Trinayani Serial Today December 26th Episode - 'త్రినయని' సీరియల్: ఉలూచిని పెట్టెలో దాచేసిన పెద్దబొట్టమ్మ, శ్యామల - నయని ఏం చేయనుంది!
Trinayani Today Episode : ఉలూచిని పెద్దబొట్టమ్మ నాగులాపురం పెట్టెలో దాచేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Telugu Serial Today Episode : పెద్దబొట్టమ్మ ఉలూచితో ఎవరూ చూడకుండా ఆడుకుంటూ ఉంటుంది. మరోవైపు శ్యామల చీరలు సర్దుతూ ఉంటుంది. ఇక అక్కడికి ఎద్దులయ్య, డమ్మక్క వస్తారు.
ఎద్దులయ్య: నువ్వు తెచ్చిన సంచి సరిపోనన్ని చీరలు కొన్నావా మాతా.
శ్యామల: కుంకుమ పెట్టుకోలేని అభాగ్యురాలిని ఇన్ని చీరలు కట్టుకుంటే ముక్కంటిపురం ఊరుకుంటుందా.
డమ్మక్క: రోజులు మారాయి శ్యామలమ్మ ముత్తయిదువులు కూడా పూలు, గాజులు వేసుకోవడం లేదు అంటే నమ్ము.
శ్యామల: అలాగే ఉన్నారు కొంత మంది ఈ పోకడ పల్లెటూర్లలో కూడా చూస్తున్నా.
పెద్దబొట్టమ్మ: తనలోతాను.. ఈ శివభక్తులు పక్కకు వెళ్తే కానీ పని అవ్వదు.
ఎద్దులయ్య: అయినా రేపు కదా మీరు ఊరు వెళ్లేది.
శ్యామల: ఎంటయ్యా ఈ పూట నన్ను పడుకోనివ్వరా..
డమ్మక్క: అంటే మన దారి మనల్ని చూసుకోమంటుంది ఎద్దులయ్య.
పెద్దబొట్టమ్మ: శ్యామల పాపని ఎత్తుకొచ్చాను.
శ్యామల: ఎంత పని చేశావు నాగులమ్మ సుమన నన్ను చూసింది అంటే చంపి పాతర వేస్తుంది.
పెద్దబొట్టమ్మ: ఇంకో ఐదు నిమిషాల్లో పూర్తిగా సూర్యాస్తమయం అయిపోతుంది. అప్పుడు నన్ను ఎవరూ తప్పు పట్టలేరు.
డమ్మక్క: దూరం నుంచి చూస్తూ.. విచిత్రం జరగబోతుంది ఎద్దులయ్య.
ఎద్దులయ్య: తొందరపడకుండా వ్యవహారం పూర్తి చేయగలిగితే సమస్యే లేదు. లేకపోతే ఊలూచికి ప్రమాదం డమ్మక్క.
డమ్మక్క: నాగులమ్మ ఆలోచించగలదు లే.
మరోవైపు ధురందర, హాసిని, పావనామూర్తి మేడ మీదకు వస్తుంటారు. వాళ్లని చూసి పెద్దబొట్టమ్మ, శ్యామల కంగారు పడతారు. వాళ్లు ఊలూచి చూస్తే ఎలా అని శ్యామల అడిగితే.. నీ చేతి మీద పాము బొమ్మ లేదు కాబట్టి నన్ను కూడా చూసేస్తారు అని పెద్దబొట్టమ్మ అంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకొని ఇద్దరూ చాలా కంగారు పడతారు.
పెద్దబొట్టమ్మ: ఉలూచిని తీసుకొని నేను బయటకు వెళ్లిపోతాను.
శ్యామల: నువ్వు వెళ్లిపోతే.. పాప కనిపించకపోతే నన్ను ఆడిపోసుకుంటారు. నీ వల్ల నాకు మర్యాద పోయేలా ఉంది. ఇప్పుడు నేను ఏం చేయను.
ఇక పెద్దబొట్టమ్మ పాపను శ్యామలకు ఇచ్చి చీర పరచి అందులో నాగులాపురం పెట్టెపెట్టను పెట్టి ఉలూచిని పెడుతుంది పెద్దబొట్టమ్మ. ఇక మిగతా చీరలు అన్నీ దానిపై కప్పేస్తుంది. తర్వాత పెద్దబొట్టమ్మ దాక్కుంటుంది. ఇక హాసిని వాళ్లతో పాటు అందరూ అక్కడికి వస్తారు. ఎంటి పిన్ని అప్పుడే బయలుదేరిపోయారా ఇంకా తిననేలేదు అని హాసిని అంటుంది. దీంతో ఎద్దులయ్య, డమ్మక్క మేమేం చూడలేదు మాకు ఏం తెలీదు అని అంటారు. అందరూ విచిత్రంగా చూస్తారు.
పెద్దబొట్టమ్మ: ఏం తెలీనట్లు ఇంట్లోకి వస్తూ.. బాగున్నావా సుమన..
సుమన: బాగున్నాను కానీ బాగానే వచ్చావే.
