అన్వేషించండి

Roshan Kanakala's Speech : నల్లగా ఉన్నాడు వీడు హీరో ఏంటని అన్నారు - ట్రోల్స్ పై రోషన్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు, ఎమోషనల్ అయిన సుమ!

Roshan Kanakala : బబుల్ గమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రోషన్ కనకాల తనపై వచ్చిన ట్రోల్స్ కి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Roshan Kanakala's Speech At Bubble Gum Pre-Release Evevnt : ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల యాంకర్ సుమ కొడుకు రోషన్ బబుల్ గమ్ అనే సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవికాంత్ పేరేపు ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. రోషన్ కనకాల సరసన మానస చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ మూవీ పై మరింత క్యూరియాసిటీ పెంచేసింది.

డిసెంబర్ 29న ఈ సినిమాని విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో బబుల్ గమ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అడవి శేష్, విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ గెస్ట్లుగా వచ్చారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తనపై వచ్చిన ట్రోల్స్ కి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనపై నల్లగా ఉన్నావని కామెంట్స్ వచ్చాయని, చాలామంది ట్రోల్ చేశారని, నల్లగా ఉన్నాడు.. వీలు హీరో ఏంటి?, అసలు వీడు ఈరో మెటీరియల్ కాదు.. అంటూ దారుణంగా మాట్లాడుకున్నారని, స్వయంగా తన వెనకాలే మాట్లాడుకోవడం విన్నానని వెల్లడించిన రోషన్ కనకాల తన గురించి ట్రోల్ చేసిన వాళ్లందరికీ అదిరిపోయే కౌంటర్లు ఇచ్చాడు.

" నల్లగా ఉన్నానా? తెల్లగా ఉన్నానా అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ టాలెంట్ ముఖ్యం. నేను చాలాసార్లు విన్నాను. నా వెనకాల మాట్లాడడం చూశాను, చాలా ఆర్టికల్ చదివాను. అరేయ్ వీడు హీరో ఏంటి? వీడేంటి మస్తు నల్లగా ఉన్నాడు? వీడు హీరో మెటీరియల్ కాదు అని అన్నారు. నేను ఇలానే పుట్టాను. ఇలానే ఉంటా. ఒక మనిషికి నలుపు, తెలుపు అందం కాదు బ్రదర్ సక్సెస్ ని డిసైడ్ చేసేది. ఆ మనిషి హార్డ్ వర్క్ టాలెంట్ మాత్రమే డిసైడ్ చేస్తుంది. మన అందరి జాతకంలో ఏం రాసి పెట్టిందో ఎవరికి తెలియదు. కానీ నచ్చినట్టు మార్చుకుంటాను. కావలసింది లాక్కొని తెచ్చుకుంటాం. అది ఇజ్జత్ అయినా ఔకాద్ అయినా. ఒకరోజు వస్తది. వద్దనుకున్న వినబడతా. చెవులు మూసుకున్న వినబడతా. డిసెంబర్ 29న రాసి పెట్టుకోండి. థియేటర్ కి వచ్చేయండి. ఆది గాడి లవ్ ని చూడండి. ఆదిగాడి ఫైట్ ఫర్ రెస్పెక్ట్ ని చూడండి" అంటూ తనదైన స్పీచ్ లో ఆకట్టుకున్నాడు.

కొడుకు అలా మాట్లాడుతుంటే వెనకాల సుమ ఎంతో ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. మహేశ్వరీ మూవీస్ సమర్పణలో విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష, అనన్య, హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, జై రామ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

Also Read : ఎట్టకేలకు కూతురిని కెమెరాకి పరిచయం చేసిన రణ్ బీర్, ఆలియా.. రాహా ఎంత అందంగా ఉందో చూశారా?

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget