర్తిగా వినకుండా అలా అవుతావు ఏంటి చిట్టీ.. చిట్టీ రోజులు గడిచే కొద్ది నీ బిడ్డ ఉలూచి కూడా అల్లరి చేయడం ప్రారంభించింది. వంట గదిలో శుభ్రం చేస్తుంటే.. చెల్లి వచ్చి ఈ పాపను నీకు ఇవ్వమని చెప్పింది అందుకే తీసుకొచ్చా అంటూ ఓ బాస్కెట్‌ చేతికిస్తుంది.
సుమన: అలా నా బిడ్డ గల్లంతు అయితే నేను బతికి ప్రయోజనం ఏముంది అని అలా అనేస్తుంటా
హాసిని: అంటే ఏంటి నీ ఉద్దేశం సూటిగా చెప్పు చిట్టీ
సుమన: గాయత్రీ అమ్మగారు పసిపాపగా రేపో మాపో ఈ ఇంటికి వస్తారు అని మాటలు చెప్పే మా అక్క స్థానంలో నేను ఉండుంటే కన్న బిడ్డ ఏమైపోయిందా అనే టెన్షన్‌లో కన్ను మూసేదాన్ని. 
విక్రాంత్: ఇప్పుడు తెరుచుకున్నాయ్ అనుకున్నావా నీ కళ్లు ఎప్పుడూ మూసుకొనే ఉంటాయి. 
హాసిని: నవ్వు ఉండవయ్యా బాబు.. చూడు చిట్టీ నయని వందేళ్లు బతకాలి.. ముత్తయిదువుగా పోవాలి అని మనలాంటి ముత్తయిదువులు కోరుకోవాలే గానీ తన గురించి తప్పుగా మాట్లాడకూడదు. తనే లేకపోతే మనం ఇలా ఉండేవాళ్లమే కాదు.
సుమన: సరే లే అక్క నా బిడ్డకు పాలు తాగించుకోవాలి నువ్వు ఇక వెళ్లు 

తిలోత్తమ: (అఖండ స్వామి దగ్గరకు తిలోత్తమ, వల్లభ వస్తారు) అఖండ స్వామి నాగులా పురం పెట్టెలో ఉన్న తాళపత్రాలను పెద్దబొట్టమ్మ చేత చదివించారు. పునర్జన్మలో పురుడు పోసుకొని తప్పించుకొని తిరుగుతున్న గాయత్రీ అక్కయ్యకి గండం అని తెలిసింది.  
అఖండ స్వామి: కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా అన్నదే తెలీదు 
వల్లభ: అది తెలిసుంటే మీ దగ్గరకు వచ్చుండేవాళ్లం కాదు
అఖండ స్వామి: నాకు తెలుసు
తిలోత్తమ: అలా అని నిజం చెప్పకుండా ఉన్నారా స్వామి.. వీడి మాటలు పట్టించుకోకండి. 
అఖండ: లేదు తిలోత్తమ దైవానుసారమే నడుచుకుంటాను. నేరుగా చూసినా చూడకున్నా నీకు ఎంత వరకు తెలుసో అదే చెప్పగలవు. 
వల్లభ: మీకంటే ఆ గారడి పిల్ల విశాలాక్షి బెటర్ అనుకుంటా
అఖండ: వల్లభ అన్నదాంట్లో తప్పులేదు. అన్నందుకు బాధపడటం లేదు. సత్య ప్రమాణంగా చెప్తున్నాను. ఆ విశాలాక్షికి చాలా తెలుసు. వెళ్లండి తిలోత్తమ విశాలాక్షినే అడగండి
తిలోత్తమ: చెప్పదు స్వామి ఆ విశాలాక్షి నయని జట్టు. విశాల్‌ని నాన్న అని పిలిచే ఇంకో కూతురు అనుకోండి. మేము గాయత్రీ పాప కోసం ఆరా తీస్తే అందరికీ చెప్పేస్తుంది.
వల్లభ: మమ్మీ అయితే మనం తను ఎవరో అని ఆ విశాలాక్షినే అడుగుదాం
అఖండ: మూర్ఖడైనా నీ కొడుకు మంచి మాట చెప్పాడు. ముందు ఆ విశాలాక్షిని అడిగి తెలుసుకోండి.. (తిలోత్తమ చేతికి పూల మాల ఇస్తూ) ఈ పూలు విశాలాక్షి పెట్టుకున్నట్లు చేస్తే మెల్లగా పూనకం వచ్చినట్లు అన్ని నిజాలు చెప్పేస్తుంది. మీరు శ్రద్ధగా వినండి తిలోత్తమ.. విశాలాక్షిని మైమరిపించేలా చేసే సమయంలో నాగయ్య పాము ఇంట్లో చొరబడకుండా చూసుకోండి. ఆ సర్పం ఇంట్లోకి వస్తే నిజం బయట పడదు. 
తిలోత్తమ: అది బయటే ఉండేలా చేయాలి అంటే ఏం చేయాలి స్వామి.. ఈ పూల మాల ఇచ్చారు అంటే పాము రానే వస్తుంది. 
అఖండ: నిజం కచ్చితంగా నాగయ్య పాము వస్తుంది. (గులాబీ పూల రేకులు ఇస్తూ) ఈ మంత్ర పుష్పం పూలు అడ్డంగా పెడితే అక్కడే ఆగిపోతుంది పాము తీసుకో తిలోత్తమ. జాగ్రత్త తిలోత్తమ.. తానే సర్వం.. అని తెలీక విశాలాక్షిని పరీక్షిస్తున్నారు. (తిలోత్తమ, వల్లభ వెళ్లిపోయిన తర్వాత.. ఆ తల్లిని నేరుగా చూస్తే గుండె ఆగి చస్తారు.  తెలియని అల్పుల వీర ప్రయత్నం.. 

ఇక ఇంటి గేటు ముందు అఖండ స్వామి ఇచ్చిన గులాబి రేకులను చల్లుతారు. ఇక హాల్‌లో అందరూ ఉంటారు. సుమన సాంబ్రాణి తీసుకొని వచ్చి హాసినికి ఇస్తుంది. ఇక ఉలూచినీ తీసుకొని రమ్మని చెప్తుంది నయని. ఇక ఎద్దులయ్య తన పక్కనే ఉన్న విశాలాక్షితో అమ్మా.. దూపం మీకు కదా వేయాలి అని అంటాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన తిలోత్తమ.. గారడి పిల్లి ఇప్పుడు పసిపాప అయిందా అని అడుగుతుంది. మరోవైపు ఏదో జరగబోతుంది అని గురువుగారు హడాహుడిగా ఇంటికి వస్తుంటారు. ఇక నాగయ్య పాము మంత్ర పుష్పాలను దాటి లోపలికి వెళ్లడానికి చాలా ప్రయత్నిస్తుంటారు కానీ వెళ్లలేకపోతారు. దీంతో గురువుగారు నేను వచ్చే వరకు ఆగు నాగయ్య మంత్ర పుష్పాలు తాకకు అని అంటూ ఉంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Pawan Kalyan Met With Modi:  ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
Brahmamudi Maanas Nagulapalli: కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Embed widget