తిలోత్తమ: చీర మార్చిందే పెద్ద బొట్టమ్మ.
నయని: పెద్దమ్మ ఈ చీర ఆ రోజు సుమన మీకు వాయినంగా పెట్టిన చీరేనా.
పెద్దబొట్టమ్మ: అవును మంచి చీరే పెట్టింది మీ చెల్లెలు.
ఎద్దులయ్య: చిట్టిమాత సంగతి సరే నువ్వేం పెట్టావు అంట.
డమ్మక్క: ఎందులోనూ ఏం పెట్టలేదా.. అదే అడుగుతున్నాడు ఎద్దులయ్య.
శ్యామల: మనసులో.. పిల్లను పెట్టెలో పెట్టడం వీళ్లు కానీ చూశారా ఏంటి. ఏం అవుతుందో ఏంటో.
హాసిని: ఈ మూట ఏంటి పిన్ని.
శ్యామల: చీరలు ఇచ్చారు కదా అమ్మ వాటిని మూట కట్టాను.
తిలోత్తమ: ఇంకొన్ని కలిపేసి మూట కట్టేసింది అంటావా..
నయని: మీరు అలా అంటే మా అమ్మని అవమానించినట్లే అత్తయ్య.
సుమన: దానికి బదులు అనుమానించినా పర్లేదు.
నయని: అనుమానించడం ఎందుకు చెల్లి.
సుమన: నా బిడ్డ క్షేమమే నాకు ముఖ్యం ఉలూచి గదిలో ఉందో లేదో చూసి వస్తాను.
పెద్దబొట్టమ్మ: మూట మీద అనుమానం రాకుండా నా మీద అనుమానం వచ్చింది అక్కడ ఉలూచి లేకపోతే సుమన నన్ను వదిలిపెట్టదు.
తిలోత్తమ: శ్యామల నయని ఇచ్చిన చీరల్ని చూడొచ్చా.
నయని: చూడనీ అమ్మ.
విక్రాంత్: మా అమ్మకి చీరలు చూపించినట్లే పెద్దబొట్టమ్మకు ఉలూచిని చూపించండి పాపం సంతోషంగా వెళ్లి పోతుంది.
ఇక సుమన రూంలోకి వచ్చి ఉలూచి కోసం వెతుకుతుంది. అప్పుడు ఉయ్యాల్లో ఉలూచి పాములా కనిపిస్తుంది. దీంతో సుమన సంతోషంగా అక్కడి నుంచి వస్తుంది. ఇక ఉలూచి గదిలో పడుకొని ఉందని సుమన చెప్తుంది. దీంతో షాకైన శ్యామల పెట్టెలో ఉంది ఎవరు అని కంగారు పడుతుంది. ఇక శ్యామల నాగులమ్మను ఉద్దేశించి.. నీకేం నువ్వు బాగానే ఉంటావు పెట్టెలో ఉన్న పాపకి గాలి ఆడకపోతే ఎలా అని అడుగుతుంది.
నయని: పెట్టెలో పాప ఉందా.
శ్యామల: ఉంది నయని.
నయని: ఏ పెట్టెలో..
డమ్మక్క: శ్యామలమ్మ ఎందుకు అలా చెప్పి అందర్నీ భయపెట్టిస్తావ్. ఉలూచి గదిలో ఉన్నప్పుడు మరి పెట్టెలో ఏ పాప ఉంటుంది. ఏదైనా చెప్తే దానికి అర్థం ఉండాలి.
నయని: నాకు అయితే ఏ పాపకి ఏం అయిందో అర్థం కావడం లేదు.
శ్యామల: లేదు లేదు నేను ఏదో పొరపాటున అనేశాను.
తిలోత్తమ: అంత సులువుగా నువ్వు నోరు జారవు కదా.
శ్యామల: అదే నా చిన్న కూతురిలా గబుక్కున ఏదో ఒకటి అనేయడం అలవాటు అయిపోయింది వదినా.
ఇక అందరూ తిందాం అని అక్కడి నుంచి వెళ్లిపోవడంతో శ్యామల, పెద్దబొట్టమ్మ నాగులాపురం పెట్టె తెరచి చూస్తారు. అందులో ఉలూచి ఉండదు. దీంతో షాకైపోతారు. నయని వెళ్తూ వెళ్తూ అనుమానం వచ్చి చూస్తుంది. తర్వాత పెద్దబొట్టమ్మ వెళ్లిపోతుంది. మరోవైపు తిలోత్తమ, వల్లభ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్లని దూరం నుంచి గాయత్రీ పాప చూస్తుంటుంది. తలుపుల దగ్గరకు వచ్చి పాలు పడేస్తుంది. నయని తల్లిని దొంగని చేయాలని అని తిలోత్తమ ప్లాన్ చేస్తుంది ఈలోపు ఆ పాలు మీద కాలు వేసి జారిపడిపోతుంది. హాసిని, విక్రాంత్ అక్కడికి వస్తారు. తిలోత్తమను పైకి లేపుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.